– ప్రభుత్వం నిర్దేశించిన పరిమితి ప్రకారమే రైతులు పొగాకు సాగు చేయడం జరిగింది
– నో బిడ్లు లేకుండా చూడాలి
-ఎమ్మెల్యే గొట్టిపాటి
వెల్లంపల్లి పొగాకు వేలం కేంద్రంలో కొనుగోళ్లు తీరును రైతులతో కలసి పరిశీలించిన శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్ , కొండపి శాసనసభ్యులు డి.బివి స్వామి.అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. అకాలవర్షం ,వాతావరణం సరిగ్గా లేనందున పొగాకు పంట దిగుబడులు తక్కువగా ఉన్నాయి. బోర్డు లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో 130మిలియన్ల పొగాకు కొనుగోళ్లకు అనుమతులు ఉన్నాయని, అయితే రైతులు కేవలం 110 మిలియన్లు మాత్రమే పొగాకు ఉత్పత్తి చేయడం జరిగిందని, కావున రైతులకు గిట్టుబాటు ధర వచ్చే విధంగా బిడ్డింగ్‌లో అన్ని కంపెనీలు పాల్గొనాలే చూడాలని. ఈరోజు గ్రేడ్ వన్ 175 నుండి 185 రూపాయల వరకు కొనుగోలు చేస్తున్నారని గ్రేడ్ వన్ పొగాకు 180 నుండి 200రూపాయల దాకా ,అలాగే లో గ్రేడ్ పొగాకు కూడా 140 నుండి 160 రూపాయల వరకు కొనాలన్నారు.
పొగాకు రైతులకు ఆవిరేజ్ ధర 180 రూపాయలు వచ్చే విధంగా చూడాలనిబిడ్డింగ్ లో అన్ని కంపెనీల వారు పాల్గొనేలా బోర్డు అధికారులు సమన్వయం చేసుకోవాలన్నారు. రైతాంగానికి సరైన ధర అందించి కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
జిల్లాల పునర్విభజన పై స్పందిస్తూ…
అద్దంకి నియోజకవర్గం బాపట్ల జిల్లాలో కలిపి నేడు కొత్త జిల్లాగా ప్రారంభిస్తున్నందున వ్యతిరేకిస్తూ నల్లకండువా ధరించి తెలుగుదేశంపార్టీ ఎమ్మెల్యేలం నేను స్వామి నిరసన వ్యక్తం చేస్తున్నామని.
★వైసీపీ ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటుందని, ప్రజా సంఘాలు ,ప్రజా ప్రతినిధులు ఎన్నిసార్లు విన్నవించినా నిరసన కార్యక్రమాలు చేపట్టిన వైసీపీ ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని., జిల్లాలోని తెదేపా ఎమ్మెల్యేలు ,నియోజకవర్గ ఇంచార్జ్ లతో కలిసి ప్లానింగ్ కమీషన్ చైర్మన్ జి.ఎస్.ఆర్.కె.ఆర్ విజయ్ కుమార్ గారిని కలిసి జిల్లాల విభజన అస్తవ్యస్తంగా ఉందని వివరించడం జరిగిందని, అద్దంకి నుండి బాపట్ల వెళ్ళాలి అంటే దాదాపు 120 కిలోమీటర్లు మేర ప్రయాణం చేయాల్సి వస్తుందని, కనీసం రెవెన్యూ డివిజన్ అయినా ఏర్పాటు చేసి ఉంటే నియోజకవర్గ ప్రజలకు కొంతమేర ఇబ్బందులు తగ్గేవని. పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పాత పద్ధతిలోనే జిల్లాపరిషత్ సమావేశాలు జరుగుతాయని చెప్పడం ,పాత పద్ధతిలోనే జరిగితే అద్దంకి నియోజకవర్గం బాపట్ల జిల్లాలో ఉన్నప్పుడు అక్కడ ఉన్న సమస్యలు ఈ ఒంగోలు జిల్లాలో ఏఅధికారికి చెప్పాలి, ఎవరు సమస్య పరిష్కరిస్తారో తెలియని గందరగోళ పరిస్థితులు ఉన్నాయి.
పై ప్రశ్నలకు ప్రభుత్వం వద్దనే సరైన సమాధానం లేదన్నారు శాస్త్రీయంగా చేపట్టాల్సిన జిల్లాల పునర్విభజన అశాస్త్రీయంగా చేపట్టి ప్రజలను ఇబ్బందుల్లోకి నెట్టారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రస్తుత జిల్లాల పునర్విభజన పై పునరాలోచించి ప్రజలకు ప్రభుత్వ సేవలు అతి చేరువగా ఉండేలా కృషి చేస్తామని అన్నారు.
పెరిగిన విద్యుత్ ఛార్జీలు పై స్పందిస్తూ….
ఉగాది రోజున శుభవార్త వింటామనుకున్న ప్రజలకు ముఖ్యమంత్రి విద్యుత్ చార్జీల పెంపును కానుకగా ఇచ్చారని మండిపడ్డారు.విద్యుత్ ఛార్జీలు పూర్తిగా తగ్గిస్తానని ప్రమాణస్వీకారం రోజున ప్రజలకు ఇచ్చిన మాటను తప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు.చరిత్రలో ఎన్నడూ లేని విధంగా విద్యుత్ ఛార్జీల భారం మోపారన్నారు.
ఐదేళ్ల టీడీపీ హయాంలో ఒక్కసారి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచలేదని గుర్తు చేశారు.రూ.42,872 కోట్ల భారాలను ప్రజల నెత్తిన పెట్టారని, విద్యుత్ రంగాన్ని మూడేళ్లలో నాశనం చేశారని దుయ్యబట్టారు.ప్రజల ఆదాయాన్ని పన్నులు, అదనపు బాదుడుతో లాక్కుంటున్నారని విమర్శించారు. ఇష్టారీతిన ప్రజలకు షాక్ ఇస్తున్న ప్రభుత్వానికి త్వరలో ప్రజలు షాక్ ఇస్తారని ఎద్దేవా చేశారు.