– సమాజం లోని పౌరుల భవిష్యత్తు వైద్య విద్యార్థుల చేతుల్లో ఉంది
– వైద్య వృత్తి , సేవలో తృప్తి ఉంటుంది
– 90 శాతం వైద్యం స్థానిక ప్రాంతంలోనే జరగాలి, నగరాలకు వైద్యం కోసం వెళ్లకూడదు
-వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ
-వైద్య వృత్తి కి న్యాయం చేయాలి
– నిరంతరం వైద్య విద్యా కొనసాగుతూ… టెక్నాలజీతో పోటీపడాలి
– వైద్య సేవలో ఏలాంటి లోటుపాట్లు జరగనివ్వద్దు
– ఫ్రెండ్లీ డాక్టర్ గా ఉంటూ.. రోగులకు సేవలు అందించాలి
– దేవాదాయ ధర్మాదాయ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ
మెదక్ జిల్లా: స్థానిక మెదక్ పట్టణంలోని పిల్లి కొట్యాల్ లో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాల లోని ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం తరగతుల ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా వైద్య ఆరోగ్యశాఖ మంత్రులు దామోదర్ రాజనర్సింహ, దేవాదాయ ,ధర్మాదాయ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ ఎంపీ రఘునందన్ రావు, మెదక్ ఎమ్మెల్యే మదనపల్లి రోహిత్ రావ్, ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు వైద్య కళాశాల ప్రిన్సిపాల్ రవీందర్ లు ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ.. తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క పౌరునికి ఉచిత నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, సమాజంలోని పౌరుల భవిష్యత్తు వైద్య విద్యార్థుల చేతుల్లో ఉందని, వైద్య వృత్తి లో రోగులకు సేవలు అందించడం తృప్తి గా ఉంటుందన్నారు.
90 శాతం వైద్యం స్థానిక ప్రాంతాల్లో జరగాలని, నగరాలకు వైద్యం కోసం రోగులు వెళ్లకుండా శ్రద్ధ వహించాలన్నారు. 220 పడకల ఆసుపత్రి భవన నిర్మాణం, నర్సింగ్ కళాశాల, పారామెడికల్ కళాశాల, అన్ని రకాల మౌలిక వసతులను వచ్చే విద్యా సంవత్సరం వరకు ప్రారంభించుకోవాలన్నారు.
దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ విద్యార్థులు వైద్య వృత్తికి న్యాయం చేయాలని, వైద్యవృత్తి చదువుతూనే టెక్నాలజీతో పోటీపడాలన్నారు. వైద్య సేవలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా సేవ చేయాలని యువ డాక్టర్లకు పిలుపునిచ్చారు.
ఫ్రెండ్లీ డాక్టర్ గా ఉంటూ రోగులకు ఉత్తమ సేవలు అందించినప్పుడే వృత్తికి న్యాయం చేసిన వారు అవుతరాన్నారు. ఆత్మస్థైర్యంతో ముందుకెళ్లి తల్లిదండ్రులకు గురువులకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని విద్యార్థుల సూచించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ప్రజా ప్రతినిధులు అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.