Suryaa.co.in

Andhra Pradesh

వెలిగొండ ప్రాజెక్టు పూర్తి అవాస్తవం

-పశ్చిమ ప్రకాశం జిల్లాలో అభివృద్ధి శూన్యం
-ఏపీ బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్

పశ్చిమ ప్రకాశం జిల్లా వాసులు 2019 ఎన్నికలలో ఓట్ల వర్షం వైకాపాకు కురిపిస్తే నేడు ప్రజలు కళ్ళలో కన్నీటి వర్షం కురుస్తుంది.జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో ఏ ఒక్క జల ప్రాజెక్టు పూర్తీ కాలేదు, అభివృద్ధి ఆనవాళ్లు శూన్యం.

పశ్చిమ ప్రకాశం జిల్లా, కడప మరియు నెల్లూరు జిల్లాల ప్రజలను వరప్రదాయిని వెలిగొండ ప్రాజెక్టు పూర్తీ కాకున్నా పూర్తీ చేసినట్లు అట్టహాసంగా రాష్ట్ర ప్రభుత్వం పత్రికలలో ప్రకటనలు ఇవ్వడం దౌర్భాగ్యం.

జగన్మోహన్ రెడ్డి వెలిగొండ ప్రాజెక్టు సంబందించి ఈ క్రింది ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా ?
1 ) ప్రాజెక్టు నిర్వాసితులకు 1800 కోట్లు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం బాకీ ఉందా, లేదా ? ఎప్పుడు ఈ మొత్తం నిర్వాసితులకు చెల్లిస్తారు?

2 ) ప్రాజెక్టు రివిట్మెంట్ పూర్తీ అయ్యిందా ?, కొల్లం వాగు వద్ద హెడ్ రెగ్యులేటరీ పనులు 60 శాతం పనులు ఇంకా పూర్తీ కాకుండా నిల్వ ఉందా, లేదా?

3 ) డిస్ట్రిబ్యూటరీ కెనాల్ మరియు అవసరమైన వంతెనలు పూర్తీ చేశామని చెప్పే దైర్యం మీకు ఉందా?

4 ) టన్నెల్ మరియు ప్రధాన డ్యామ్ మధ్య 2009 లో నిర్మించిన ఫీడర్ కెనాల్ మొత్తం మట్టితో పూడి పోయినదానికి నిర్వహణ మరియు మరమత్తులు ఊసు ఎక్కడ ?

5) మిగులు జలాల పైన ఆధారపడి నిర్మిస్తున్న వెలిగొండ ప్రాజెక్టుకు శ్రీశైలం ప్రాజెక్టు నుండి ప్రస్తుత పరిస్థితులలో అవసరమైన నీరు లభ్యం అయ్యే పరిస్థితి ఉందా?

6 ) నికర జలాలు 10 టీఎంసీలు కేటాయించాలని పశ్చిమ ప్రకాశం ప్రజలు డిమాండ్ చేస్తున్నా జగన్మోహన రెడ్డి గారికి ఉలుకు పలుకు ఏందుకు లేదు?

ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సిన భాద్యత జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది, పూర్తీ కానీ వెలిగొండ ప్రాజెక్టు పూర్తీ చేసినట్లు ప్రకటనలు ఇవ్వడం దివాలాకోరుతనానికి నిదర్శనం.

వెలిగొండ పూర్తీ అయినట్లయితే సురక్షిత త్రాగు నీరు అందించడం ద్వారా కనిగిరిలో ఉన్న ఫ్లోరైడ్ సమస్య నుండి ప్రజలకు రక్షణ కల్పించే అవకాశం ఉన్న రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేస్తుంది.

వెలిగొండ ప్రాజెక్టు సంపూర్ణంగా పూర్తి అయ్యే వరకు బీజేపీ పోరాడుతుంది? ఈ అంశం పైన ఇప్పటికే బీజేపీ అనేక ఆందోళన కార్యక్రమాలు చేసింది.
వెలిగొండ పూర్తి కోసం నాటి జిల్లా బీజేపీ అధ్యక్షులు బాదం రాములు మరియు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బద్దం బాలరెడ్డి కలిసి కాకర్ల గ్యాప్ నుండి సోమశిల వరకు ఎప్పుడో 25 సంవత్సరాల ముందే పాదయాత్ర చేశారు.

