ఫ్యాన్ గుర్తును రద్దు చేసి గొడ్డలి గుర్తు కేటాయించాలి

-మొన్న చాగలమర్రిలో ఇమామ్ హుస్సేన్ పై గొడ్డలి వేటు
-నిన్న గిద్దలూరులో గిరిజన యువకుడు మునెయ్యపై గొడ్డలి వేటు
-5 ఏళ్ల వైసీపీ పాలనలో 600 మంది ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీలను పొట్టన పెట్టుకున్నారు
– టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్ మీరా

ఎన్నికల సంఘం వైసీపీకి ఫ్యాన్ గుర్తును రద్దు చేసి గొడ్డలి గుర్తు కేటాయించాలని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగూల్ మీరా ఎద్దేవా చేశారు. బుధవారం నాడు మంగళగిరిలోని టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…..సొంత బాబాయిని గొడ్డలితో చంపిన వాళ్ల నాయకుల్ని వైసీపీ కార్యకర్తలు ఆదర్శంగా తీసుకున్నారు. పవిత్ర రంజాన్ మాసంలో మొన్న కర్నూలు జిల్లా చాగలమర్రిలో ఇమామ్ హుస్సేన్ పై వైసీపీ కార్యకర్తల గొడ్డలితో దాడి చేసి చంపారు.

నిన్న గిద్దలూరులో గిరిజన యువకుడు మునెయ్యను గొడ్డలితో నరికి చంపారు. ఎన్నికల సంఘం వైసీపీకి ఫ్యాన్ గుర్తును రద్దు చేసి గొడ్డలి గుర్తు కేటాయించాలి. జగన్ కి ఓట్లేసి గెలిపించిన పాపానికి ఎస్సీ,ఎస్టీ,బీసీ మైనార్టీలకు దాడులు, హత్యలు రిటర్న్ గిప్ట్ గా ఇస్తున్నారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో 600 మంది ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీలు హత్యకు గురయ్యారు. ఈ కేసుల్లో పోలీసులు ఎంతమందిపై చర్యలు తీసుకున్నారు? పోలీసులు వైసీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారు. వైసీపీకి తొత్తులుగా పనిచేస్తూ చట్ట ఉల్లంఘనకు పాల్పడిన అధికారుల పేర్లు మా నాయకుడు నారా లోకేశ్ రెడ్ బుక్ లో రాసుకున్నారు.

మరో 50 రోజుల్లో ప్రజల ఆశీర్వాదంతో టీడీపీ,జనసేన,బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుంది. తప్పు చేసిన ఏ అధికారిని వదలం. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే తప్ప రాష్ట్రాభివృద్ది సాధ్యం కాదు. టీడీపీ పాలనలో ఈజ్ ఆఫ్ డూయింగ్ లో నెం.1 స్ధానంలో ఉన్న ఏపీ నేడు వైసీపీ పాలనలో హత్యలు, దౌర్జన్యాలు, దోపిడీలలో నెం. 1 స్ధానంలో ఉంది. దాచేపల్లిలో పట్టపగలు ముస్లిం యువకుడిపై వైసీపీ గూండాలు దాడి చేశారు. అల్లా..అల్లా అని అరుస్తున్నా కనీసం జాలి లేకుండా కిరతంగా ప్రవర్తించారు. వైసీపీ పాలనలో ఏ ఒక్క వర్గం సంతోషంగా లేదు. ఎస్సీ,ఎస్ట్టీ,బీసీ మైనార్టీలు ఎప్పుడు పోలింగ్ డే వస్తుందా?

చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిని చేద్దామా అని ఎదురు చూస్తున్నారు. జగన్ రెడ్డిలా గతంలో ఏ ముఖ్యమంత్రి వ్యవహరించలేదు. 600 మంది ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీలను హత్య చేసిన ఏకైక ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. జగన్ రెడ్డి మాయమాటలు మరోసారి ప్రజలు నమ్మొద్దు. ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ కార్పోరేషన్లు నిర్వీర్యం చేసి యువతకు స్వయం ఉపాధి లేకుండా చేశారు. నాసిరకం మద్యం క్వాటర్ బాటిల్ రూ. 200కి విక్రయించి పేదల ప్రాణాలు తీస్తున్నారు.

కొంతమంది ఎస్పీలు, ఉన్నాధితాదికారులు వైసీపీకి తొత్తులుగా పనిచేస్తున్నారు. తప్పులు చేసినా తప్పించుకోవచ్చనుకుంటున్నారేమో ఏ పుట్టలో దాక్కున్నా బయటకు లాక్కొచ్చి శిక్షిస్తాం. వైసీపీ కార్యకర్తలు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలి. రేపు ఓడిపోతే జగన్ రెడ్డి ఈ రాష్ట్రం నుంచి పారిపోతాడు. మీ పరిస్దేతి ఏంటో ఆలోచించుకోండి.

వైసీపీకి తొత్తులుగా పనిచేస్తూ చట్ట విరుద్దంగా వ్యవహరిస్తున్న అధికారులను ఈసీ తక్షణమే తొలగించాలి. రాష్ట్ర ప్రయోజనాల కోసమే టీడీపీ,జనసేన,బీజేపీ పొత్తు. చంద్రబాబుని సీఎం చేసేందుకు అన్ని వర్గాల ప్రజలు సిద్దంగా ఉన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎన్డీయే కూటమిదే విజయం అని నాగూల్ మీరా ధీమా వ్యక్తం చేశారు.

Leave a Reply