Suryaa.co.in

Telangana

రాష్ట్రానికి సరిపడా యూరియాను కేంద్రం ఇచ్చింది

-కేంద్రం నుంచి రాష్ట్రానికి ఇప్పటికే 12 లక్షల టన్నుల యూరియా
– బిజెపి ఎంపీ డికె అరుణ

హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 12 లక్షల టన్నుల యూరియా పంపిణీ చేసిందని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. నిజానికి ఈ సీజన్ కోసం రాష్ట్ర రైతాంగానికి సరిపోగా దాదాపు 1.5 లక్షల టన్నుల యూరియా మిగులుతుందని ఆమె అన్నారు
ఇంకా అదనంగా అవసరం అయితే ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వ సిద్ధంగా ఉందని ఆమె అన్నారు.

D.A.P కోటా 1.50 లక్షల మెట్రిక్ టన్నులు కాగా కేంద్ర ప్రభుత్వం 1.72 లక్షల మెట్రిక్ టన్నుల సరఫరా చేసిందని అరుణ పేర్కొన్నారు. 2014 నుంచి ఇప్పటి దాకా 12 లక్షల కోట్ల కు పైగా ఎరువుల సబ్సిడీ రూపం లో కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేసిందని ఆమె చెప్పారు.

LEAVE A RESPONSE