రామాంజనేయులుపై వైకాపా గూండాల దాడి హేయం

– ఎన్నికల నియమావళిని పాటించాలని చెప్పడం రామాంజనేయులు చేసిన తప్పా?
– తాడేపల్లి ప్యాలెస్ అండతో రెచ్చిపోతున్న వైకాపా నాయకులారా ! తస్మాత్ జాగ్రత్త
-తెదేపా ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యాక్షులు కోడూరి అఖిల్

ప్రత్తిపాడు వైసీపీ అభ్యర్ధి బాలసాని కిరణ్ కుమార్ తన రౌడీలను పంపి తెదేపా ఇంఛార్జ్ రామాంజనేయులుపై దాడి చేయించడం అత్యంత హేయమని తెదేపా ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యాక్షులు కోడూరి అఖిల్ తీవ్రంగా విమర్శించారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా వలంటీర్లను యదేచ్చగా ప్రలోభాలకు గురిచేయడాన్ని నిరోధించాలని ప్రయత్నించడమే తెదేపా అభ్యర్ధి రామాంజనేయులు చేసిన తప్పా? వైకాపా అభ్యర్ధి బాలసాని కిరణ్ కుమార్ పట్టపగలే పెదనందిపాడుకు చెందిన వలంటీర్లతో తన ఇంట్లో సమావేశం జరపడం తప్పు కాదా? అని ప్రశ్నించారు. రామాంజనేయులు వాహనం ధ్వంసం చేసి ఆయనపై, తెదేపా కార్యకర్తలపై దాడి చేయడం దుర్మాగం.

రామాంజనేయులుపై దాడికి పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అధికారం మదంతో రెచ్చిపోయి తాడేపల్లి ప్యాలెస్ ప్రలోభాలకు లొంగి పోయి, మా పార్టీ నేతలపై దాడులకు దిగితే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని వైకాపా నాయకులు, అధికారులు గుర్తించుకోవాలి. అధికారం శాశ్వతం కాదు. చర్యకు ప్రతి చర్య తప్పక ఉంటుంది.

Leave a Reply