Suryaa.co.in

Andhra Pradesh

టీడీపీ-జనసేన కలయిక వ్యాక్సిన్ కాదు- వైరస్‌

– నీవు ఒక పావలా.. నీ చుట్టూ 4 పావలాలు.. కలిపితే రూపాయి పావలా..
– పవన్‌కళ్యాణ్‌ పెడన సభా అట్టర్‌ఫ్లాప్‌
– పవన్ కు వరుసగా భంగపాటు
– టీడీపీ బ్లడ్ వేరు కదా.. మరి ఎల్లో బ్లడ్ ఎక్కించుకున్నావా పవన్?
– నీవు అమ్ముడుపోయావని,అంతా అమ్ముడుపోరని తెలుసుకో..!
– మీరంతా తినేది-ఉండేది హైదరాబాద్ లో.. విషం కక్కేది ఏపీలోనా..?
– పవన్, చంద్రబాబు కలయిక అపవిత్రం
– అది ఒక వైరస్‌తో సమానం..విష బీజం
-అందుకే ప్రజలు ఇద్దరినీ ఆదరించడం లేదు
– దీన్ని జనసేన, టీడీపీ క్యాడర్‌లు గమనించాలి
– వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేశ్‌

పవన్‌ వి గాలి మాటలని తేలింది:
నిన్న (బుధవారం) పెడనలో జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ సభలో.. ఏదో చేసేయాలని చాలా తాపత్రయపడ్డాడు. 2 వేల మంది గుండాలను పోగు చేస్తున్నామని, తనపై రాళ్ల దాడి జరుగుతుందని, తనపై కత్తులు, కటార్లతో దాడికి ప్లాన్‌ చేస్తున్నారని ఆవేశంగా ఆరోపించాడు. కానీ పెడనలో పవన్‌ బహిరంగసభకు కనీసం 2 వేల మంది కూడా రాలేదు. అతనివి గాలి మాటలని తేలిపోయింది. గాలి పోగేసి ఆరోపణలు చేస్తాడని పెడన సభ చూస్తే ప్రజలకు అర్థమైంది. ఇంత నీచానికి పవన్ దిగజారిపోయాడు.

పొత్తులు పెట్టుకున్న తర్వాత, జరుగుతున్న వారాహి యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడతారని పవన్‌ భావించాడు. కానీ అవనిగడ్డలో పొత్తు ప్రకటన తర్వాత జరిగిన తొలి సభలో జనం ఆయన్ను ఆదరించలేదు. దీంతో అందరి అటెన్షన్‌ క్రియేట్‌ చేయడం కోసం, పెడనలో తనపై దాడికి ప్లాన్‌ చేస్తున్నారని ఆరోపించాడు. కానీ అక్కడ కూడా ఆయన సభ అట్టర్‌ఫ్లాప్‌ అయింది.

వాక్సిన్‌ కాదు. వైరస్‌. విషబీజం:
జనసేన, తెలుగుదేశం కలయిక వాక్సిన్‌ అని పవన్ అంటున్నాడు. కానీ ప్రజలు అది ఒక వైరస్‌ అన్నారు. అంతే కాకుండా ఆ కలయిక పాయిజన్‌తో సమానం అని తేల్చి చెప్పారు. ఎందుకంటే.. 2014లో మీ ఇద్దరి కలయిక, మీ ఇద్దరి బంధం, మీ ఇద్దరు ఏ విధంగా అందరినీ మోసం చేసింది, దగా చేసింది అన్నది అందరూ చూశారు. నీ దత్తతండ్రి చంద్రబాబు ఏ విధంగా స్కీమ్‌ల పేరుతో స్కామ్‌లు చేశాడనేది అందరూ గుర్తించారు.

