Suryaa.co.in

Telangana

థ్యాంక్స్.. లోకేష్

– తెలంగాణలో పార్టీని పటిష్టం చేస్తానన్న హామీతో క్యాడర్‌లో ఉత్సాహం
– గ్రేటర్ హైదరాబాద్‌లో తిరుగులేని టీడీపీ
– చంద్రబాబు-లోకేష్ నాయకత్వంలో పార్టీకి మళ్లీ పూర్వవైభవ ం
– తెలుగుమహిళ రాష్ట్ర అధ్యక్షురాలు భవనం షకీలారెడ్డి

హైదరాబాద్: తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి మళ్లీ పునరుజ్జీవం కల్పిస్తానన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్‌కు తెలంగాణ తెలుగుమహిళ రాష్ట్ర మాజీ అధ్యక్షురాలు భవనం షకీలారెడ్డి కృతజ్ఞతలు చెప్పారు. లోకేష్ భరోసాతో నిరుత్సాహంగా ఉన్న పార్టీ క్యాడర్‌లో ఉత్సాహం కనిపిస్తోందన్నారు.

తెలంగాణలో నాయకులు పార్టీలు మారినా, క్యాడర్ ఇంకా చెక్కుచెదరకుండా ఉన్నారని గుర్తు చేశారు. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్‌లో టీడీపీ ఇంకా బలంగానే ఉందని స్పష్టం చేశారు. కొత్త నాయకత్వాన్ని అందించి, మార్గనిర్దేశనం చేస్తే పార్టీకి మళ్లీ పూర్వవైభవం తీసుకువచ్చేందుకు తామంతా కృషి చేస్తామన్నారు. తెలంగాణలో పార్టీ సభ్యత్వం అంచనాలకు మించి నమోదయిందని, ప్రజలు స్వచ్ఛందంగా సభ్యత్వాలు తీసుకోవడం గొప్ప విషయమన్నారు. చంద్రబాబునాయుడు-లోకేష్ నాయకత్వంలో, తెలంగాణలో టీడీపీకి పూర్వవైభవం రావడం ఖాయమని షకీలారెడ్డి జోస్యం చెప్పారు.

LEAVE A RESPONSE