Suryaa.co.in

Andhra Pradesh

చంద్రబాబుతో కలిసి కనకదుర్గమ్మని దర్శించుకున్న హోంమంత్రి అనిత

– ఉండవల్లి నివాసంలో కలిసి ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపిన హోంమంత్రి
– కొత్త సంవత్సరం సందర్భంగా హోంమంత్రి అనితని కలిసిన పోలీస్ ఉన్నతాధికారులు
– తెలుగు ప్రజలకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు
-హోంమంత్రి వంగలపూడి అనిత

ఉండవల్లి: ఆంగ్ల నూతన సంవత్సర వేడుకలను హోంమంత్రి అనిత నిరాడంబరంగా జరుపుకున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ని ఉండవల్లి నివాసంలో కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తో కలిసి ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మవారిని దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజల నిర్వహన అనంతరం ఆలయ పండితుల వేదమంత్రోచ్ఛారణల నడుమ ఆశీర్వచనం స్వీకరించడం గొప్ప అవకాశంగా పేర్కొన్నారు.

అనంతరం హోంమంత్రి క్యాంపు కార్యాలయంలో పోలీస్ ఉన్నత అధికారులు హోంమంత్రిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. డీజీపీ ద్వారకా తిరుమలరావు, విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్ తో పాటు పలువురు పోలీస్ శాఖ ఉన్నతాధికారులు హోంమంత్రి అనితతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.

రాబోయే రోజుల్లో విజనరీ లీడర్ చంద్రబాబు నాయకత్వంలో ఏపీ స్వర్ణాంధ్ర విజన్-2047 త్వరలోనే సాకారమవుతుందన్న ఆకాంక్షను వెల్లడించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారి మరణంతో సంతాప దినాలు ప్రకటించినందున పాయకరావుపేట నియోజకవర్గ ప్రజలతో వేడుకలు జరుపుకోలేకపోయానని.. వారికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. నియోజకవర్గ అభివృద్ధిలో ప్రజలందరి భాగస్వామ్యం కావాలని కోరారు.

LEAVE A RESPONSE