Suryaa.co.in

Andhra Pradesh

జగన్ అసమర్థ వల్లే ఇంటింటికీ కుళాయి పథకం అమలుకావడం లేదు

– సర్కారు వైఫల్యాలను జనంలోకి తీసుకువెళ్లండి
– కేంద్ర పథకాలు ప్రచారం చేయండి
– బీజేపీ శ్రేణులకు జీవీఎల్ పిలుపు

భారతీయ జనతాపార్టీ గుంటూరు జిల్లా కార్యవర్గ సమావేశం నంబూరు గ్రామంలోని VVIT కాలేజ్ ప్రాంగణంలో జరిగిన ఈ సమావేశానికి సభాధ్యక్షులుగా జిల్లా అధ్యక్షులు పాటిబండ్ల రామకృష్ణ అధ్యక్షతన జరిగింది. ఈసమావేశానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలలోకి బలంగా తీసుకువెళ్లాలని అన్నారు. మిరప రైతులకు రాష్ట్ర ప్రభుత్వమే నష్ట పరిహారం అందించాలి.జల జీవన్ మిషన్ లాంటి ప్రతిష్టాత్మక కేంద్ర ప్రభుత్వ పథకములో రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను ఇవ్వని కారణంగా, ఇంటింటికి కుళాయి పధకం ఈ రాష్ట్రంలో అమలు అవటం లేదు. Sc విద్యార్థులకు ఇచ్చే ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ లో రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇవ్వని కారణంగా కేంద్ర ప్రభుత్వమే తన వాటా 60% ని లబ్ధిదారుల బ్యాంకుల్లో వేస్తుంది అని అన్నారు.

జిల్లా అధ్యక్షులు పాటిబండ్ల రామకృష్ణ మాట్లాడుతూ ప్రజా సమస్య లను గాలికి వదిలేసి mla లు మంత్రులు వారి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు.నగరంలో ప్రధాన రహదారులు అన్ని గోతులమయము అయ్యాయి. రహదారుల విషయంలో ప్రజలు ఎంతో ఇబ్బందికి గురి అవుతున్నారు. కేంద్ర ప్రభత్వ పధకాలను ప్రజలలోకి తీసుకువెళ్ళటమే కాకుండా అవి మోడీ గారు తీసుకు వచ్చినవిగా మనమందరం ప్రజలలోకి తీసుకువెళ్ళాలని అయన అన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వర్యులు శనక్కాయల అరుణ, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు బిట్ర శివన్నారాయణ, లీగల్ ఏఫైరస్ ప్రముఖ్ భీమినేని చంద్రశేఖర్,అమ్మిశెట్టి ఆంజనేయులు, రమాకుమారి, ప్రధాన కార్యదర్శులు భాస్కర్, కుమార్ గౌడ్, పూర్ణచంద్ర రావు,రంగా,కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యస్వంత్, ST మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంశీ కృష్ణ,పాలపాటి రవి కుమార్, తోట రామకృష్ణ, వనమా నరేంద్ర,రాజేష్ నాయుడు,మకుటం శివ, జిల్లా పదాధికారులు, వివిధ మోర్చా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్సులు, మండల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్సులు,జిల్లా కార్యవర్గ సభ్యులు, వివిధ మోర్చా పదాధికారులు పాల్గొన్నారు.

బిజెపి జిల్లా కార్యవర్గంలో రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది.ఈ తీర్మానంలో అమరావతి ఏకైక రాజధానిగా కొనసాగించాలని..జిన్నా టవర్ పేరు మార్పు విషయంలో భారతీయ జనతాపార్టీ వెనకడుగు వేసేది లేదని…మిర్చి రైతులకు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం నష్ట పరిహారం అందించాలని తీర్మానం చేయడం జరిగింది.

LEAVE A RESPONSE