సూట్‌కేస్‌ కంపెనీలు, హవాలా వ్యవహారాలు అన్నీ ఆధారాలతో సహా పట్టుబడి, ఈరోజు రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉన్నాడు నీ దత్తతండ్రి. ఆయనకు మద్దతుగా నీవు జైలుకు వెళ్లి, ములాఖత్‌ అయి, ఆ తర్వాత మిలాఖత్‌ అయ్యావు. బయటకు వచ్చి, వచ్చే ఎన్నికల్లో ఇద్దరూ కలిసి పోటీ చేస్తామని ప్రకటించావు. ఆ తర్వాత నీవు చేపట్టిన వారాహి మరో విడత యాత్రలో ప్రజలు అపూర్వంగా ఆదరిస్తారని ఆశించావు. కానీ నీకు ఎక్కడా ఆ ఆదరణ లభించడం లేదు.

క్షమాపణలు చెప్పాలి కదా..?:
పెడన వచ్చిన నీవు మొదట, అక్కడి ప్రజలకు క్షమాపణలు చెబుతావని అందరూ అనుకున్నారు. నీ సినిమా.. అత్తారింటికి దారేది? అన్న సినిమా పైరసీ జరిగిందని, ఇక్కడి చేనేత కార్మికులు 30 మందిపై కేసు పెట్టించావు. వారిని పోలీస్‌ స్టేషన్‌లో పెట్టి కొట్టించావు. అంత పని చేసిన నీవు, ఏ ముఖం పెట్టుకుని పెడన వచ్చావు?

పెడనలో కలంకారీ పరిశ్రమ చాలా ఫేమస్‌. ఆ కళాకారుడు పిచ్చుక శ్రీనివాస్‌ను వైయస్సార్‌ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు ఇచ్చి సత్కరించింది జగనన్న ప్రభుత్వం. కానీ నీవేం చేశావ్‌. వారిని సినిమా పైరసీ కేసులో కొట్టించావు. హింసించావు. అందుకే ఇక్కడికి వచ్చి, క్షమాపణ చెబుతావని, చేసిన పనికి సిగ్గు పడతావని అందరూ అనుకున్నారు.కానీ నీకు సిగ్గు, శరం లేదు. అందుకే మళ్లీ బండెక్కి.. ఏదేదో వాగావు. నార తీస్తా. తోలు తీస్తా.. అని ఏదేదో అన్నావు.

నీకంటూ నిబద్ధత ఉందా?:
గత ఎన్నికల్లో ఏం జరిగింది. పక్కనే భీమవరంలో గ్రంథి శ్రీనివాస్‌ చేతిలో ఓడిపోయావు. అక్కడ విశాఖలో కూడా దారుణంగా ఓడిపోయావు. రెండు చోట్ల ఓడిపోయిన నీవు నిసిగ్గుగా వ్యవహరిస్తున్నావు. నీకు అసలు ఒక నిబద్ధత, చరిత్ర ఏమైనా ఉందా?

2014లో చంద్రబాబుతో కలిసి పోటీ చేశావు. ఆ తర్వాత ఆయనతో విభేదించి దూరమై.. అదే చంద్రబాబుపై విమర్శలు గుప్పించావు. వారు యథేచ్ఛగా దోచుకుంటున్నారని ఆరోపించావు. టీడీపీ ప్రజా ద్రోహం చేస్తోందని అభివర్ణించావు. అన్ని మాటలు అన్న నీవు వారితో తిరిగి ఎలా కలిసిపోతావు? 2014లో కలిసి పోటీ చేశావు. ఆ తర్వాత బయటకు వచ్చి దారుణంగా తిట్టావు.

ఎల్లో బ్లడ్‌ ఎక్కించుకున్నావా?:
మరోవైపు వారు (టీడీపీ) కూడా నీపై విరుచుకుపడ్డారు. లీడర్‌షిఫ్‌ అంటే మాది. ఎవరైనా సీఎం కావాలంటే.. మా సామాజికవర్గం బ్లడ్‌ ఎక్కించుకోవాలని టీడీపీ వారన్నారు. ఆ మాటలు నీకు గుర్తు లేవా? అసలు నీకు ఏమైనా సిగ్గుందా? వారి బ్లడ్‌ ఏమైనా ఎక్కించుకున్నావా? అందుకే ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావా? రాజమండ్రి సెంట్రల్‌ జైలులో వారి బ్లడ్‌ ఎక్కించుకున్నావా? వారికి అమ్ముడుపోయావా? అందుకే మళ్లీ కలిసి పోటీ చేస్తామంటున్నావా?

