Suryaa.co.in

Telangana

తెలంగాణ ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వకుండా కేంద్రం అన్యాయం

– ఆంధ్రప్రదేశ్- కర్ణాటక- మహారాష్ట్ర ప్రాజెక్టులకు జాతీయ హోదా
– కరెంట్ కోతలు, రైతు ఆత్మహత్యలు లేకుండా చేశాం
– నాన్ టాక్ రెవెన్యూ లో వాటా ఇవ్వాలి
– 16వ ఆర్థిక సంఘం మీరైనా మా రాష్ట్రానికి అన్యాయం చేయకండి.
– ప్రజా భవన్ లో లో నిర్వహించిన 16వ ఆర్థిక సంఘం సమావేశానికి హాజరై బిఆర్ఎస్ పార్టీ తరఫున పలు సూచనలు, సలహాలు అందించిన మాజీ మంత్రి హరీష్ రావు
– పాల్గొన్న ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, వివేకానంద

హైదరాబాద్: కేసీఆర్ ఆదేశాల మేరకు 16 వ ఆర్థిక సంఘానికి రిపోర్ట్ ఇచ్చాం. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే విధంగా సూచనలు చేశాం. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఎంతో ముందుకు తీసుకువెళ్లాం. కరెంట్ కోతలు, రైతు ఆత్మహత్యలు లేకుండా చేశాం. అత్యధిక జిడిపి వృద్ధితో దేశానికే ఆదర్శంగా తెలంగాణను నిలిపాం.

పన్నుల వాటా 41శాతం పెంచారు అన్నారు కానీ 31 శాతం నిధులే వస్తున్నాయి. చెప్పిందొకటి చేస్తున్నది ఒకటి. ఈ విషయాన్ని వివరించడం జరిగింది. కేంద్రానికి వచ్చే ఆదాయంలో 20 శాతాన్ని సర్ ఛార్జీలు, సెస్సుల రూపంలో సమకూర్చుకుంటున్నారు. ఈ డబ్బును రాష్ట్రాలకు ఇవ్వడం లేదు. అందువల్ల 41% రాష్ట్రాలకు రావాల్సి ఉండగా 31 శాతమే వస్తున్న తీరును వివరించడం జరిగింది. దీన్ని సవరించి రాష్ట్రాలకు ఇచ్చే వాటాను 41 నుండి 50 శాతం పెంచాలని కోరాం.

నాన్ టాక్స్ రెవెన్యూ కేంద్రానికి చాలా తక్కువ గా ఉండేది. 1961 లో 171 కోట్ల ఉంటే, 2024-25లో 5 లక్షల 46 వేల కోట్లకు పెరిగింది. నాన్ టాక్ రెవెన్యూ లో వాటా ఇవ్వాలని కోరడం జరిగింది. బాగా పనిచేస్తున్న రాష్ట్రాలకు శిక్ష వేస్తున్నారు. తెలంగాణ దేశంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రం. బాగున్నారు కాబట్టి వాటా తక్కువ ఇస్తామనడం అన్యాయం.

13వ ఆర్థిక సంఘంలో రాష్ట్రం వాటా 2.437% ఇచ్చారు. 14 లో 2.133% కు తగ్గింది. 15 నాటికి 2.102% కు తగ్గింది. ఇప్పుడు 16వ ఆర్థిక సంఘం మీరైనా మా రాష్ట్రానికి అన్యాయం చేయకండి.

వెనుకబడ్డ రాష్ట్రాలను ఆదుకోవడంతోపాటు బాగా పనిచేస్తున్న రాష్ట్రాలను నిరుత్సాహపరచకుండా కాపాడాలని కోరడం జరిగింది.బాగా పని చేసే రాష్ట్రాలకు ప్రోత్సాహం ఇవ్వాలని గట్టిగా చెప్పడం జరిగింది.

రాష్ట్రాలకు ఇవ్వడానికి కొన్ని మార్క్స్ పెట్టుకున్నారు. తలసరి ఆదాయం అధికంగా ఉండే రాష్ట్రాలకు సున్నా, తక్కువ ఉన్న రాష్ట్రాలకు 45. ఇలా ఇచ్చే 45 ను 30 కి తగ్గించాలని చెప్పాం.పన్నుల వసూలు చేయడంలో అగ్రస్థానంలో ఉంటే రెండున్నర శాతం వెయిటేజి మాత్రమే ఇస్తున్నారు. దీన్ని 10 శాతానికి పెంచాలని కోరాము. తద్వారా రాష్ట్రాల మధ్య పోటీ పెరుగుతుందని, అభివృద్ధి చెందుతాయని చెప్పడం జరిగింది.

స్థానిక సంస్థల గ్రాంట్ 50 శాతానికి పెంచాలని కోరడం జరిగింది. అర్బన్ పాపులేషన్ ఎక్కడైతే పెరుగుతుందో ఆయా రాష్ట్రాలు నష్టం జరగవద్దు. కరోనా సమయంలో కేంద్రం ప్రభుత్వం క్యాపిటల్ ఎక్స్ పెండేచర్ చేయాలని, ఉద్యోగాలు పెరగాలని అధిక అప్పులను రాష్ట్రాలకు ఇచ్చి ఖర్చు పెట్టించారు. అప్పులు రాష్ట్రాలకు భారంగా మారాయి. ఆ అప్పులు కేంద్రమే తీర్చే విధంగా సూచనలు చేయాలని కోరాం.

తెలంగాణ ప్రాంతం ఎత్తులో ఉంటుంది, ఈ ప్రాంతానికి నీళ్లు రావాలంటే లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణమే చేయాలి. అందుకే కేసీఆర్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టారు. తద్వారా పెద్ద మొత్తంలో పంటలకు సాగునీరు ఇవ్వడం సాధ్యమైంది. వ్యవసాయ విస్తరణ జరిగి దేశంలోనే అత్యధిక వరి పంట పండే రాష్ట్రంగా తెలంగాణ రికార్డు నెలకొల్పింది.

లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్వహణకు కనీసం 40 వేల కోట్ల రూపాయలు కేటాయించాలని 16వ ఆర్థిక సంఘాన్ని కోరాం. పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు హోదా ఇవ్వాలని కోరాం. ఆంధ్రప్రదేశ్- కర్ణాటక- మహారాష్ట్ర ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇచ్చి తెలంగాణకు ఇవ్వకుండా కేంద్రం అన్యాయం చేసిందని వివరించాం.

కేంద్ర ప్రభుత్వం మీరు ముందే మిషన్ భగీరథతో ఇంటింటికి నల్లబెట్టి నీళ్ళు ఇచ్చారని చెప్పి నిధులు ఇవ్వడం లేదు.19,205 కోట్లు గ్రాంట్ మిషన్ భగీరథ కోసం ఇవ్వాలని నీతి అయోగ్ చెప్తే కేంద్రం ఒక్క రూపాయి ఇవ్వలేదు. నిర్వహణ కోసమైనా 2350 కోట్లు ఇవ్వాలని 15వ ఆర్థిక సంఘం సూచిస్తే ఒక్క రూపాయి ఇవ్వలేదు.

కేంద్రం ప్రారంభించిన హర్ ఘర్ జల్ కంటే మేము ముందే మిషన్ భగీరథ ద్వారా నీళ్లు ఇవ్వడం పాపమైందా?ఈ అన్యాయాలను 16వ సంఘం చైర్మన్ సభ్యుల దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది.మిషన్ భగీరథ మెయింటెనెన్స్ కోసం 20 వేల కోట్లు కేటాయించాలని బిఆర్ఎస్ పార్టీ పక్షాన కోరడం జరిగింది.

ప్రైవేటు ఆసుపత్రులతో దీటుగా ప్రభుత్వ ఆసుపత్రులు నిర్మించాలని అప్పటి మా ప్రభుత్వం నిర్ణయించింది. పేదలకు కూడా కార్పొరేట్ వైద్యం అందించే కార్యక్రమం చేపట్టం దానికోసం పదివేల కోట్లు కేటాయించాలని కోరడం జరిగింది. అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంఘం రిపోర్టులను తొక్కి పెడుతున్నది.14వ ఆర్థిక సంఘం వరకు రిపోర్ట్లను యధావిధిగా అమలు చేశారు. కానీ 15వ ఆర్థిక సంఘం రిపోర్టును కేంద్ర ప్రభుత్వం పిక్ అండ్ చూస్ లాగా ఇష్టమున్నవి చేసి ఇష్టం లేని వదిలిపెట్టారు.

తెలంగాణ రాష్ట్రానికి స్పెషల్ గ్రాండ్ కింద 723 కోట్లు, సెక్టర్ స్పెసిఫిక్ కింద 2350 కోట్లు, స్టేట్ స్పెసిఫిక్ కింద 3024 కోట్లు మొత్తం 6097 కోట్లు ఇవ్వాలని ఆర్థిక సంఘం చెప్పిన తెలంగాణకు పైసా ఇవ్వలేదు.
ఆర్థిక సంఘం నివేదికను అమలు చేయకపోవడం అంటే రాజ్యాంగ ఉల్లంఘన చేయడమే. తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం ప్రదర్శిస్తున్న కక్షపూరిత వైఖరిని ఆర్థిక సంఘానికి వివరించాం. వరద విపత్తు సహాయ నిధి 75: 25 గా ఉంది. దాన్ని గతంలో ఉన్న విధంగా 90: 10 కు మార్చాలని కోరడం జరిగింది.

చాలా విషయాల మీద రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే విధంగా తెలంగాణ ప్రజల హక్కులు కాపాడే విధంగా తెలంగాణ మరింత అభివృద్ది చెందే విధంగా విధంగా ఆర్థిక సంఘం రిపోర్టుండాలని, బాగా పనిచేసే రాష్ట్రాలకు అన్యాయం చేయొద్దని గొంతు నొక్కద్దని బిఆర్ఎస్ పార్టీ పక్షాన వారికి చెప్పడం జరిగింది.

అరికెపూడి గాంధీకి పిఎసి ఇవ్వడం అంటే రాజ్యాంగాన్ని నిట్ట నిలువునా ఖూనీ చేయడమే
ప్రతిపక్షానికి పిఎసి ఇవ్వకుండా కాంగ్రెస్ పీఏసీ తీసుకోవడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే. చేతిలో రాజ్యాంగం పట్టుకుని నీతి వాక్యాలు చెప్పే రాహుల్ గాంధీ మాటలు డొల్ల.రాహుల్ గాంధీ గారి మాటలన్నీ నీటి మూటలు.

చేతిలో పట్టుకున్న రాజ్యాంగం మీద మీకు గౌరవం ఉంటే తక్షణమే మీ ముఖ్యమంత్రి కి ఆదేశించు. కేంద్రంలో ఇదే పిఏసి కాంగ్రెస్ పార్టీకి చెందిన కేసి వేణుగోపాల్ తీసుకున్నారు. ఇక్కడేమో బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరినటువంటి అరికెపూడి గాంధీకి పిఎసి ఇవ్వడం అంటే రాజ్యాంగాన్ని నిట్ట నిలువునా పట్టపగలు ఖూనీ చేయడం.రాజ్యాంగాన్ని పరిహాసం చేయడం. రాహుల్ గాంధీ కి రాజ్యాంగం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు ఇక.

LEAVE A RESPONSE