Suryaa.co.in

Andhra Pradesh

కమీషన్లు ఇచ్చే కాంట్రాక్టర్లకే ప్రభుత్వం బిల్లులు చెల్లిస్తోంది

– వైసీపీప్రభుత్వతీరుతో కాంట్రాక్టర్లెవరూ టెండర్లు వేయడానికి కూడా ఇష్టపడటంలేదు
– మాజీ ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప
రాష్ట్రాభివృద్ధి విషయంలో జగన్మోహన్ రెడ్డికి అంకితభావం, పట్టుదల లేవని, వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలన్నఆలోచనలో ఆయన ఉన్నాడని, రోడ్లనిర్మాణంసహా, అనేక అభివృద్ధిపనులను ముఖ్యమంత్రి విస్మరించాడని, రాష్ట్రఆదాయంపెంచాలన్నఆలోచన లేకుండా పనిచేస్తున్నాడని, టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీ ఉపముఖ్యమంత్రి వర్యులు నిమ్మకాయల చినరాజప్ప స్పష్టం చేశారు. సోమవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాల యంలో విలేకరులతో మాట్లాడారు.
రాష్ట్రానికి అప్పులు దొరకనిస్థితికి ముఖ్యమంత్రి ఏపీని తీసుకొచ్చా డని, ఆఖరికి జీతాలు, పింఛన్లు ఇవ్వలేని దుస్థితికి సర్కారు చేరిందన్నారు. లక్షలరూపాయల జీతభత్యాలతో సలహాదారులను నియమిస్తున్న ముఖ్యమంత్రి, వారిసలహాలతోనే రాష్ట్రాన్ని ఈ విధంగా అన్నిరంగాల్లో అథోగతిపాలుచేస్తున్నారా అని మాజీ ఉప ముఖ్యమంత్రి ప్రశ్నించారు. రాష్ట్రం అప్పులఊబిలో కూరుకుపో యిననేపథ్యంలో రూ.44వేలకోట్లచెల్లింపులను కాగ్ తప్పుపట్టినా ప్రభుత్వవైఖరిలో మార్పులేదన్నారు. కేంద్రంవద్ద తీసుకున్న రు ణాలను ప్రభుత్వం చెల్లించకపోవడంతో, రాష్ట్రానికి ఎక్కడా రూపా యికూడా అప్పు దొరకడం లేదన్నారు.
గత ప్రభుత్వంలో పనులు చేసిన కాంట్రాక్టర్లకు ఈప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో, టెండర్లువేయడానికి ఎవరూ ముందుకు రావడంలేదన్నారు. టెండర్లు పడక, పనులుచేయడానికి ముందుకురాక, కాంట్రాక్టర్లం తారోడ్లపైకి వచ్చే దుస్థితిని ఈప్రభుత్వం కల్పించిదన్నారు. కమీష న్లు ఇచ్చేవారికి మాత్రమే బిల్లులుచెల్లిస్తున్న ప్రభుత్వం, తమకు అనుకూలమైన సంస్థలు, వ్యక్తులకే అనుకూలంగా వ్యవహరిస్తోంద న్నారు. ఎన్ఆర్ఈజీఎస్ బిల్లులకోసం కాంట్రాక్టర్లు కోర్టుని ఆశ్రయి స్తే తప్ప, ప్రభుత్వంలో చలనం రాలేదన్నారు. రాష్ట్రంలో రోడ్లన్నీ దారుణంగా తయారయ్యాయని, ముఖ్యమంత్రి వైఖరిచూస్తుంటే, అవి ఎప్పుడు బాగుపడతాయో కూడాతెలియని అయోమయ అవస్థలో ప్రజలు ఉన్నారని చినరాజప్ప తేల్చిచెప్పారు.

LEAVE A RESPONSE