Suryaa.co.in

Political News

ఈ నిశ్శబ్దానికి కారణం

గత ఎన్నికల్లో కూడా పోలింగ్ పర్సెంటేజ్ పెరిగింది. రాత్రంతా మహిళలు, వృద్ధులు కూడా క్యూలలో వున్నారు. భారీ ఎత్తున పసుపు కుంకుమలు, పెంచిన పెన్షన్లు పనిచేశాయి. మళ్లీ బాబు రావాలి అని జనం గట్టిగా అనుకొన్నారు అనే విశ్లేషణలు. ఊహించని ఫలితాలు. ఎంతలా అంటే వైకాపాలో మళ్లీ ఏడాది వరకు అసెంబ్లీలో కూడా సిఎం చంద్రబాబు అని చర్చల్లో కూడా పలుకుతూ.. జగన్ సిఎం అని గుర్తుకు రాలేనంత షాక్.

కానీ ఆ గెలుపుకు ఎన్నో అబద్దాలు. 45 ఏళ్ల పెన్షన్ నుండి ప్రతి విద్యార్థికీ అమ్మఒడి వరకు ఎన్నో గాలిమేడల ఆశలు. ఎంతో కసిగా వైకాపా క్యాడర్ & రెడ్లు పనిచెయ్యడం. అదే పరిస్థితిలో చంద్రబాబే గెలిపించుకొంటారు అనే ఉదాసీనత టిడిపిలో. మనం ఇచ్చే మహత్తర సంక్షేమం & అభివృద్ధికి తిరుగులేదు అనే నమ్మకం.

కానీ ఈసారి మొదట జగన్ను దింపేయాలి అనే కసి. టిడిపి, జనసేన క్యాడర్ నుండి భూమి వున్న ప్రతి ఒక్కరిలో కనిపించింది. వైకాపా క్యాడర్లో జగన్ మిరాకిల్స్ చేసి పార్టీని గెలిపిస్తాడు అనే ఉదాసీనత.

ఎంతలా అంటే వాస్తవంగా పోల్ అవ్వాల్సిన ఓట్లకు మించి, రాలేని వారివి కూడా పోల్ అవుతున్నా పట్టించుకోలేనంత. పులివెందులలో కూడా 60-70% ఓటర్లకు మాత్రమే 2000 పంపకాలు చెయ్యడం, కనీసం పోలింగ్ స్టేషన్ల వద్దకు తిరిగేవాళ్లు లేరు. కడపలో పులివెందుల కచ్చితంగా గెలుస్తుంది, కానీ మెజారిటీ తగ్గుతుంది ఈసారి అని పులివెందుల టిడిపిలో చెప్పేవారు, 15 రోజుల క్రితం. ఇవ్వాళ 500-600 మెజారిటీతో టిడిపి గెలిచినా ఆశ్చర్యపోనక్కరలేదు.

ఎందుకంటే గతంలో పులివెందుల టౌన్లో రిగ్గింగ్ జరిగేది. ఈసారి 16000 ఓట్లు పోల్ కాలేదు. అసలు మంగళి క్రిష్ణ , గుండ్ల వాగు శంకర్ ఎవరూ అటు తొంగి చూడలేదు. వైకాపాకు దిక్కూమొక్కు లేదు. టిడిపిలో ఏజెంట్లను ఎవరినైనా కొని, సైలెంట్ దొంగఓట్లు తెలియకుండా చేసుకొని వుంటే తప్ప ఎక్కడా ఈసారి ఆ పరిస్థితి లేదు. అందువలన ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ నుండి కడపలో కూడా మార్పు అయితే కనిపించింది అంటున్నారు.

కడప టౌన్ సీటు మళ్లీ టిడిపి గెలుస్తుంది అనే టాక్ నడుస్తోంది. ఎంపీ మాత్రం ముక్కోణపు పోటీలో ఫలానా వారు ఓడిపోతున్నారని కానీ ఫలానా వారు గెలుస్తున్నారు అని గానీ చెప్పలేని పరిస్థితి. జనం ఎవరికి వేసారో అంతుబట్టడం లేదు అనే మాటలే ఎక్కడా.

