– లేకుంటే టీడీపీ వాణిజ్య విభాగం ఆయన ఇంటిని ముట్టడించి బుద్ధి చెబుతుంది
• పవర్ లేని పదవిలో ఉంటూ, సొంతపార్టీ వారే పట్టించుకోని వ్యక్తి, లోకేశ్ పై, టీడీపీపై ఆరోపణలు చేయడం సిగ్గుచేటు.
• వైసీపీప్రభుత్వం నాలుగేళ్లలో ఆర్యవైశ్యలకు చేసింది శూన్యం.
• టీడీపీప్రభుత్వం ఎమ్మెల్యే, ఎంపీసహా, 6,276 పదవులు ఆర్యవైశ్యలకు కట్టబెట్టింది.
• రూ.30కోట్లతో కార్పొరేషన్ ఏర్పాటుచేసి, పేద ఆర్యవైశ్యల్ని ఆదుకుంది.
– డూండీ రాకేశ్
“ యువగళం పాదయాత్రలో లోకేశ్ అన్నివర్గాలతో మమేకమవుతూ ముందుకు సాగుతున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రుల అవినీతిని ఆధారాలతో సహా బట్ట బయలు చేస్తున్నారు. ఆ క్రమంలో వైశ్యకార్పొరేషన్ ఛైర్మన్ లోకేశ్ పై, టీడీపీపై ఆరోపణలు చేశాడు. పవర్ లేని పదవుల్లో ఉన్న అలాంటి వ్యక్తులు ఊరికే గడ్డులు చించుకుంటూ, తొడలు కొట్టినంతమాత్రాన టీడీపీ వైశ్యులకుచేసిన మేలు మరు గునపడిపోదు. సదరు ఛైర్మన్ గానీ, ముఖ్యమంత్రి, మంత్రులు గానీ ఈ నాలుగేళ్ల లో ఆర్యవైశ్యలకు ఏంచేశారో సమాధానం చెప్పగలరా? వైసీపీప్రభుత్వంలో ఆర్యవై శ్యలకు అందించిన సంక్షేమంపై వాస్తవాలతో శ్వేతపత్రం విడుదలచేసే దమ్ము, ధైర్యం ముఖ్యమంత్రికి ఉందా?
టీడీపీహాయాంలో ఆర్యవైశ్యలకు లభించిన పదవులు.. అందిన సంక్షేమం
విభజన తర్వాత 2014లో జగిగిన ఎన్నికల్లో టీడీపీ ఆర్యవైశ్యులకు 7 ఎమ్మెల్యే సీట్లు కేటాయించింది. ప్రకాశం జిల్లాలో శిద్ధారాఘవరావు, అన్నారాంబాబుకి సీట్లు ఇచ్చింది. టీ.జీ.వెంకటేశ్, సుభాశ్ చంద్రబోస్, శ్రీరామ్ తాతయ్య, మద్దాలి గిరిధర్ రావు, వెల్లంపల్లి శ్రీనివాస్ (టీడీపీ పొత్తుతో పోటీచేశాడు). ఎన్నికల్లో ఓడిపోయిన టీ.జీ.వెంకటేశ్ ను తెలుగుదేశంపార్టీ రాజ్యసభకు పంపింది. శిద్ధారాఘవరావుకి తర్వాత ఎమ్మెల్సీ ఇచ్చారు. వీరితో పాటు, 9 మున్సిపల్ ఛైర్మన్ స్థానాలు, వైస్ ఛైర్మన్లు, 6 రాష్ట్రస్థాయి ఛైర్మన్ పదవులు, లెక్కకు మిక్కిలి కార్పొరేషన్ స్థానాలు కట్టబెట్టింది.
126 మందికి నామినేటెడ్ పదవులు ఇచ్చింది. మొత్తంగా రాష్ట్రవ్యా ప్తంగా 6,276 మంది ఆర్యవైశ్యలకు వివిధపదవులు కట్టబెట్టిన ఘనత తెలుగు దేశం ప్రభుత్వానిది. టీడీపీ ఆర్యవైశ్యులకు కట్టబెట్టిన పదవులు, వారికి అందిం చిన సంక్షేమంపై బహిరంగ చర్చకు వచ్చే దమ్ము, ధైర్యం రాష్ట్రవైశ్య కార్పొరేషన్ ఛైర్మన్ కు ఉన్నాయా? 2019 నుంచి అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ఆర్యవైశ్యులకు అండగా నిలవడం కాదుకదా.. దారుణంగా వారిపై వేధింపులకు పాల్పడింది. అసలు ఈ ప్రభుత్వంలో రాష్ట్రవాణిజ్య విభాగం అధ్యక్షులెవరో తెలియనిపరిస్థితి.
