– కేంద్రం అన్యాయంపై నోరు విప్పే ధైర్యం చేయలేని లొంగుబాటుదారుడు జగన్
– ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జంగా గౌతమ్
అనంతపురం జిల్లా రాప్తాడు ప్రాంతంలో ఈ రోజు వైసిపి జరిపిన సభకు 100 కోట్ల రూపాయలకు పైనే ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. సామాన్య ప్రజలకు రవాణా సౌకర్యం లేకుండా ఆర్టీసీ బస్సులన్నిటిని సిద్ధం సభకు తీసుకెళ్లడం అత్యంత బాధ్యతరాహిత్యం.. ప్రభుత్వ నియంతృత్వానికి పరాకాష్ట. ప్రభుత్వ వ్యవస్థలన్నిటిని దుర్వినియోగం చేసి ప్రజలను బలవంతంగా సిద్ధం సభకు తరలించారు.
2004 నుండి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను తన సృష్టిగా, చెప్పుకోవడం వంచన.. మోసం.. దగా. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అమలు చేయని కేంద్రం పై ఒక్క మాట కూడా మాట్లాడలేని బలహీన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. జగన్ బిజెపితో కుమ్మక్కు అయ్యాడని చెప్పటానికి సిద్ధం సభలో జగన్ చేసిన ఉపన్యాసం మరో ఉదాహరణ.
ఆంధ్రజ్యోతి ఫోటో జర్నలిస్ట్ పై దాడి అన్యాయం.. పైశాచికం
తన ఉద్యోగ బాధ్యతలను, విధులను నిర్వర్తిస్తున్న ఆంధ్ర జ్యోతి ఫోటో జర్నలిస్టు కృష్ణ పై వైకాపా కార్యకర్తలు దాడి చేసి తీవ్రంగా గాయపర్చడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఫోటో జర్నలిస్టు పై సిద్ధం సభలో జరిగిన దాడి రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛపై జరిగిన దాడి. ప్రజాస్వామిక వాదులు.. జర్నలిస్ట్ సంఘాలు తీవ్రంగా ఖండిచాలని.. జర్నలస్ట్ కృష్ణని ఆదుకోవాలని కోరుతున్నాం.