Suryaa.co.in

Andhra Pradesh

ప్రతిపక్షనేతలకు రాష్ట్రంలో పర్యటించే హక్కులేదా?

– రాష్ట్రంలోని రోడ్లు వైసీపీ నేతలేమైనా కొనుగోలు చేశారా?
– రాష్ట్రంలో వైసీపీ నేతలు తప్ప ప్రతిపక్షనేతలు తిరగకూడదా?
– టీడీపీ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి
ప్రజాస్యామ్యంలో ఎవరు ఎక్కడైనా స్వేచ్చగా సంచరించే హక్కు ఉంది. కానీ వైసీపీ ప్రభుత్వం రాజ్యాంగంలోని ‍హక్కుల్ని, ప్రజల స్వేచ్చనూ కాలరాస్తూ నియంత పాలన సాగిస్తోంది. నరసరావుపేటలో ఉన్మాది చేతిలో బలైన అనూష కుటుంబాన్ని లోకేశ్ పరామర్శిస్తే ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బందేంటి? టీడీపీ నేతల్ని పోలీసులు ఎందుకు అడ్డుకుంటున్నారు? రాష్ర్ర్టంలో ప్రతిపక్షపార్టీ నాయకులకు స్వేచ్చగా తిరిగే హక్కు లేదా? రాష్ట్రం ఎవరి జాగీరు? రాష్ట్రంలో వైసీపీ నేతలు తప్ప ప్రతిపక్ష పార్టీల నేతలు తిరగకూడదా? వైసీపీ నేతలు రాష్ట్రంలోని రోడ్లను ఎంతకు కొన్నారు? ప్రతిపక్ష పార్టీగా టీడీపీ నేతలం రాష్ట్ర్టంలో ఎక్కడైనా, ఎప్పుడైనా పర్యటిస్తాం అడ్డుకోవడానికి పోలీసులు ఎవరు?
బాధితులకు బాసటగా నిలవటం ప్రతిపక్షపార్టీగా మా బాధ్యత. బాధితులకు న్యాయం చేయటం పోలీసుల బాధ్యత. కానీ పోలీసులు బాధితులకు న్యాయం చేయకపోగా..న్యాయం చేయాలని కోరిన టీడీపీ నేతల గొంతు నొక్కటం బాధాకరం. గతంలో ఎన్నడూ లేని విధంగా వైసీపీ ప్రభుత్వం నియంత పాలన సాగిస్తోంది. జగన్ రెడ్డి నియంత పాలన ఎల్లకాలం సాగదు. వైసీపీ నియంత, అరాచక, అన్యాయపు ప్రభుత్వాన్ని గద్దెదింపేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారు.

LEAVE A RESPONSE