Suryaa.co.in

Telangana

దేశం మా వైపే చూస్తోంది

– అభివృద్ధికి చిరునామా తెలంగాణ
– మంత్రి పొన్నం ప్రభాకర్
– సామాజిక న్యాయం, సాధికారత పై కేంద్ర సామాజిక న్యాయ మంత్రి డా,,వీరేంద్ర కుమార్ అధ్యక్షతన డెహ్రాడూన్ లో రెండు రోజుల చింతన్ శివిర్ కార్యక్రమం
– కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు పొన్నం ప్రభాకర్ ,సీతక్క

డెహ్రాడూన్: తెలంగాణ లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర లో సామాజిక రుగ్మతలను తొలగించడానికి దేశానికి దిక్సూచిగా కుల గణన చేశామని తెలిపారు. దీనిని బీసీ కమిషన్ ఆధ్వర్యంలో ప్లానింగ్ డిపార్ట్మెంట్ లక్ష మంది ప్రభుత్వ ఉద్యోగులతో పారదర్శకంగా చేసిందని వెల్లడించారు.

కుల గణన సర్వే లో తెలంగాణ లో బీసీ లు 56 శాతం ఉన్నారని వారికి బీసీ డిక్లరేషన్ లో ఇచ్చిన హామీ మేరకు అమలు చేస్తున్నామని తెలిపారు. బీసీలకు రాజకీయ విద్యా ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు పెంచడానికి శాసన సభ , శాసన మండలి లో బిల్లు చట్టం చేసుకొని ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉందని తెలంగాణ సామాజికంగా సమానత్వం సాధించాలంటే కేంద్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లు పెంపుకు మద్దతు తెలపాలని కోరారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్,యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ,యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ లను ప్రభుత్వం స్థాపించిందని విద్యకు ప్రజా పాలన ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వం సంవత్సర కాలంలో 69 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిందని తెలిపారు.నిరుద్యోగ యువతకు బీసీ ,ఎస్సీ ,ఎస్టీ ,మైనార్టీ ఉపాధి అవకాశాలు మెరుగుపర్చడానికి తెలంగాణ ప్రతిష్టాత్మకంగా రాజీవ్ యువ వికాసం పథకాన్నీ ప్రారంభించిందని తెలిపారు.. మొదటి ఏడాది 6 వేల కోట్లతో 4 లక్షల మందికి ఆర్థిక వృద్ధి సాధించడానికి 50 వేల నుండి 4 లక్షల వరకు ఆర్థిక సహాయం చేసి వారికి జీవనోపాధి కల్పిస్తుందని తెలిపారు.

తెలంగాణ లో వివిధ కార్పొరేషన్ ల ద్వారా చాలా అద్భుతమైన పథకాలు కొనసాగుతున్నాయని పెళ్లిళ్లకు ఆర్థిక సహాయం చేయడానికి కళ్యాణ లక్ష్మి,విదేశాల్లో చదువుకునే విద్యార్థులకు ఓవర్సీస్ స్కాలర్షిప్ , గీతా కార్మికుల రక్షణకు సేఫ్టీ కిట్స్ , బీసీ స్టడీ సర్కిల్ ల ద్వారా నిరుద్యోగ విద్యార్థులకు గ్రూప్స్ , బ్యాంక్ , డీఎస్సీ శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వం మహిళలకు రైతులకు పెద్ద పీఠ వేస్తుందన్నారు. మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా ఆర్టీసీ ప్రయాణం అందిస్తున్నామని తెలిపారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం మహిళలకు ఎన్నో పథకాలు ప్రారంభించిందన్నారు. రైతులకు 2 లక్షల వరకు రైతు రుణమాఫీ ,సన్న వడ్ల కు 500 బోనస్ , పంట నష్టపరిహారం , రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా,,సన్న బియ్యం పంపిణీ,మహా లక్ష్మి ద్వారా 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 కి గ్యాస్ తదితర సంక్షేమ పథకాలు అందించడంతో పాటు పెట్టుబడులకు రాష్ట్రం అగ్రస్థానంలో ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు,అభివృద్ధి పై వివిధ రాష్ట్రాల మంత్రులు అభినందించారు.

LEAVE A RESPONSE