మరి నిన్ను నమ్ముకున్న కాపు అన్నదమ్ములు, కాపు అక్క చెల్లెమ్మలు నీ మాదిరిగా బ్లడ్‌ ఎక్కించుకోరు కదా? అందుకే నీ రెండు సభలు అట్టరఫ్లాప్‌ అయ్యాయి. అవనిగడ్డ, పెడన సభలను జనం ఆదరించలేదు. నీవు అమ్ముడు పోయావు. నీవు టీడీపీ వారి పంచన చేరావు. కానీ మా వాళ్లు నీ మాదిరిగా అమ్ముడుపోరు.

వారూ నీ వెంట రావాలా?:
వంగవీటి రంగాను చంపింది ఎవరు? ఈ తెలుగుదేశం పార్టీ కాదా? చంద్రబాబునాయుడు కాదా? అంటే రంగాను దారుణంగా నరికి చంపిన వారిని, చంద్రబాబును నీవు మోస్తావు? మిగిలిన వారు కూడా మోయాలంటావా? ముద్రగడ పద్మనాభం కుటుంబాన్ని దారుణంగా హింసించిన, వేధించిన చంద్రబాబు వెంట నీవు వెళ్లినంత మాత్రాన, మా వాళ్లు కూడా రావాలా?

నీవు ఒక పావలా..:
రూపాయి పావలా అంటున్నావు.నీకు ఎటూ పావలా కళ్యాణ్‌ అన్న పేరు ఉంది. ఆ పేరు పెట్టారన్న ఉక్రోషంతో రూపాయి పావలా ప్రభుత్వం అంటున్నావు. అయిదు పావలాలు అయితే రూపాయి పావలా. ఇందులో మొదటి పావలా చంద్రబాబు. రెండో పావలా పవన్‌కళ్యాణ్‌. మూడో పావలా ఎల్లో మీడియా. నాలుగో పావలా మిగతా పార్టీల్లో ఉన్న కోవర్టులు. అయిదో పావలా జేఏసీల పేరుతో పెట్టుకున్న సంస్థలు. ఈ అయిదు పావలాలు కలిసిన సున్నా ఇంటు సున్నా. సున్నా ప్లస్‌ సున్నా ఎంత విలువ ఉంటాయో.. వీరికి అంతే విలువ ఉంది. సన్నాసులకు, సున్నాసులకు ప్రజా సేవ తెలియదు.. అదీ మీ రాజకీయం.
అదే జగన్‌ మనసున్న నాయకుడు. దమ్మున్న నాయకుడు.. సుపరిపాలన చేస్తున్నాడు. సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా పని చేస్తున్నారు. ఇదేం ఖర్మరా బాబూ? అంటూ చంద్రబాబు తిరిగాడు. కానీ ఎవరికి ఖర్మ పట్టింది? టీడీపీ వారికి పట్టింది ఆ ఖర్మ. చంద్రబాబుకు ఖర్మ పట్టి, రాజమండ్రి జైలులో ఉన్నాడు.

అదీ మీ ఖర్మ:
తెలుగుదేశం- జనసేన కలిసి వచ్చినా, కనీసం 2 వేల మందిని కూడా సభకు రప్పించలేకపోయారు. అది మీకు పట్టిన ఖర్మ. ప్రజలు సంతోషంగా ఉన్నారు. జగన్‌గారి పాలన ఇంకా కావాలని వారంతా కోరుకుంటున్నారు. రాష్ట్రానికి మరో 25 ఏళ్ల పాటు జగన్‌గారు సీఎంగా ఉండాలని అనుకుంటున్నారు. దాన్ని జీర్ణించుకోలేక ప్రభుత్వంపైనా, సీఎంగారి పైనా విషం చిమ్ముతున్నావు.

