Suryaa.co.in

Telangana

కృష్ణాజలాలపై కేసీఆర్‌ను బద్నాం చేస్తున్నారు

– కేంద్రానికి అప్పగించబోమని తీర్మానం చేయాలి
– బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్

కేంద్ర ప్రభుత్వానికి కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను అప్పగించబోమంటూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. చేసిన తప్పును సరిదిద్దుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందంటూ లేనిపోని ఆరోపణలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ ని బద్నాం చేసే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు.

ఎట్టి పరిస్థితుల్లోనూ కేసీఆర్ తెలంగాణ నీటి హక్కులను వదులుకునేమనిషి కాదన్న సంగతి ప్రజలందరికీ తెలుసు అని చెప్పారు. జలాల సాధన కోసమే తెలంగాణ ఉద్యమం చేశామని, కాబట్టి నీటి హక్కుల విషయంలో కెసిఆర్, బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికీ రాజీ పడబోదని తేల్చి చెప్పాలి.

కృష్ణానది పై ఉన్న ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించడానికి జరిగిన సమావేశాల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంగీకరించిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రాజెక్టులను ధారాదత్తం చేసి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద తప్పు చేసిందని, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి తమపై లేనిపోని ఆరోపణలు చేస్తోందని అన్నారు.

LEAVE A RESPONSE