పైచేయి మాదేనోయి..

పాఠం మొదలైంది..
పాట మొదలైంది..
అట మొదలైంది..
కాసుల వేట మొదలైంది..
కులాల కుమ్ములాట మొదలైంది..
రాజకీయ జంజాట మొదలైంది..
అయితే కోవిడూ…
నీ పతనమూ మొదలైనట్టేనా..!?

లేదు…కాలేదు..
కాని కరోనాపై
మనిషి పైచేయి మొదలైంది..
అలవాటైపోయింది..
భయం తగ్గింది ..
జయించగలమనే
నమ్మకం పెరిగింది..
వాక్సిన్ వచ్చింది
కొమ్ములు విరిచే
మందులూ ఉన్నాయి..
ఓ దైర్యం..
ఇదే ముగింపైనా
కాకపోయినా ఓ తెగింపు..!

కరోనా..ఏంటి నీ బలుపు..
వేధించడమేనా నీ పథకం..
వధించడమేనా నీ గెలుపు..
తలదించడమేనా
మా బ్రతుకు
ఇవే ప్రశ్నలు..
ఇవే శ్లేషలు..
ఇవే గుండె ఘోషలు…
అక్కడితో ఆగాయి మీనమేషాలు..!

నీ పని నీదే..
మా పని మాదే..
లాక్ డౌన్
కాలేకపోయింది
నీకు కౌంట్ డౌన్
అప్పుడిక ఎన్నాళ్ళు చేసి
ఏం లాభం..
క్షోభ..సంక్షోభ తప్ప
ఇప్పటికే చేసింది పెద్ద తప్పు..
ఎన్నాళ్ళు ఉంటుంది
నీ ముప్పు..
చూద్దాం..నువ్వా..మేమా!

నమ్మకం పెరుగుతోంది..
నువ్వు ప్రాణాంతకం కాదని
భయాంతకమేనని..
మనోబలమే మందని
ధైర్యమే చికిత్సని
వస్తావు పోతావు కరోనా అని
జాగ్రత్తగా ఉంటే చాలని..
నిజానికి నీ కంటే బలమైన శత్రువులను మనిషి చూడలేదా
క్రూర జంతువులనే ఎదిరించలేదా..
విలయాలు..ప్రళయాలు..
ఇంకెన్నో ప్రకృతి బీభత్సాలు..
యుద్ధాలు..బాంబు దాడులు..
హిరోషిమా..నాగసాకీలు..
మనిషిలోని నాటకీయాలు..
మనిషి వెనక రాజకీయాలు..
ఆటుపోట్లు..వెన్నుపోట్లు..
వీటి కన్నా ప్రమాదకరమైనవా
నీ కాట్లు…
ఈనాటి ఈ పాట్లు..!
పోతావు..ఓ నాటికి
నువ్వే పోతావు..
కష్టం మాకు ఇష్టం
ఈనాడైనా..మరో నాడైనా
మనిషి గమ్యం కాష్టం..
నువ్వేమీ కాదే పరాకాష్టం
రగిలే రావణ కాష్టం..
తీరిపోదా ఈ కష్టం..!

చివరగా ఓ మాట..
రణం నా గుణం..
నువ్వెంత..జీవమే లేని
ఓ కణం..!

ఇ.సురేష్ కుమార్
9948546286

Leave a Reply