– అక్రమాలను ప్రశ్నిస్తే పెట్రోలు పోసి తగలబెడతారా?
– హోంమంత్రి సుచరిత, డిజిపి బాధ్యత వహించాలి
– ముఖ్యమంత్రి పుట్టినరోజు రాష్ట్రానికి ఇచ్చే సందేశం ఇదేనా?
– దాడులకు పాల్పడిన వారిపై ఎస్సీ,ఎస్టీ కేసులుపెట్టి అరెస్ట్ చేయాలి
– తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య్ర
రాష్ట్రంలో గత రెండున్నరేళ్ల జగన్ రెడ్డి పాలనలో వైసిపి ముష్కర మూకల అకృత్యాలు అఫ్ఘనిస్థాన్ లో తాలిబాన్ల కంటే దారుణంగా మారాయి. గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం బోయపాలెం వద్ద దళితుడైన తెలుగుదేశం పార్టీ కార్యకర్త పొత్తూరి వెంకట నారాయణతో వైసిపికి చెందిన అసాంఘికశక్తులు గొడవపడి పెట్రోలు పోసి నిప్పంటించారు.
రాష్ట్ర హోంమంత్రి సుచరిత సొంత నియోజకవర్గంలో జరిగిన ఈ సంఘటనకు ఆమె ఏం సమాధానం చెబుతారు? హోంమంత్రి, డీజిపి ఈ ఘటనకు బాధ్యత వహించాలి. వెంకటనారాయణపై పైశాచికంగా హత్యాయత్నానికి పాల్పడిన వైసిపి గూండాలపై ఎస్సీ,ఎస్టీ అత్యాచార చట్టం కింద కేసులు నమోదుచేసి, అరెస్ట్ చేయాలి. నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఈ సంఘటనల ద్వారా రాష్ట్రప్రజలకు ఏం సంకేతాలు ఇవ్వాలనుకుంటున్నారు?
రాష్ట్రంలో వైసిపి అధికారంలోకి వచ్చాక గత 30నెలల్లో 29మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను వైసిపి గూండాలు పొట్టనబెట్టుకున్నారు, మరో 1480చోట్ల దాడులకు తెగబడ్డారు. రాష్ట్రంలో పరిస్థితులు చేయిదాటకముందు డీజిపి గౌతం సవాంగ్ జోక్యం చేసుకుని వైసిపి అరాచకశక్తులను అదుపుచేయాలి, లేకపోతే తర్వాత జరిగే పరిణామాలకు డీజీపి, పోలీసులే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.