విశాఖ ఉక్కును అవసరమైతే రాస్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తాం

-విశాఖను జగన్ గంజాయి కేపిటల్ ఆఫ్ ఇండియాగా మార్చాడు
-స్త్రీ శక్తిని చూసి తాడేపల్లి కొంపలో టీవీలు పగులుతున్నాయి
-హైదరాబాద్, తాడేపల్లి, బెంగళూరులో ప్యాలెస్ లు కట్టుకున్నవాడు పేదవాడా?
-జైల్లో ఖైదీలకు నెలకు రూ.2 వేలు ఇస్తున్నాడు కానీ స్కూలు పిల్లలకు కాస్మోటిక్ ఛార్జీలు పెంచడం లేదు
-జగన్ నడక, నవ్వు, మాటల్లో అన్నీ అబద్ధాలే
-జోకులు వేయబోయి జోకర్ అయ్యాడు
-గూగుల్ లో 6093 అని కొడితే ఖైదీ జగన్ పోటో వస్తోంది
– విశాఖపట్నం పశ్చిమ నియోజకర్గం శంఖారావం సభలో యువనేత నారా లోకేష్

ఉత్తరాంధ్ర స్త్రీ శక్తి అదిరిపోయింది. ఈ స్త్రీ శక్తిని చూసి తాడేపల్లి కొంపలో టీవీలు పగులుతున్నాయి. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు దేశంలోనే జాబ్ కేపిటల్ ఆఫ్ ఇండియాగా ఉన్న విశాఖను జగన్ గంజాయి కేపిటల్ ఆఫ్ ఇండియాగా మార్చాడు. చంద్రబాబు హయాంలో దేశంతో పాటు ప్రపంచంలోని అందరి చూపు విశాఖ వైపు ఉండేలా మార్చారు..కానీ జగన్ విషాదపట్నంగా మార్చారు.

టీడీపీ హయాంలో నెలకో పరిశ్రమ విశాఖకు వచ్చేది. నేను ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు ప్రతి 15రోజులకు ఒక ఐటీ కంపెనీని ప్రారంభించేవాడ్ని. ఈ ప్రభుత్వం వచ్చాక విశాఖపట్నంలో జరుగుతున్నది కిడ్నీప్ లు, భూదందాలు, దోపిడీలు, మర్డర్లు మాత్రమే. వైసీపీ ఎంపీ కుటుంబ సభ్యులే కిడ్నాప్ అయ్యారంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి? భూ కబ్జాలకు వ్యతిరేకంగా మాట్లాడిన ఎమ్మార్వో రమణయ్యను వైసీపీ నేతలు చంపారు. సింహాద్రి అప్పన్న ఉన్న పుణ్యభూమి ఈ విశాఖపట్నం జిల్లా.

రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని అప్పన్న స్వామిని కోరుకున్నా. దర్శనానికి వెళ్లిన సమయంలో ఓ అమ్మ అడిగింది…మీరు ఎప్పుడు విశాఖ వచ్చినా అప్పన్నను దర్శించుకుంటారు…జగన్ ఎప్పుడు వచ్చినా దర్శనం చేసుకోడు ఎందుకు అని? ఆ తల్లికి చెప్పా…రేపు సీఎం వస్తున్నారంట.. ఆయన్నే అడగాలని. ఎక్కడ ఆదాయం ఉంటే అక్కడకి మాత్రమే జగన్ వెళ్తాడని ఓ కుర్రాడు చెప్పాడు.

జగన్ ఎన్నో పాపాలు చేశాడు..అందుకే నువ్వు అబద్ధాలు చెప్పొద్దు..నిజాలు మాత్రమే చెప్పు అని దేవుడు జగన్ కు చెప్పాడు. ఈ మధ్య ఎక్కడికి వెళ్లినా తనకు పేపర్, టీవీలు లేవని చెబుతున్నాడు. నిజమే పేపర్, టీవీ లేదు..ప్రజల సొమ్ము దోచుకుని పెట్టినవి కాబట్టి అవన్నీ ప్రజలవే. నాకు సిమెంట్ ఫ్యాక్టరీలు, పవర్ ప్లాంటు లేవు అంటున్నాడు…లక్ష కోట్లు లూటీ చేసి అవి పెట్టుకున్నాడు, అవీ కూడా ప్రజలవే.

ఆఖరికి ఇల్లు కూడా లేదని చెప్తున్నాడు…బెంగళూరు, హైదరాబాద్, పులివెందుల, కడప, తాడేపల్లి, రుషికొండపై కట్టిన ఇళ్లన్నీ అవినీతి పునాదులపై ప్రజల డబ్బులతో కట్టిననే. రెండు నెలలు ఆగు జగన్..అక్రమ సొమ్ముతో కట్టిన ఇళ్లన్నీ జప్తు చేసి అమ్మి ప్రజలకు పంచి పెడతాం. జగన్ నడక, నవ్వు, మాటల్లో అన్నీ అబద్ధాలే. పేదలు, పెత్తందారులకు యుద్ధం అంటున్నాడు. జోకులు వేయబోయి జోకర్ అయ్యాడు.