నీవు ఎక్కడి వాడివి?:
రాష్ట్రానికి రావాలంటే పాస్‌పోర్టు, వీసా కావాలా? అని అడుగుతున్నావు. ఔను నీకు కావాలి. ఎందుకంటే నీవు భారతీయుడివో తెలియదు. రష్యా వాడివో తెలియదు. నీవు రష్యా వాడివైతే పాస్‌పోర్టు, వీసా కావాలి. నీవు తినేది పడుకునేది హైదరాబాద్‌. చంద్రబాబు, లోకేష్, రామోజీరావు, రాధాకృష్ణ, బీఆర్‌ నాయుడు, బాలకృష్ణ.. వీరంతా తినేది, పడుకునేది కూడా హైదరాబాద్‌లోనే. కానీ విషం కక్కేది మాత్రం ఆంధ్రప్రదేశ్‌పైనా. 5 కోట్ల మంది ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకుంటున్న జగన్‌గారిపై అదే పనిగా విషం కక్కుతున్నారు.

అది క్లాస్‌ వార్‌ కాదా?:
జగన్‌ ఇప్పుడు జరుగుతోంది క్లాస్‌ వార్‌ అంటున్నారు. ఔను అది నిజం. 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి, 10 లక్షలకు పైగా ఇళ్లు నిర్మిస్తుంటే.. అడుగుడుగునా కేసలు వేసి, మీరు అడ్డుకున్నారు. మరిఇది పెత్తందార్లు, పేదల యుద్ధం కాదా? అది క్లాస్‌ వార్‌ కాదా? పేదల పక్షాన జగనన్న ఉంటే.. పెత్తందార్ల పక్షాన నీవు, చంద్రబాబునాయుడు, ఎల్లో మీడియా ఉన్నారు. మీరెన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా, వచ్చే ఎన్నికల్లో మీకు మళ్లీ పరాజయం తప్పదు.

నా ప్రజలకు అన్నీ తెలుసు:
నా గురించి నీవు మాట్లాడావు. నేను మంచి వాణ్నో, చెడ్డవాణ్నో ప్రజలకు తెలియదా? నా గురించి నా నియోజకవర్గం ప్రజలకు తెలుసు కాబట్టే.. నీకు అక్కడ మద్దతు దక్కలేదు. నా గురించి నీవు ప్రధానితో మాట్లాడతావా?. నా గురించి తర్వాత, ముందు నీ గురించి చెప్పాలి. నీవు ఎప్పుడు, ఎవరితో ఉంటావో తెలియదు. గతంలో ప్రధానిని తిట్టావు. మళ్లీ ఆయన కాళ్లు పట్టుకున్నావు. చంద్రబాబుతో కలిసి పోటీ చేశావు. ఆ తర్వాత బయటకు వచ్చి ఆయనను తిట్టావు. మళ్లీ ఇప్పుడు కలిసిపోయావు.

అసలు నీకా అర్హత ఉందా?:
మాకు దమ్ముంది కాబట్టే ప్రజాక్షేత్రంలో ఉన్నాం. వారి మనసు గెల్చుకున్నాం. అధికారంలోకి వచ్చాం. మా గురించే మాట్లాడే అర్హత లేని నీవు, జగన్‌గారి గురించి మాట్లాడతావా? ఆయన స్థాయి ఎక్కడ? నీ స్థాయి ఎక్కడ? జగన్‌గారు దమ్మున్న నాయకుడు. ఆయన గురించి మాట్లాడే అర్హత నీకుందా? ఇంకా ఏదో మాట్లాడావు. అవి వింటుంటే.. రియాల్టీ షోల్లో జోకర్లు మాట్లాడుతుంటారు. ఆరు అంగుళాల మరుగుజ్జు.. ఆరడుగుల ఆజానుభావుడి చంకలోకి ఎక్కుతారు. పులివెందుల అట. రాజశేఖర్‌రెడ్డి అట. ఆయనెక్కడ? నువ్వెక్కడ? ఆయనను నీవు భయపెట్టావా? ఏమైనా కల కన్నావా? ఆయన ముందు నీ స్థాయి ఎంత? అంత దరిద్రమైన వైరస్‌ పవన్‌కళ్యాణ్‌.