ఆర్య వైశ్యులపై ప్రకాశం జిల్లాలో ఒక్కోనియోజకవర్గంలో రెండు, మూడు దాడులు జరిగాయి. ఆర్యవైశ్య నేత సుబ్బారావుని ఎంతలా హింసించారో రాష్ట్రమంతా చూసింది. వీటన్నింటిపై వైశ్యకార్పొరేషన్ ఛైర్మన్ ఏం సమాధానం చెబుతాడు? రాష్ట్రంలో ఆర్యవైశ్యలపై దాడులు జరుగుతుంటే, ఏనా డూ నోరుతెరవనివాళ్లు, నేడు సిగ్గులేకుండా లోకేశ్ పై విమర్శలు చేస్తున్నారు.
05-02-2019న జీవోనెం–85ద్వారా, టీడీపీప్రభుత్వం ఆర్యవైశ్య వాసవీ సత్ర సముదాయం.. ఆర్యవైశ్య మహాసభ భవనాల నిర్మాణాలకు రూ.60లక్షల స్టాంప్ డ్యూటీ మినహా యింపు ఇచ్చింది. వైసీపీ ప్రభుత్వం 28-08-2020న జీవోనెం-24 4 ద్వారా రూ.47.62లక్షల మినహాయింపు ఇచ్చింది. ఆ మినహాయింపు సొ మ్ము అసలు ఆర్యవైశ్య సంఘానికి చేరిందో లేదో కూడా తెలియదు. చివరకు ఆర్య వైశ్యులు చందాలేసుకొని కట్టుకున్నభవనాల్ని కూడా ఈ ప్రభుత్వం కూల్చేసింది.
ఆర్యవైశ్య కార్పొరేషన్ ఎప్పుడు ఏర్పాటైందో తెలియని వ్యక్తి దానికి ఛైర్మన్…
వైశ్య కార్పొరేషన్ ఎప్పుడు ఏర్పడిందో ఇప్పుడున్న ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్మన్ కు తెలియదని అర్థమైంది. జగన్మోహన్ రెడ్డి మాటిచ్చాడు… నిలబెట్టుకున్నాడనే మందమతులకు వాస్తవాలు తెలిసినట్టు లేదు. రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ ను టీడీపీ ప్రభుత్వం 14-09-2018న ఏర్పాటు చేసింది. దానికి సంబంధించిన జీవో కూడా ఉంది. నంద్యాల ఉపఎన్నికలో హామీ ఇచ్చిన చంద్రబాబు దానిప్రకారం వై శ్య కార్పొరేషన్ ఏర్పాటు చేశారు.
ఒక చైర్మన్, ఐదుగురు డైరెక్టర్లు, ఏడుగురు సిబ్బందితో రూ.30కోట్ల నిధులు కేటాయించి చంద్రబాబు ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. 2014 ఎన్నికల్లో వైశ్య కార్పొరేషన్ ఏర్పాటుచేస్తామని టీడీపీ చెప్ప లేదు. టీడీపీప్రభుత్వంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ పేద ఆర్యవైశ్యులకు అన్ని విధాలా అండగా నిలిచింది.
రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్మన్ తక్షణమే లోకేశ్ కు బహిరంగ క్షమాపణలు చెప్పాలి
మూడున్నరేళ్లుగా ఈ ప్రభుత్వంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్మన్ గా ఉన్న వ్యక్తి, ఒక్క డైరెక్టర్ ను, సిబ్బందిని నియమించలేకపోయాడు. అదీ ఆయన పనితనం. ఛైర్మన్ హోదాలో ఎంతమంది ఆర్యవైశ్యపేదలకు ఎంతమొత్తం ఆర్థికసహాయం అం దించారో కూడా తెలియదు. పవర్ లేని ఆర్యవైశ్య కార్పొరేషన్ మాటల్ని పట్టించు కోవాల్సి న అవసరంలేదు. వైసీపీవాణిజ్యవిభాగం అధ్యక్ష పదవికోసం వైసీపీలో కొ ట్టుకుంటున్నారు. అసలు ఆ విభాగం మీపార్టీలో ఉందో లేదో తెలుసుకోండి. తెలుగు దేశంపార్టీ తరుపున 26 జిల్లాల్లో వాణిజ్యవిభాగం కమిటీలు ఉన్నాయి.
ఆర్య వైశ్యులకు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా సముచితస్థానం కల్పించింది తెలుగుదేశం పార్టీనే. వైసీపీగానీ, జగన్ గానీ ఆర్యవైశ్యులకు ఏంచేసింది లేదు? ఈ ప్రభుత్వం వచ్చాక దారుణంగా నలుగురు ఆర్యవైశ్యనేతల్ని దారుణంగా చంపించింది. ప్రశాంతంగా వ్యాపారంచేసుకునే వారి జీవితాల్ని రోడ్డునపడేసింది. రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్మన్ తక్షణమే లోకేశ్ కు బహిరంగక్షమాపణలు చెప్పాలి. లేకుంటే టీడీపీ వాణిజ్య విభాగం ఆయన ఇంటిని ముట్టడించి, ఆయనకు బుద్ధి చెబుతుంది.”