బీజేపీ వస్తేనే తెలంగాణ అభివృద్ధి

మల్కాజ్‌గిరి ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్‌

పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీని గెలిపించుకుంటే మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని మల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్‌ పిలుపునిచ్చారు. మల్కాజిగిరి పార్లమెంట్‌ ఎల్బీనగర్‌ నియోజకవర్గం చంపాపేట్‌ డివిజన్‌ పరిధిలో డిఫెన్స్‌ కాలనీ పార్క్‌, ఉదయ నగర్‌ కాలనీ కమ్యూనిటీ హాలు, మారుతి నగర్‌ కాలనీ లైబ్రరీలో బుధవారం ఏర్పాటు చేసిన బ్రేక్‌ఫాస్ట్‌ మీటింగ్‌ (టిఫిన్‌ బైటక్‌)లో ఆయనతో పాటు మాజీ జాతీయ బీసీ కమిషన్‌ సభ్యులు తల్లోజు ఆచారి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, చంపాపేట్‌ డివిజన్‌ కార్పొరేటర్‌ వంగా మధుసూదన్‌ రెడ్డి పాల్గొన్నారు.

ఈటెల రాజేందర్‌ మాట్లాడుతూ మోదీ 2.50 లక్షల ఇళ్లు అర్బన్‌ హౌసింగ్‌ కింద తెలంగాణకు మంజూరు చేస్తే అవి కూడా కేసీఆర్‌ కట్టలేకపోయాడని…1.75 లక్షల ఇళ్లు కట్టించాడని చెబుతున్నారని, కానీ పంచింది 70 వేలు మాత్రమేనని, కట్టినవి పేద లకు ఇవ్వక దర్వాజాలు, కిటికీలు పీక్కు పోతున్నారని విమర్శించారు. మళ్లీ బీజేపీని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. వంగా మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ చంపాపేట్‌ డివిజన్‌ పరిధిలో గడచిన మూడేళ్లలో దాదాపు 55 కోట్ల నిధులతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన లు చేశారు. సమస్యలు మాత్రం ఎక్కడికక్కడే ఉన్నాయి. వాటిని పరిష్కరించాలని కోరారు.

దీనికి స్పందించిన ఈటెల రాజేందర్‌ ఎన్నికల అనంతరం కేంద్ర ప్రభుత్వం నిధులతో నిర్మిస్తామని కాలనీ వాసులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ చంపాపేట్‌ డివిజన్‌ అధ్యక్షుడు పోరెడ్డి రవీందర్‌రెడ్డి, బీజేపీ సీనియర్‌ నాయకులు సద్ది సందీప్‌రెడ్డి, లింగాల దశరథ గౌడ్‌, గూడూరు అవినాష్‌రెడ్డి, రాంపురం శ్రీనివాస్‌, పాశం శ్రీశైలం, సిల్వర్‌ అనిల్‌, వెంకటేష్‌ ముదిరాజ్‌, బీరప్ప, శ్రీనివాస్‌ నాయుడు, సాయి ప్రసాద్‌, అంజి, సుమిత్‌, శ్రీధర్‌ గౌడ్‌, వేణు గౌడ్‌, గిరి యాదవ్‌, వేణుగోపాల్‌, శ్రావణ్‌ కుమార్‌, డివిజన్‌ మహిళా అధ్యక్షురాలు రజిత, మహిళ నాయకులు నాయకురాలు విజయశ్రీ చౌదరి, కవిత, వివిధ కాలనీల సంక్షేమ సంఘం సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply