Suryaa.co.in

Andhra Pradesh

టీడీపీ ఘనవిజయంలో లోకేష్‌ పాత్ర

-అరాచకపాలనను కూకటివేళ్లతో పెకలించిన అనితరసాధ్యుడు
-యువగళంతోనే మొదలైన ప్రజా తిరుగుబాటు
-ప్రజల్లో చైతన్యం రగిల్చిన పోరాటయోధుడు
-పోలీసు ఒత్తిళ్లకు వెనక్కుతగ్గని యువకెరటం

అమరావతి: రాష్ట్రంలో జగన్మోహన్‌ రెడ్డి అరాచకపాలనపై యువనేత నారా లోకేష్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర ప్రజాతిరుగుబాటుగా మారి చివరకు వైసీపీ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకలించి వేసింది. 2023 జనవరి 27న కుప్పం వరదరాజ స్వామి పాదాలచెంత యువనేత లోకేష్‌ ప్రారంభించిన చారిత్రాత్మక పాదయాత్ర రాష్ట్ర రాజకీయ యవనికపై చెరగని ముద్ర వేసింది. ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి విశాఖ వరకు 226 రోజులపాటు 97 అసెంబ్లీ నియోజకవర్గాలు, 2300 గ్రామాలమీదుగా 3132 కి.మీ మేర సాగిన యువగళం పాదయాత్ర జగన్‌ విధ్వంసకపాలనపై ప్రజలను చైతన్యవంతం చేయడంలో సంపూర్ణ విజయం సాధించింది.

పాదయాత్ర ప్రారంభంలో యువగళంపై అధికారపార్టీతోపాటు స్వపక్షంలో కూడా పెద్దగా అంచనాలులేవు. పాదయాత్రకు ప్రజల నుంచి రోజురోజుకు పెరుగుతూ వచ్చిన అనూహ్య స్పందనతో ప్రభుత్వ పెద్దల్లో వణుకు మొదలైంది. జీవో1తో నల్ల జీవో తెచ్చి యువనేత గొంతునొక్కే ప్రయత్నం చేశారు. మాట్లాడే మైక్‌ నుంచి నిలబడే స్కూలు వరకు అన్నీ లాగేసి అడుగడుగునా అడ్డం కులు సృష్టించారు. అయితే యువనేత లోకేష్‌ ఏ మాత్రం వెన్నుచూపకుండా కోట్లాదిమంది ప్రజాగళాన్నే తమ గొంతుకగా రెట్టించిన ఉత్సాహంతో జగన్‌ సర్కారు అరాచకపర్వాన్ని ఎలుగెత్తిచాటారు. కుప్పంలో యువగళం పాదయాత్ర ప్రారంభం మొదలు తంబళ్లనియోజకవర్గం వరకు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ప్రతి 20 కిలోమీటర్లకు ఒకటి చొప్పున మొత్తంగా 25 పోలీసు కేసులు నమోదుచేశారు. రెండురోజులకు ఒక కేసు చొప్పున బనాయించి నియతృత్వంగా వ్యవహరించారు. ప్రచార రథం, సౌండ్‌ సిస్టమ్‌, మైక్‌, స్టూల్‌తో సహా అన్నింటినీ పోలీసులు సీజ్‌ చేసినా యువనేత ఏ దశలోనూ వెనక్కి తగ్గకుండా తమ గళాన్ని మరింత బలంగా విన్పించారు.

అన్నీ తానై అరాచకశక్తులకు ఎదురొడ్డి…
పాదయాత్ర సమయంలో యువనేత లోకేష్‌ అసాధారణ పోరాటపటిమతో ప్రత్యర్థు లకు ముచ్చెమటలు పోయించారు. సాధారణంగా సమస్య తలెత్తినపుడు నాయకుడి తరపున కార్యకర్తలు ఆందోళనలు చేయడం పరిపాటి. ఇటువంటి సందర్భాల్లో యువకెరటం లోకేష్‌ వ్యవహరించిన తీరు స్పూర్తిదాయకంగా నిలచింది. పాదయాత్రను అడ్డుకోవాలన్న కుతుంత్రంతో జగన్‌ రెడ్డి తొత్తులుగా మారిన కొందరు పోలీసులు, వైసీపీ మూకలు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడ్డాయి. ఆ సందర్భంగా కార్యకర్తలకంటే ముందుగా తానే రోడ్డుపై కూర్చుని తమదైన శైలిలో నిరసన చేపట్టి కేడర్‌లో మనోధైర్యాన్ని నింపారు.