ముఖ్యంగా పులివెందుల , పుంగునూరు లాంటి స్థానాల్లో ఈ నిశబ్దం వెనుక భయం వుండి వుండవచ్చు. వైకాపాకు వేశారు అంటే నిర్భయంగా చెప్పేవారు. కానీ ఎవరూ స్పష్టంగా చెప్పకపోవడం చూస్తుంటే.. సర్వే చేసేవారికి అర్థం అవుతోంది. వైకాపాకు గడ్డుపరిస్థితులు వున్నాయి అక్కడ కూడా అని.

సుమారు 8-9 ఉమ్మడి జిల్లాలలో కూటమి స్వీప్ కనిపిస్తోంది. ఒక్క కడప మాత్రం మెజారిటీ స్థానాలు వైకాపా గెలుస్తుంది. తరువాత కొద్దో గొప్పో కర్నూలు అనే అంచనాలు. ఇంకెక్కడా వైకాపా ఓ పదివేల మెజారిటీతో ఎక్కడైనా గెలుస్తుందా అంటే చెప్పలేని దైన్యం. వైజాగ్లో ఒక్క సీటు వైకాపాకు వస్తుంది అనుకొంటే.. చివరి పది రోజుల్లో అది కూడా చేజారింది.

ఇక ఉత్తరాంధ్రాలో టిడిపి కూటమికి రాననుకొన్నవి కూడా వస్తున్నాయి. చిత్తూరు సగం సగం అనే టాక్ నుండి నాలుగు మాత్రం నెక్ టు నెక్ మిగిలినవి కూటమివే అనే పరిస్థితి. ఈసారి 30-40% వరకు ఎస్సి సామాజిక వర్గం కూటమి వైపు మొగ్గడమే కాకుండా.. బహిరంగంగా కూటమి శిబిరాల వద్ద కబుర్లు చెబుతూ కనిపించారు అని కూడా కొన్ని విశ్లేషణలు.

కూటమి కౌంట్ 120 నుండి మొదలై 160 దాటినా ఆశ్చర్యపోనక్కరలేదు అనే అంచనాలు వున్నాయి. కాదంటే గత అనుభవంతో ఫలితాల వరకు సైలెంట్ గా వుండడం ఉత్తమం అనే నిశ్శబ్దం నడుస్తోంది.

గతంలో ఎన్నికలు జరిగిన మరుసటి రోజు, జగన్ చేత కేక్ కట్ చెయ్యించి, సిఎం నేంప్లేట్ ఒకటి పెట్టి ఫోటో హడావిడి చేసింది ఐప్యాక్. ఈసారి వాళ్లు & పిల్ల సజ్జల పార్టీ సోషల్మీడియా మొత్తం ప్యాకప్.

ఇన్నాళ్లూ పులిస్వారీ చేసిన జగన్, విదేశాలకు వెళ్లే అనుమతి దొరకడం, పులి నుండి క్రింద పడిపోయే ముందు దాని తోకకు వ్రేలాడుతూ దొరికిన వెసులుబాటులాంటిది.

ఈ నిశ్శబ్దం అర్థం కాకుండా.. వైకాపా నాయకుల కక్షల్లో పావులు అవుతూ స్వైరవిహారం చేస్తూ రెచ్చిపోతున్నారు చాలా మంది. ఎన్నికల దొమ్మీ కేసుగా అవుంది అని ఓడిపోతున్నామనే అక్కసులో దాడులు చేస్తున్నారు. ఓడాక, ఫలితాల తరువాత చేస్తే, వ్యక్తిగత పగ క్రింద కేసులు పెడతారు అనే భయానక దృశ్యాలు కనిపిస్తోంది. జనం చూస్తున్నారు.

పులిస్వారీ అయ్యాక, ఫలితాల తరువాత, దాని క్రిందపడే జగన్ ఒక గడ్డిపోచలాగా కూడా ఈ విరుచుకుపడే వారికి ఉపయోగపడడు. అసలైన సిస్టం క్లీనప్ మొదలవుతుంది. గుణపాఠాలు ఎంతోమంది నేర్చుకోబోతున్నారు. ఆ జాబితాలో అధికారుల వరకు ఉండవచ్చు.

ఒక్క వైకాపా తప్ప ఓట్లేసిన జనం నుండి అంతా కూటమి ప్రభుత్వం వస్తోంది అనే మాటలే. వైకాపాకు మిరాకిల్స్ మళ్లీ మళ్లీ జరగవు. అలా జరిగితే మిరాకిల్స్ అనరు.

– బోయపాటి రమేష్

LEAVE A RESPONSE