– ఆనందంతో ఉద్విగ్నతకు లోనైన మంత్రి కొప్పుల
125 అడుగుల బాబా సాహెబ్ అంబెడ్కర్ విగ్రహావిష్కరణ వెనుక రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి శాఖామంత్రి కొప్పుల ఈశ్వర్ శ్రమ దాగి ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి కొప్పుల ను పొగడ్తలతో ముంచెత్తారు.మంత్రి కొప్పుల అహో రాత్రులు శ్రమించినందునే ఈ రోజు ఇంతటి ఘనంగా ప్రారంభోత్సవం జరుపుకున్నామని ఆయన కొనియాడారు. ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఏ ఒక్కరినీ నొప్పించకుండా సున్నిత్వత్వంగా చేసిన ఏర్పట్లు అభినందనియమని మంత్రి కొప్పుల ను ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు. అనంతరం రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ మనుమడు ప్రకాష్ తో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి కొప్పుల ను ఘనంగా సన్మానించారు. అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందనలతో ముంచెత్తుతుంటే ఉద్విగ్నత కు గురైన మంత్రి కొప్పుల ఈశ్వర్ ముఖ్యమంత్రి కేసీఆర్ కు శిరస్సు వంచి ప్రణమిల్లారు.