Suryaa.co.in

Andhra Pradesh

విశాఖ ఉక్కుకు కొత్త ఊపిరులూదిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు

– హోం, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత

అమ‌రావ‌తి: విశాఖ ఉక్కుకు కొత్త ఊపిరులూదిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు. విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు నినాదం వెనుక దాగున్న తెలుగుప్రజల భావోద్వేగాలని, దాని ప్రతిష్టను తెలియజేస్తూ పలుమార్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, భారత ప్రధాని మోదీతో సహా కేంద్రమంత్రులతో జరిపిన చర్చలకు దక్కిన ఫలితం.

విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ నేడు అధికారికంగా రూ.11,440 కోట్లతో ఆర్థిక ప్యాకేజీ ప్రకటించడం కూటమి ప్రభుత్వం సాధించిన ఘనవిజయం. నాడు ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు చొరవతీసుకుని స్వర్గీయ వాజ్ పేయ్ ప్రధానిగా ఉన్న సమయంలో రూ.1600 కోట్ల రుణాలను మాఫీ చేసిన విషయం చెప్పుకోవడం కూడా అనివార్యం. అది మా అధినాయకుడు చంద్రబాబు గారి దార్శనికత, చిత్తశుద్ధి, అంకితభావానికి నిదర్శనం.

మెడలు వంచుతామని ప్రజలకిచ్చిన మాటను వమ్ము చేస్తూ 23 మంది ఎంపీలనిచ్చినా తలొగ్గి గత జగన్ ప్రభుత్వం మొక్కుబడిగా లేఖలు రాసి చేతులు దులుపుకుంది. కూటమి ప్రభుత్వం మాత్రం ప్రజలకు ఇచ్చిన మాటను చేతల్లో నిలబెట్టుకుంది. ప్రధాన మంత్రి మోదీకి, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్ గారికి, కుమారస్వామిగారికి, అశ్విని వైష్ణవ్ గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు, విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు.

LEAVE A RESPONSE