– బియ్యం సబ్సిడీ కింద కేంద్రం ఇచ్చే 6,500 కోట్లను సత్వరం విడుదల చేయాలి.
– నిల్వ ఉంచిన ధాన్యాన్ని ఎగుమతి చేసేందుకు కేంద్ర జోక్యం
– వానాకాలం ధాన్యం కొనుగోళ్ల పై పౌర సరఫరల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష
హైదరాబాద్: ధాన్యం దిగుబడిలో తెలంగాణా రాష్ట్రం అరుదైన రికార్డు నమోదు చేసుకుంది. భారతదేశ చరిత్రలోనే ఇది అరుదైన రికార్డ్. 67.57 లక్షల ఎకరాలలో వానాకాలం సాగు. 148.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి. సన్నాలు 40.75 ఎకరాలలో,దొడ్డు రకం 26.82 లక్షల ఎకరాలలో సాగు.
90.46 లక్షల మెట్రిక్ టన్నుల సన్నాలు,57.84 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు రకం దిగుబడి అంచనా. 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. తెలంగాణా నీటిపారుదల శాఖ సాధించిన విజయం ఇది. ధాన్యం దిగుబడి రికార్డ్ ఘనత తెలంగాణా రైతాంగానికి దక్కుతుంది.
వ్యవసాయ రంగంలో సరికొత్త అధ్యాయం సృష్టించిన రైతాంగానికి అభినందనలు. ధాన్యం దిగుబడి లో సాధించిన రికార్డు రాష్ట్ర ప్రభుత్వ పనితీరును ప్రతిబింబిస్తుంది. ఎన్నో సవాళ్ళను ఎదుర్కొని సాధించిన రికార్డు ఇది. భారతదేశంలో ఏ రాష్ట్రం సాదించని రికార్డు ఇది. అత్యల్ప కాలంలో రెట్టింపు ధాన్యం దిగుబడి సాధించింది అంటే అది రైతుల పట్ల ప్రభుత్వం అనుసరించిన విధానాలే కారణం.
సన్నాలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న 500 రూపాయల బోనస్ కొనసాగిస్తాం. ధాన్యం కొనుగోలుకు 21,112 కోట్లు అవుతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వానాకాలం,యసంగి పంటలకు కలిపి సన్నాలకు అందించే బోనస్ మొత్తం 3,158 కోట్లు అవుతుందని అంచనా వేస్తున్నాము. బియ్యం సబ్సిడీ కింద కేంద్రం ఇచ్చే 6,500 కోట్లను సత్వరం విడుదల చేయాలి.
అంతర్జాతీయ మార్కెట్ లో తెలంగాణా సన్నాలకు భారీ డిమాండ్. ఇప్పటికే ఫిలిప్పీన్స్ తదితర దేశాలకు సన్నాల ఎగుమతి. ధాన్యం కొనుగోళ్ల అంశంలో ఎఫ్. సి.ఐ తో అధికారులు సమన్వయం చేసుకోవాలి. రైతులు ఎక్కడా ఇబ్బంది పడకుండా క్షేత్ర స్థాయిలో అధికారులు పర్యటించాలి. ఎఫ్. సి.ఐ గిడ్డంగులలో నిల్వ ఉంచిన ధాన్యాన్ని ఎగుమతి చేసేందుకు కేంద్రం జోక్యం చేసుకోవాలి.