– టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు
నష్టపోయిన పంటకు పరిహారం అడిగిన అన్నదాతలపై అనంతపురం జిల్లాలో కేసులు పెట్టడం జగన్ ప్రభుత్వ అహంకారానికి, రైతు వ్యతిరేక పోకడలకు నిదర్శనం. బీమా కోసం రోడ్డెక్కారని ఉరవకొండలో రైతులపై కేసులు పెట్టడం సిగ్గు చేటు. మీ పాలనలో నాలుగేళ్లుగా సాగు సబ్సిడీలు లేవు… గిట్టుబాటు ధరలు లేవు….ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులు లేవు….ఉన్నది కేవలం ప్రశ్నించిన రైతన్నలపై కేసులు మాత్రమే.
రైతుకు కష్టం వచ్చిన ప్రతిసారీ తెలుగుదేశం ప్రభుత్వం బాసటగా నిలిచింది. విపత్తులు, కరువు సమయాల్లో రైతును ఆదుకునేందుకు ఇన్సూరెన్సు, ఇన్ పుట్ సబ్సిడీ వంటి పాలసీలు తెచ్చి అండగా నిలబడ్డాం. ముగిసిన వ్యవసాయ సంవత్సరంలో పంటలకు ఎంత బీమా కట్టారో…ఎంత నష్టం జరిగిందో…..ఎంత మంది రైతులకు ఎంత పరిహారం చెల్లించారో… వివరాలు చెప్పగలరా?
పంటలకు ఇన్సూరెన్స్ పై నాడు సాక్షాత్తూ అసెంబ్లీలో పచ్చి అబద్దాలు చెప్పి… రైతులను వంచించి దొరికిపోయిన మీరు….నేడు రైతులపైనే కేసులు పెట్టి అరాచకానికి అడ్రస్ గా మారారు. కేసులు పెట్టినందుకు అన్నదాతలకు క్షమాపణ చెప్పి… బీమా సమస్యను పరిష్కరించాలి.