Suryaa.co.in

Andhra Pradesh

నిరాడంబరుడు రెడ్డి సత్యనారాయణ మృతి బాధాకరం

అమరావతి : మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత రెడ్డి సత్యనారాయణ మృతి పట్ల సీఎం చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. 5 సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రిగా చేసిన సత్యనారాయణ నిరాడంబరత్వానికి నిలువెత్తు నిదర్శనమని కొనియాడారు. మాడుగుల నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేసి, నియోజకవర్గ ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్న సత్యనారాయణ మృతి తీవ్ర విచారం కలిగించిందన్నారు. మంత్రిగా పని చేసి పదవులకు వన్నె తెచ్చారన్నారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

LEAVE A RESPONSE