రాష్ట్ర ఆర్థిక లావాదేవీలు , ఖర్చులపై ప్రభుత్వం శ్వేతప్రతం విడుదల చేయాలి

– టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు
ప్రముఖ దినపత్రికల్లో వచ్చిన వార్త ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితికి అద్దం పడుతోందని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు పేర్కొన్నారు. విలేఖరుల సమావేశంలో మాట్లాడిన మాటలు ఆయన మాటల్లోనే… బడ్జెట్ కు మించి ఖర్చుచేస్తుండటంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎటు పోతోందని కేంద్రం ఆరా తీస్తోంది. విదేశీ సంస్థలు, విదేశీ బ్యాంకులు సహాయం చేసే దాదాపు 960 కోట్లు ఆ ప్రాజెక్టులకు వాడకుండా సొంతానికి వాడుకుంటున్నట్లు సమాచారం అందింది. దీనిపై ఘాటుగా కేంద్రం ఒక లేఖ కూడా రాసింది. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్టేట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కి అసెంబ్లీ ఆమోదం ఉందా? లేదా? బ్యాంకు కన్సార్టియం ఇచ్చిన రూ.21,500 కోట్లు దేనికి వాడారో చెప్పాలి. కేంద్రం రాసిన ఈ లేఖతో ఆర్థిక శాఖలో కుదుపు వచ్చింది. కేంద్రం సామాన్యంగా పట్టించుకోదు. విపరీతంగా అప్పులు చేయడంతో, అధికడ్రాఫ్ట్ పై అనుమానాలు రావడంతో కేంద్రం ఏపీ ఆర్థిక లావాదేవీలపై ఆరా తీస్తోంది.
బడ్జెట్ కు మంచి ఖర్చులు, బడ్జెట్ లో లేని ఖర్చులు వైఎస్ ఆర్ బీమా డబ్బులు వాడాల్సిన రీతిలో వాడడంలేదు. దాదాపు వెయ్యి కోట్లు భవన నిర్మాణ కార్మికుల ఫండ్ ని ప్రభుత్వం ఇతర వాటికి వినియోగించింది. పిడి అకౌంటు డబ్బులు ఎక్కడ కూడా రూపాయి లేకుండా ప్రభుత్వం వాడుతోంది. లెక్కా పత్రం లేకుండా వాడుతోంది. సీఏజీ 41 వేల కోట్లు పద్ధతి ప్రకారం వాడకుండా డైరెక్టుగా ఖర్చు చేశారు. దానికి సంబంధించిన లెక్కలు ఏవని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని అడిగింది. బిల్స్ పే చేయలేదని పెద్ద ఆసుప్రతులకు మందులు సరఫరా చేసే సప్లయిర్స్ మందులు పంపిణీ చేయడం ఆపేశారు.
ఈఎస్ఐ ఆసుపత్రుల్లో పెద్ద పెద్ద సర్జరీలు జరిగేవి. దాని ఫండ్స్ అన్నింటిని డైవర్ట్ చేస్తున్నారు. కార్మికులకు సంబంధించిన ఈఎస్ఐ, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి అన్నింటిని పూర్తిగా వేరేవాటికి వాడుతున్నారు. ఇలా చేయడంవల్ల డబ్బంతా ఎటుపోతోందో అంతు చిక్కడంలేదు. అడ్వర్ టైజ్ మెంట్లకు ఖర్చు పెట్టినట్లుగా అనుమానించాల్సి వస్తోంది. టీడీపీకి సమాధానం చెప్పకపోయినా కేంద్రానికి, ప్రజలకు సమాధానం చెప్పాలి. అమరావతిలో రెండు వేల కోట్లు టీడీపీ ప్రభుత్వం బాండ్స్ తీసుకొచ్చింది. బాండ్స్ గంటలో అమ్ముడుబోయాయి. ఇప్పుడు బ్యాంకులవారిని అప్పడిగితే మేం అవ్వమంటున్నారు. హౌసింగ్ కి డబ్బులివ్వండంటే ఏ బ్యాంకు ముందుకు రావడంలేదు. పరిస్థితి ఇంతగా దిగజారిపోవడానికి కారణం ప్రభుత్వ దుబారాయే కారణం. బడ్జెట్ తో సంబంధం లేకుండా జరుగుతున్న ఖర్చులకి ఏది ప్రామాణికమన్న అంశాలు కూడా ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఈ ఆర్థిక అవకతవకలు ఇలానే కొనసాగితే కేంద్ర ప్రభుత్వం తీసుకునే అన్ని చర్యలకు నాయకులకు ఇబ్బంది లేదుగానీ ప్రజలు నష్టపోయే ప్రమాదముంది. వచ్చే ఆర్థిక అసమానతలను నివారించాలంటే ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవాలి.
టీడీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో చేసిన అప్పు.. వైసీపీ ప్రభుత్వం రెండు సంవత్సరాల్లోనే అంతకు మించి చేసింది. స్టేట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కింద తెచ్చిన డబ్బు సంక్షేమానికి వాడుతున్నామంటున్నారు, మరి రాష్ట్ర బడ్జెట్ ఏమైందో చెప్పాలి. టీడీపీ ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి నుంచి వారి అవసరాలు తీర్చేది, వైసీపీ ప్రభుత్వం దానికి తిలోదకాలిచ్చింది. మెడికల్, రోడ్లు, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ కు వచ్చే నిధులకు రాష్ట్ర ప్రభుత్వం లేఖరాసి రాకుండా చేశారు.
కార్మికుల కు వచ్చే ఈఎస్ఐ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. ఆ నిధులు కూడా దారిమళ్లించారు. వీటన్నింటిపై ఒక శ్వేతపత్రం విడుదల చేయాల్సిందిగా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తోంది. అసెంబ్లీ సమావేశం నిర్వహించి వైట్ పేపర్ రిలీజ్ చేస్తారా? అసెంబ్లీ కాకుండానే శ్వేతపత్రం రిలీజ్ చేస్తారో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. అప్పులు, ఖర్చులపై రాష్ట్ర ప్రభుత్వం శేవతపత్రం తప్పక విడుదల చేయాలని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు డిమాండ్ చేశారు.

Leave a Reply