Home » చట్టాలు కఠినతరం కావాలి

చట్టాలు కఠినతరం కావాలి

మాజీ శాసనసభ్యురాలు కాట్రగడ్డ ప్రసూన
దేశంలో రోజు రోజుకి మహిళలు పై జరుగుతున్న అఘాయిత్యం, హత్యాయత్నం వంటి ఘటనలను నియంత్రణ కోసం.. ప్రభుత్వం మరణశిక్షలాంటి కఠినమైన చట్టాలను తీసుకువచ్చింది. కానీ, కొంతమంది అ చట్టాల పరిధి కేవలం ఆగ్రహంలో ఉన్న ప్రజలను శాంతపరచడానికి తప్ప, అసలు మూలాలను కనుక్కుని పరిష్కరించడంలో ఉపయోగపడటం లేదు అని తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన తెలిపారు.
2012 దిల్లీ నిర్భయ రేప్ ఘటన తర్వాత నుంచి ప్రభుత్వం రూపొందించిన చట్టాల వల్ల మార్పు వస్తుంది అని అనుకున్నరు .. కానీ ,రోజు రోజుకి మహిళలు పై రేప్ కేసులు పెరుగుతున్నయి తప్ప కొంత మంది మగ మృగాల్లో మార్పు రావడం లేదు..నిర్భయ సంఘటన జరిగి ఇప్పటి 9 సంవత్సరాలైంది. కానీ అది నిన్న మొన్న జరిగినట్లుగానే అనిపిస్తుంది.బాధిత కుటుంబాలకు న్యాయం జరిగిందా అంటే అంతు చిక్కని ప్రశ్నగానే మిగిలింది ..!
నిర్భయ , దిశ వంటి ఘటనలు మరువాక ముందే దేశంలో ,ముఖ్యంగా తెలుగు రాష్టలో మహిళల పై రోజు రోజుకి ఎన్నో ఘోరాలు ఆడ వాళ్లపై జరగడం చూస్తుంటే గుండె తర్రుకుపోతుంది .
చట్టాలను కఠినతరం చేయాల్సిన అవసరం ఎంతో ఉంది ..కఠినతరం చేయడానికి వెనుక ఉన్న ఉద్దేశం బాధితులు ఫిర్యాదు చేయడానికి భయం లేకుండా చేయడం ఒకటి.
అత్యాచారం కేసులకు వేసే శిక్షల్లో మరణ శిక్షను కూడా చేర్చారు.
కేసుల విచారణకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేశారు. ఈ నిబంధనల్లో ఒకటి- మైనర్‌ బాలికపై అత్యాచారం జరిగినప్పుడు దాని విచారణను ఏడాదిలోగా పూర్తి చేయాలి. కానీ ఈ నిబంధన పెట్టిన తర్వాత కూడా పెండింగ్‌లో ఉన్న అత్యాచార కేసుల సంఖ్య నిరంతరం పెరిగిపోతూనే ఉండటం చూస్తుంటే న్యాయ వ్యవస్థ, మరియు ప్రభుత్వం మొద్దు నిద్ర ఇప్పటికైన వదలాలి అని పేర్కొన్నారు ..
ప్రభుత్వం ఇచ్చిన గణాంకాల ప్రకారం 2013 చివరి నాటికి, పెండింగ్‌లో ఉన్న అత్యాచారం కేసుల సంఖ్య 95వేలు. 2019 చివరి నాటికి ఇది 1 లక్ష 45 వేలకు పెరిగింది…2021 నాటికి ఈ స్సంఖ్య రెండు లక్షల కు చేరడం చూస్తుంటే ..రూపొందించిన చట్టాలు నిందితులను చుట్టలుగా మారాయి అని చెప్పడం లో ఎటువంటి సందేహం లేదు అనిపిస్తుంది..
సైదాబాద్ లో 6 సంవత్సరాల పాపా పై జరిగిన ఘటన చూస్తుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిగ్గుతో తల దించుకోవాలి..
మొన్న ఆంధ్రప్రదేశ్ లో రమ్య, అనూష, నరసరావుపేట౼సత్తెనపల్లి మధ్యలో ఒక మహిళ పై బీహార్ కూలీలు అఘాయిత్యం చూస్తుంటే తెలుగు రాష్టలో భవిష్యత్ ఏమైపోతుందో అని భయం వేస్తోంది అని కాట్రగడ్డ ప్రసూన తన ఆవేదన వ్యక్తం చేశారు..
బాధితులకు న్యాయం ఎప్పుడు అందుతుంది?
దేశ వ్యాప్తంగా నరరూప రాక్షసుల చేతిలో అఘాయిత్యానికి లోనైన అమ్మాయిల పరిస్థితి ,వారి తల్లిదండ్రులు పడే బాధ చూస్తుంటే నోటమాట రావడం లేదు . రెండు తెలుగు రాష్ట్రాల లో రోజు రోజుకి ఎంతో మంది చిన్న చిన్న బాలికలను, మహిళలను, అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన లు చూస్తుంటే ప్రభుత్వ వైఫల్యం అర్ధమవుతుంది ..ఘటన జరిగిన వెంటనే పోలీసులు తగిన సాక్ష్యాధారాలు వెనవెంటనే కోర్ట్ వారికి సమర్పించాడంలో జాప్యం జరుగుతోందని కాట్రగడ్డ ప్రసూన ఆవేదన వ్యక్తం చేశారు..
ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ తీరు సరిగా లేదు
“ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు వేగంగా ఇటువంటి ఘటన పై వెనువెంటనే విచారణ జరిపి ,నిందితులను తక్షణమే శిక్ష ఖరారు చేసి బాధితులకు అండగా ఉండాలి ..కానీ కొన్నిసార్లు ఫోరెన్సిక్‌తోపాటు కొన్ని నివేదికలు రావడం ఆలస్యం అవుతుంది. వైద్యులు,దర్యాప్తు అధికారులు నిర్లక్ష్యం ఒకదానికి ఒకటి తోడే సమస్య కి పరిష్కారం సమయం పడుతుంది . కాబట్టి వీటి అన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఫాస్ట్ ట్రాక్ కోర్టు లు తీరుపై దృష్టి సారించాలని ప్రభుత్వనికి విజ్ఞప్తి చేశారు .
నేను కొంత మంది బాధితుల ఇంటికి పరామర్శ కి వెళ్ళినపుడు అక్కడ బాధితుల వారి ఇంటి నుంచి తిరిగి వస్తుండగా ఆ తల్లిదండ్రులు అన్న మాటలను నా చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి.“మేం బతికి ఉండగానే మాకు న్యాయం జరగాలన్నది మా కోరిక.’’ అని ఆ మాట విన్న మరుక్షణమే బాధిత కుటుంబాలకు చట్టం పైన నమ్మకం పోతుంది అనిపించింది.
అమ్మాయిలపై అత్యాచారం చేయాలంటే భయపడాలని ,అలాగే బాధితులకు ,బాధిత కుటుంబాలను సత్వరం న్యాయం అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన అన్నారు.

Leave a Reply