వంశీ చరిత్రహీనుడుగా మిగిలిపోతాడు

– ఆర్.కృష్ణయ్య అనేక మందిని బ్లాక్ మెయిల్ చేశారు
– మీకు సిగ్గుందా.. మీకు పౌరుషం ఉందా? .
– సుబ్బారెడ్డికి మోకాళ్ళ మీద దణ్ణాలు పెట్టిన మీకు సామాజిక న్యాయం ఏది ?
– మాజీ మంత్రి కొల్లు రవీంద్ర

మహానాడు 2022 జయప్రదం చేసినటువంటి తెలుగు ప్రజలందరికీ కృతజ్ఞతలు. మహానాడులో 17తీర్మానాలను సంక్షేమలు తీర్మానం చేశారు.. మహానాడు కి ఎన్నో అడ్డంకులు పెట్టింది వైసీపీ ప్రభుత్వం. మహానాడుకి భూమి ఇచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు ఒంగోలు లో ఉన్నటువంటి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మహిళలు సైతం మహానాడుకి మోటార్ సైకిల్ మీద తరలివచ్చారు.. యావత్తు ప్రజానీకానికి జరిగిన అన్యాయాల మీద మహానాడులో చర్చ జరిగింది.

ఒంగోలు చరిత్రలో ఎప్పటికి నిలిచిపోతుంది. గన్నవరం లో నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి అడ్డంగా ఫ్లెక్సీలు కట్టి ఆయన మొహాన్ని కనబడకుండా చేశారు.. ఎన్టీఆర్ విగ్రహానికి అడ్డంగా డయాస్ కట్టిన వంశీ చరిత్రహీనుడుగా మిగిలిపోతాడు. సామాజిక న్యాయవేదిక కాదు వైసీపీ ది. సామాజిక న్యాయానికి సమాధులు కట్టి బస్సు యాత్ర చేస్తున్నారు.

వై.వి.సుబ్బారెడ్డికి మోకాళ్ళ మీద దణ్ణాలు పెట్టిన మీకు సామాజిక న్యాయం ఏది? మీకు పదవులే ముఖ్యమా? ఒక్క పైసా కూడా కార్పొరేషన్ ద్వారా ఏ ఒక్క వర్గానికైనా ఇచ్చారా? రేట్లు కట్టి ఎంపీ టికెట్లు అమ్ముకునే జగన్ సామాజిక న్యాయం గురించీ మాట్లాడతాడా? ఆంధ్రా వాళ్ళు దోచుకుంటున్నారు అన్న ఆర్.కృష్ణయ్యకు రాజ్య సభ సీటా? ఆర్.కృష్ణయ్య అనేక మందిని బ్లాక్ మెయిల్ చేశారు ఇక్కడ కొత్త పార్టీ పెడత అన్న ఆర్.కృష్ణయ్యకు రాజ్యసభ సీటా? మీకు సిగ్గుందా.. మీకు పౌరుషం ఉందా? .

బడుగు బలహీన వర్గాల బ్రతుకుల్లో వెలుగులు నింపితే సామాజిక న్యాయం. వైసీపీ వేధింపులకు అన్యాయంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు.అబ్దుల్ సలాం మీ వేధింపులకు ఆత్మహత్య చేసుకున్నాడు. డాక్టర్ సుధాకర్ మరణానికి కారణం మీరు కాదా?రాష్ట్రంలో దుర్మార్గ పాలన జరుగుతోంది. వైసీపీ అంబోతులు బస్సులెక్కి రంకెలేస్తున్నారు. నీచుడు, దుర్మార్గుడు, సైకో సీఎం ను పొగుడుతూ బస్సు యాత్ర. ప్రజలు మీ సభల నుంచీ పారిపోతున్నారు