మంత్రి సుభాష్
రామచంద్రపురం1 : నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని రాష్ట్ర కార్మిక శాఖ వాసంశెట్టి సుభాష్ కి శుభాకాంక్షలు తెలిపేందుకు తరలి వచ్చిన వారితో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం లోని VSM కళాశాల ప్రాంగణం జనసంద్రంలా మారింది. ఒక ప్రక్క అధికారులు, మరోపక్క కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, అభిమానులుతో కళాశాల ప్రాంగణం సందడి పండుగ వాతావరణం నెలకొంది.
ఈ సందర్భంగా మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ.. స్వర్ణాంధ్ర సృష్టికర్త ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రo స్వర్ణాంధ్ర అవుతుందని మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ తెలుగు ప్రజలు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. 2025 సంవత్సరం అందరికీ ఆనందకరమైన, ఆరోగ్యకరమైన జీవితం కలగాలని ఆకాంక్షించారు. 2024 లో సంవత్సరంలో ప్రజలు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పుతో ఏర్పడిన మీ మంచి ప్రభుత్వం అందరి ఆశలు నెరవేర్చేలా అహర్నిశలు పని చేస్తోంది అన్నారు.