పాదయాత్ర 14వ రోజు జీడీ నెల్లూరు నియోజకవర్గం సంసిరెడ్డిపల్లిలో యువనేత లోకేష్‌ ప్రజలనుద్దేశించి ప్రసంగించడానికి సిద్ధమయ్యారు. ఆ సమయంలో అక్కడి డీఎస్పీ ప్రసాద్‌ నేతృత్వంలో వందమందికి పైగా పోలీసులు కార్యకర్తలను చుట్టుముట్టి యువగళం పాదయాత్రపై ఒక్కసారిగా దాడికి దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. లోకేష్‌ మాట్లాడేందుకు బాషా అనే కార్యకర్త మైక్‌ తీసుకొస్తుండగా, అతడిపై పోలీసులు గూండాలమాదిరిగా దాడిచేసి మైక్‌ లాక్కున్నారు. పాదయాత్రను అనుసరి స్తున్న వాలంటీర్లు, నాయకులపై కూడా పోలీసులు దౌర్జన్యానికి దిగి యుద్ధ వాతావరణం సృష్టించారు.

చివరకు లోకేష్‌ స్టూల్‌పై నిలబడి మాట్లాడేందుకు ప్రయత్నించగా, ఆ స్టూలును కూడా లాక్కునే ప్రయత్నం చేశారు. పోలీసులకు రాజ్యాంగాన్ని చూపుతూ ఏ నిబంధన ప్రకారం తనను అడ్డుకుంటున్నారో చెప్పాల ని యువనేత నిలదీశారు. ఈ సందర్భంగా సంసిరెడ్డిపల్లి గ్రామస్థులు పోలీసులపై తిరగబడి, లోకేష్‌ను తమ గ్రామంలో మాట్లాడవద్దు అనడానికి మీకు ఏం హక్కు ఉందని ప్రశ్నించారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కును హరించడానికి మీరెవరంటూ పోలీసులపై లోకేష్‌ బెబ్బులిలా విరుచుకుపడ్డారు. ఎటువంటి జంకూగొంకు లేకుండా లోకేష్‌ చూపిన ఈ పోరాట పటిమే ప్రజల్లో చైతన్యాన్ని రగిల్చి చివరకు అరాచక ప్రభుత్వాన్ని అంతమొందించింది.

యువగళం స్పూర్తితో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘనవిజయం
పాదయాత్ర చిత్తూరు జిల్లా దాటే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా 107 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో జరిగిన 3 గ్రాడ్యుయేట్‌ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ విజయదుందుభి మోగించింది. భగభగమండే నిప్పుకణంలా లోకేష్‌ చేపట్టిన పాదయాత్ర పవర్‌ ఏమిటో అప్పుడు గానీ అధికారపక్షానికి అర్థం కాలేదు. పాద యాత్ర చిత్తూరు జిల్లా నుంచి ఉమ్మడి అనంతపురం జిల్లాలోకి ప్రవేశించే సమ యంలోనే రాష్ట్రంలోని మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఎన్నికల్లో యువగళం ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా విద్యావంతులైన యువ ఓటర్లపై స్పష్టంగా కన్పించింది.

అధికార యంత్రాంగాన్ని మొత్తం తమ గుప్పెట్లో పెట్టుకుని ఒక్కొక్క ఎమ్మెల్సీ స్థానానికి వందకోట్ల రూపా యలకు పైగా వైసీపీ అభ్యర్థులు ఖర్చుచేసినప్పటికీ చైతన్యవంతమైన యువత తెలుగుదేశం అభ్యర్థుల వైపే మొగ్గుచూపారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గతంలో ఏ నాయకుడు చేపట్టని విధంగా 14 అసెంబ్లీ నియోజకవర్గాలలో 45 రోజుల పాటు 577 కిలోమీటర్ల దూరం కొనసాగిన యువగళం పాదయాత్రకు అడగడుగునా అన్నివర్గాల ప్రజలు నీరాజనాలు పలికారు. యువనేత పాదయాత్ర 40వ రోజున మదనపల్లిలో నిర్వహించిన బహిరంగసభలో యువనేత చేసిన ప్రసంగంతో పెద్దిరెడ్డి గ్యాంగ్‌లో ప్రకంపనలు చెలరేగాయి.

ఆ సభలో పెద్దిరెడ్డి కుటుంబ అవినీతిని ఆధారాలతో సహా బట్టబయలు చేయడంతో వారికి కంటిమీద నిద్ర కరువైంది. పాదయాత్ర 41వ రోజు తంబళ్లపల్లి నియోజకవర్గంలో కొనసాగుతున్న సమయంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ సాకుతో యువనేత లోకేష్‌ క్యాంప్‌ సైట్‌ ఖాళీ చేయాలని ఆర్డీఓపై వత్తిడి తెచ్చి నోటీసులు ఇప్పించారు. కనీసం కంటేవారిపల్లి క్యాంప్‌ సైట్‌లో ఉండేందుకు కూడా అనుమతించలేదు. దీంతో మూడురోజుల పాటు ఆయన క్యాంప్‌ను వీడి హైదరాబాద్‌ వెళ్లిపోయారు. యువగళం గొంతునొక్కేందుకు చేసిన ప్రయత్నాలన్నీ బెడిసికొట్టాయి. ఎమ్మెల్సీ ఎన్నికల నుంచే అరాచక ప్రభుత్వంపై ప్రజాతిరుగుబాటు మొదలైంది.

LEAVE A RESPONSE