పవన్ నిజస్వరూపం తెలుసుకోండి:
ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలకు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ఆ పార్టీ సానుభూతిపరులకు కూడా చెబుతున్నాను. చంద్రబాబు పని అయిపోయిందని, టీడీపీ బలహీనపడింది కాబట్టి, తన అవసరం వచ్చిందని పవన్‌ అంటున్నారు. అందుకే మీరంతా మైండ్‌సెట్‌ మార్చుకొండి. పవన్‌కు ఊడిగం చేయకండి. చంద్రబాబును, లోకేశ్‌ను ఆదరించకండి.

మీ ప్రతి గడపకు జగనన్న అందించిన సంక్షేమ పథకాలు వచ్చాయా? అన్నది చూడండి. ఇదే విషయాన్ని జనసేన, టీడీపీ కార్యకర్తలకు కూడా చెబుతున్నాను.చంద్రబాబునాయడు, పవన్‌కళ్యాణ్‌ కలయిన అపవిత్రం. అది ఒక వైరస్‌తో సమానం. అది ఒక విషబీజం. వారిద్దరూ కలిసి గతంలో కూడా పని చేశారు. కానీ వారితో ప్రజలకు ఒరిగిందేమీ లేదు. రాష్ట్రానికి జగన్‌గారి నాయకత్వం కావాలి. మన కుటుంబ ఎదుగుదల, మన పిల్లల భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు కోసం కావాలి. దీని గురించి అందరూ ఆలోచించాలి.

పవన్‌ రాజకీయాలకు అనర్హుడు:
మీకు (టీడీపీ కార్యకర్తలు) ఒక స్థాయి, విలువలు ఉన్నాయి కదా? అలాంటప్పుడు పవన్‌ను ఎందుకు నమ్మాలి. టీడీపీ బలహీనపడిందని అంటున్న పవన్‌ను ఇంకా ఎందుకు నమ్ముతున్నారు. తెలంగాణలో 40 సీట్లలో పోటీ చేస్తాను. నాకు బలం ఉంది అంటున్నావు కదా.. మరి ఇక్కడ 20 సీట్ల కోసం చంద్రబాబు కాళ్లు ఎందుకు పట్టుకుంటున్నావు? ఆయనకు ఎందుకు అమ్ముడుపోయావు? కాబట్టి, పవన్‌ను ఎవ్వరూ నమ్మొద్దు. ఆయన రాజకీయాల్లో పనికిరాడు. ఆయన ఎవరికీ మేలు చేయడు. అదే జగన్‌ మాట ఇస్తే.. దాన్ని కచ్చితంగా నిలబెట్టుకుంటాడు. అందరి బాగు, భవిష్యత్తు కోసం ఆయన గట్టిగా నిలబడతాడు. అందుకే రాష్ట్రానికి ఆయన నాయకత్వం కావాలి.

పవన్‌ రెడీగా ఉండు.. నీతో సినిమాలు తీస్తా:
పవన్‌ నిన్న పెడనలో నామీద అవినీతి ఆరోపణలు చేశాడు. కానీ అక్కడ టీడీపీ, జనసేన నాయకులు అంతా కలిసి ప్రయత్నించినా, ఆ సభకు కనీసం 2 వేల మంది కూడా రాలేదు. మరి ప్రజలు నాతో ఉన్నారా? లేక పవన్‌ను ఆదరిస్తున్నారా?. ఆలోచించండి.

నన్ను అండమాన్‌ జైలుకు పంపిస్తాను అని పవన్‌ అన్నాడు. పవన్, నీకో విషయం చెబుతున్నా. 2024 తర్వాత నీవు రెడీగా ఉండు. నీతో నేను రెండు సినిమాలు తీస్తాను. జానీ–ఖూనీ. గబ్బర్‌సింగ్‌–రబ్బర్‌సింగ్‌ . ఈ రెండు సినిమాలు తీస్తాను. ఎందుకంటే, ఆయన అప్పుడు సినిమాలు మాత్రమే చేసుకోవాలి కాబట్టి.. అని మంత్రి జోగి రమేశ్‌ అన్నారు.

LEAVE A RESPONSE