లక్ష కోట్ల ఆస్తి, లక్ష విలువైన చెప్పులు, రూ.వెయ్యి ఖరీదైన నీళ్లు తాగేవాడు, హైదరాబాద్, తాడేపల్లి, బెంగళూరులో ప్యాలెస్ లు కట్టుకున్నవాడు పేదవాడా? జగన్ అహంకారానికి..ప్రజల ఆత్మగౌరవానికి మధ్య యుద్ధం జరగబోతంది. జగన్ జలగ లాంటివాడు. సైలెంట్ గా పోర్టులు కొట్టేస్తున్నాడు. కృష్ణపట్నం పోర్టు కొట్టేసి 10వేల మంది కార్మికల పొట్టగొట్టాడు. టీడీపీ నేతలు పోరాడితే కేరళలో కంటైనర్ షిప్ కు బెర్త్ దొరక్కపోతే ఆ కంటైనర్ షిప్ తెచ్చి కృష్ణపట్నంలో పెట్టి మరమ్మతులు చేస్తున్నామని నాటకమాడుతున్నారు.

నెల్లూరులో కోర్టు దొంగ ఉన్నాడు… ఆయనపేరు కాకాణి గోవర్థన్ రెడ్డి. కంటైనర్ వచ్చేటప్పుడు అర్థరాత్రి వీడియోలు తీసి చూడండి అని డ్రామాలు ఆడుతున్నాడు. ఈ ప్రభుత్వం అద్భుతమైన నాటకాలకు ఇదొక ఉదాహరణ. ఇసుక అక్రమాల్లో జగన్ రోజుకు రూ.3కోట్లు చూస్తాడు..నెలకు రూ.90 కోట్లు, ఐదేళ్లలో రూ.5,400 కోట్లు దోచుకున్నారు. ఇసుకను పందికొక్కుల్లా తింటున్నారు. ఎన్నికలప్పుడు వచ్చి ఓటుకు రూ.10 వేలు ఇస్తామంటారు… తీసుకోండి. ఓటు మాత్రం టీడీపీ, జనసేనకు వేయండి.

గూగుల్ లో 6093 అని కొడితే ఖైదీ జగన్ పోటో వస్తోంది. 16నెలలు జైల్లో చిప్పకూడు ఉన్నాడు. ఖైదీలంటే జనగ్ కు ఇష్టం… అందుకే జైల్లో ఖైదీలకు నెలకు రూ.2 వేలు ఇస్తున్నాడు కానీ స్కూలు పిల్లలకు కాస్మోటిక్ ఛార్జీలు పెంచడం లేదు. హాస్టళ్లలో పాచిపోయిన బోజనం పెడుతున్నారు. టాయిలెట్లు కూడా సరిగా లేవు. బలహీనవర్గాల విద్యార్థులకు హామీ ఇస్తున్నా..టీడీపీ-జనసేన ప్రభుత్వం వచ్చాక మెస్ ఛార్జీలు, కాస్మోటిక్ ఛార్జీలు పెంచుతాం. విద్యాదీవెన, వసతి దీవెన పేరుతో మోసం చేస్తున్నాడు..వీటిని రద్దు చేసి గతంలో ఉన్న ఫీజు రీయింబర్స్ మెంట్ విధానాన్ని తీసుకొస్తాం.
వాలంటీర్లను పంపి ఇళ్లకు వచ్చి టీడీపీ వస్తే సంక్షేమ పథకాలు తొలగిస్తారని చెబుతున్నారు. ఎన్టీఆర్ సీఎం అయినప్పుడు ఈ వాలంటీర్లు పుట్టలేదు. ఏపీకి సంక్షేమాన్ని పరిచయం చేసింది ఎన్టీఆర్. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు, రెండు రూపాయలకే కిలోబియ్యం, రూ.50లకే హార్స్ పవన్ విద్యుత్ అందించారు. చంద్రబాబు వచ్చాక డ్వాక్రా సంఘాలు, ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు, అన్నదాత సుఖీభవ, బీమా లాంటి 100 సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు.

ప్రజలు పడే కష్టాలు చూసే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సూపర్ -6 పథకాలను ప్రకటించారు. టీడీపీ-జనసేన ప్రభుత్వం వచ్చాక 20 లక్షలు ఉద్యోగాలు ఇస్తాం. యేటా జాబ్ కేలండర్ విడుదల చేస్తాం. ఉద్యోగాలు వచ్చేదాకా నెలకు రూ.3 వేలు నిరుద్యోగ భృతి అందిస్తాం. చదువుకునే ప్రతిబిడ్డకు యేటా రూ.15 వేలు ఇస్తాం…కుటుంబంలో ఎంతమంది బిడ్డలున్నా ఇస్తాం. 18-59 ఏళ్ల మధ్య వయసున్న మహిళలకు నెలకు రూ.1500, యేటా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం.

ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మహిళలకు కల్పించబోతున్నాం. అన్నదాత కింద రైతులకు పెట్టుబడి సాయంగా యేటా రూ.20 వేలు అందించబోతున్నాం. ఉత్తరాంధ్రకు పట్టిన దరిద్రం జగన్. బొత్స, విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డిల ద్వారా అడ్డంగా దోచేస్తున్నారు. భూములపై వారి కన్నుపడితే తప్పుడు పత్రాలతో మాయం చేస్తారు. ఎందరో పోరాడి విశాఖ ఉక్కును సాధించారు. కానీ జగన్ ప్రైవేటు వ్యక్తులతో కుమ్మక్కై ఉక్కు ఫ్యాక్టరీని అమ్మేందుకు ప్రయత్నిస్తున్నాడు.

టీడీపీ అధికారంలోకి వస్తే విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం కానివ్వం…అవసరమైతే రాస్ట్ర ప్రభుత్వమే కొనుగోలుచేసి కాపాడతాం. విశాఖపట్నానికి జగన్ పాదయాత్రలో జగన్ 50 హామీలు ఇచ్చాడు. రైల్వోజోన్ ఏర్పాటు అన్నాడు, అదీ చేయలేదు. మెట్రో రైల్ ఏర్పాటు చేస్తామని డీపీఆర్ కూడ సిద్ధం చేయలేదు. మూతపడిన షుగర్ ఫ్యాకర్టీలు తెరిపించలేదు. 8 లక్షల ఎకరాలకు నీరు ఇస్తామని చెప్పాడు..చేయలేదు. విశాఖకు కనీసం ఒక్క ఐటీ కంపెనీని కూడా తీసుకురాలేదు.

విశాఖ లో భూ కుంభకోణాలు పెద్దఎత్తున జరుగుతున్నాయి. దసపల్లా, హయగ్రీవ, ఎక్స్ సర్వీస్ మెన్ భూములు…ఎక్కడ చెరువులు కనబడ్డా రాత్రికి రాత్రే కాజేస్తున్నారు. మళ్లీ వస్తే మన ఎదురుగా ఉన్న సింహాచలం కొండలను కూడా కాజేస్తారు. రుషికొండకు గుండుకొట్టాడు. ఒక వ్యక్తి బతికేందుకు రూ.500 కోట్లతో కట్టిన ప్యాలెస్ అవసరామా? మా తాత, మా నాన్న సీఎంగా చేశారు…ఏనాడూ ఇలాంటి ప్యాలెస్ మేం చూడలేదు. అధికారంలోకి వచ్చాక ఆ భవనాలు ప్రజలకోసం ఉపయోగిస్తాం. జీవీఎంసీలో అవినీతి జరగుతోంది. పన్నులు పెంచారు.. కానీ రోడ్లు వేయరు.

యూనివర్సిటీని కూడా రాజకీయ కేంద్రంగా మార్చారు. వీసీ ప్రసాదరెడ్డి గొప్పతనం ఏంటో తెలుసా…ఆంధ్రా యూనివర్సిటీ దేశంలోనే 29వ స్థానంలో టీడీపీ హయాంలో ఉంటే…ఇప్పడు 76వ స్థానానికి దిగజార్చారు..ఇదీ వీసీ ప్రసాదరెడ్డి ఘనత. ప్రసాద రెడ్డికి చెబుతున్నా… బీకేర్ ఫుల్..నీ పేరు కూడా ఎర్రబుక్ లో ఉంది. నీ అక్రమాలపై విచారణ చేయించి డిస్మిస్ చేసి జైలుకు పంపుతాం.

హుద్ హుద్ వస్తే సొంత కుటుంబాన్ని కాదని విశాఖ ప్రజలే కుటుంబంగా చంద్రబాబు భావించారు. మా ఇంట్లో శ్రీమంతం జరుగుతుంతే 10 నిమిషాలే ఉన్నారు. రాష్ట్రంలో జగన్ గాలివాటం ఉన్నా విశాఖలో ప్రజలు టీడీపీని గెలిపించారు. మరో రెండు నెలల్లో టీడీపీ-జనసేన ప్రభుత్వం వస్తుంది. మరిన్ని నిధులు కేటాయించి విశాఖపట్నంను అభివృద్ధి చేస్తాం. కొండప్రాంతాల్లో ఉండేవారికి మౌలిక సదుపాయాలు కల్పిస్తాం.

మూతపడ్డ జింక్ ఫ్యాక్టరీ స్థానంలో పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉద్యోగాలు ఇస్తాం. జగన్ ఒక భస్మాసురుడు..ఐరన్ లెగ్. ఎక్కడ అడుగుపెడితే అక్కడ ఫ్యాక్టరీలు పేలుతాయి. పరిపాలనా రాజధాని అన్నాడు..30 ఏళ్లుగా ఉన్న ఎల్జీపాలిమర్స్ ఫ్యాక్టరీ పేలిపోయింది. యేడాదికొక ఫార్మా పరిశ్రమలో బాయిలర్లు పేలుతున్నాయి. అందుకే ఆ భస్మాసురుడ్ని విశాఖకు ఎంత దూరం పెడితే అంత మంచిది.

Leave a Reply