Suryaa.co.in

Andhra Pradesh

భీమసింగి సుగర్స్ కార్మికులకి ప్రభుత్వం అండగా ఉంటుంది

-మంత్రి కొండపల్లి

విజయనగరం జిల్లా భీమసింగి సుగర్ ఫ్యాక్టరీ కార్మికులకు ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర చిన్న, సూక్ష్మ,విదేశీ వ్యవహారాల, సెర్ప్ శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు.
మంగళవారం లోక్ సత్తాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి,సుగర్ ఫ్యాక్టరీ ఉద్యోగ సంఘాల నేతల తో సచివాలయంలో మంత్రి కార్యాలయంలో సమావేశమై రైతుల,ఉద్యోగుల సమస్యల తో పాటు వారికి అందవలసిన పీఎఫ్,గ్రాట్యుటీ కోసం చర్చించారు .

ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఏటికొప్పాక, తాండవ,భీమసింగి సుగర్స్ కార్మికుల కి చెల్లించాల్సిన బకాయిలకోసం తగిన చర్యలు తీసుకుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుమతి తీసుకొని తగిన చర్యలు వెంటనే తీసుకుంటామని కార్మిక సంఘాల నాయకులకి హమీ ఇచ్చారు.

లోక్ సత్తాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి మాట్లాడుతూ సక్రమంగా క్రసింగ్ జరుగుతున్న ఫ్యాక్టరీ ని గత ప్రభుత్వం లోని పెద్దలు అవగాహన లోపంతో మూసివేసి రైతులను, కార్మికులను రోడ్డున పడేసారని కూటమి ప్రభుత్వం ఫ్యాక్టరీ ని తిరిగి తెరిపించినా,లేక మరో విధంగా ఉపయోగించుకున్నా పర్లేదని,రైతులను,కార్మికుల ను ఆదుకోవాలని కోరారు.

ఈ సమావేశంలో ప్రభుత్వ కార్యదర్శి పరిశ్రమల శాఖ యువరాజ్ కార్మిక సంఘాల నేతలు, తెలుగుదేశం పార్టీ నేతలు పొలుపర్తి స్వామినాయుడు,జాగరపు వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE