Suryaa.co.in

Andhra Pradesh

బటన్ పగిలిన రోజు

ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ‘గోడౌన్’ చేసిన ఐదేళ్ల నిరంకుశ పాలనకు సరిగ్గా ఏడాది! అవును, రేపు జూన్ 4, 2025. సరిగ్గా ఇదే రోజున, అభాగ్య ఆంధ్ర ప్రజానీకం ఐదేళ్ల నరకం నుండి ఊపిరి పీల్చుకుంటూ, ‘ఫ్యాన్’ రెక్కల కింద నలిగిన బతుకులకు బ్రేక్ వేసి, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమికి పట్టాభిషేకం చేసింది. ఇది కేవలం ఎన్నికల ఫలితం కాదు, ‘జగన్ మార్క్ పాలన’పై వచ్చిన ‘రివర్స్ స్వింగ్’ తీర్పు!

కూటమి ప్రభుత్వం ఏర్పడి సరిగ్గా ఒక సంవత్సరం పూర్తి కాదు, కానీ ఎన్నికల ఫలితాలు వెలువడి ఒక సంవత్సరం పూర్తవుతుంది. ప్రమాణ స్వీకారం చేసిన తేదీ నుండి చూస్తే జూన్ 12న ఒక సంవత్సరం పూర్తవుతుంది.

ఎన్నికల ముందు ‘పాదయాత్ర’తో నమ్మించి… గెలిచాక సీపీఎస్ అనే సబ్జెక్టే మాకు తెలవదు అని ఉద్యోగులతో పరాచకాలు ఆడుతూ.. జనాన్ని ‘రాత్రీ పగలు’ వంచించిన వైకాపా దగాకోరుతనంతో అందరికీ కళ్ళు బైర్లు కమ్మాయి.

ప్రత్యేక హోదా నుండి 45 ఏళ్లకు పెన్షన్ల వరకు అంటూ కనిపించిన వారి తలమీద చేతులు పెట్టి చేస్తామన్నవి, అధికారంలోకి రాగానే “అది మా నవరత్నాలలో లేదు” అని ‘యు టర్న్’ తీసుకున్నారు. ‘సంక్షేమం’ పేరుతో దోపిడీకి పచ్చజెండా ఊపి, ‘అభివృద్ధి’ అనే పదాన్ని డిక్షనరీ నుండి తొలగించి, వ్యవస్థలను ‘నాశనం’ చేయడంలో పీహెచ్‌డీ చేశారు. ఐదేళ్ల పాటు ప్రజలను నరకానికి పరిమితం చేసి, ఏమీ అడగలేని ‘నిస్సహాయులుగా’ మార్చారు. ఇప్పుడు, తమ ‘ఫ్యాన్’ గాలి తీసి ఏడాది అయిన సందర్భంగా, “ఏదో ఈ రోజు ప్రమాణస్వీకారం చేసి ఏడాది అయినట్టు లెక్కలు తెలియకుండా కొత్తగా ‘సొల్లు మాటల’ నాటకానికి తెర లేపారు. ‘మోసం’ అంటే సిగ్గులేని తనానికి ఇది ‘మాస్టర్ పీస్’!

యువతకు వైన్ షాపులు, ఫిష్ ఆంధ్రా అని చూపించి, ‘రాజధాని’ అనే పదాన్ని అపహాస్యం చేసి, ‘ప్రజాస్వామ్యాన్ని’ తమ ఇంటి పెరటి వ్యవహారంలా భావించి, జనాన్ని రోడ్ల గుంతలకు వదిలేసి ప్రతిపక్ష నాయకులపై ‘కుట్ర కేసుల’ కట్టలు బనాయించడమే పాలన అనుకొన్నాడు.
జగన్ ఊహిస్తున్నట్లుగా.. ప్రజలు ‘అజ్ఞాన చక్రవర్తులు’ కారు. పోనీలే తండ్రిలేని బిడ్డ ఒక్క ఛాన్స్ అంటే ఇచ్చిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకొంటూ.. ప్రతిపక్షంగా కూడా వైకాపా అవసరం లేదని ఉప్పుపాతర వేసి లెంపలు వేసుకొన్న రోజు.

గుడ్డి ముసల్ది కూడా ముందు పెడితే బటన్ ఒత్తుతుంది. దానిని నొక్కే ప్రతోడూ పాలకుడు అయిపోడు. ప్రజలిచ్చిన తీర్పు రోజును వక్రీకరించి.. తామేదో మేధావులు అన్నట్లు, చూశారా మీరు ఏడాదిలోనే ఏమారిపోయారు అని ప్రజలనే తక్కువ అంచనా వేస్తూ పిలుపు నిస్తున్న వైకాపాకు ఎవడు సలహా ఇస్తున్నాడో వాడికి పదివేల వందనాలు.

LEAVE A RESPONSE