బీజేపీ ప్రకాశం జిల్లా అధ్యక్షులు హోదాలో బత్తిని నరసింహారావు మరియు జెట్టి ప్రభాకరరావు అనేక సంవత్సరాలు ఈ ప్రాజెక్టు కోసం కార్యక్రమాలు చేశారు. ప్రకాశం జిల్లా ఏర్పాటుకు అనేకసార్లు బీజేపీ డిమాండ్ చేసినా నిమ్మకు నీరెత్తినట్టు జగన్మోహన రెడ్డి వ్యవహరిస్తున్నారు.కనిగిరి నిమ్జ్ మరియు దొనకొండ పారిశ్రామిక వాడకు కేంద్రం నుండి అనుమతులున్నా, అవసరమైన భూమి అందించని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వముంది.

అమరావతి నుండి అనంతపురం వరకు ఎక్ష్ప్రెస్స్ వే కోసం కేంద్రప్రభుత్వం అన్ని అనుమతులు ఇచ్చినా, దాని రూట్ మార్చి నమ్మి ఓట్ వేసిన ఆ ప్రాంత ప్రజలను జగన్మోహన్ రెడీ గారు నమ్మక ద్రోహం చేస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వం దర్శిలో ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ కోసం 50 కోట్లు మంజూరు చేస్తే, రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం వల్ల ఈ ప్రాజెక్టు వెనక్కి పోయింది.

కేంద్ర ప్రభుత్వం దొనకొండ వద్ద హెలికాఫ్టర్ ట్రైనింగ్ సెంటర్ మరియు నేవి నేవిగేషన్ సెంటర్ మంజూరు చేస్తే, కనీసం అవసరమైన భూమి మంజూరు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం అయ్యింది.

పశ్చిమ ప్రకాశం జిల్లా మార్కాపురంలో మెడికల్ కాలేజీ కోసం అనుమతి ఇవ్వడం, దోర్నాలో గిరిజనుల కోసం మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పూర్తీ చేసింది.

ఒంగోలు అసెంబ్లీ పరిధిలో కేంద్ర ప్రభుత్వం కొత్తపట్నం వద్ద ఫిషింగ్ హార్బర్ మంజూరు చేసినా రాష్ట్రప్రభుత్వ నిర్లిప్తత వల్ల ఒక్క అడుగుకూడా ముందుకు పడని దుస్థితి నెలకొంది.

గుండ్లకమ్మ నుండి ఒంగోలు పట్టణానికి త్రాగు నీరు అందించాలని కేంద్ర ప్రభుత్వం 350 కోట్ల రూపాయిల నిధులు మంజూరు చేస్తే ఆ పనులు పూర్తీ చేయడంలో రాష్ట్రప్రభుత్వం విఫలం అయ్యింది.

ఒంగోలు పార్లమెంట్ పరిధిలో నేడు ప్రజలకు త్రాగు నీరు, రైతుకు సాగు నీరు లేదు మరియు యువతకు ఉపాధి లేదు, కానీ వైకాపా నాయకుల అవినీతికి అంతులేదు.

శ్రీ రామరాజ్య స్థాపనలో భాగంగా ఈ అంశాలన్నిటినీ త్వరితగతిన పూర్తీ కావడానికి బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది.

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిరసనగండ్ల శ్రీనివాసరావు :
వెలిగొండ ప్రాజెక్టు సంపూర్ణంగా పూర్తీ అయ్యే వరకు బీజేపీ పోరాడుతుంది? ఈ అంశం పైన ఇప్పటికే బీజేపీ అనేక ఆందోళన కార్యక్రమాలు చేసింది. వెలిగొండ పూర్తీ కోసం నాటి జిల్లా బీజేపీ అధ్యక్షులు బాదం రాములు మరియు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బద్దం బాలరెడ్డి కలిసి కాకర్ల గ్యాప్ నుండి సోమశిల వరకు ఎప్పుడో 25 సంవత్సరాల ముందే పాదయాత్ర చేశారు.

బీజేపీ ప్రకాశం జిల్లా అధ్యక్షులు హోదాలో బత్తిని నరసింహారావు మరియు జెట్టి ప్రభాకరరావు అనేక సంవత్సరాలు ఈ ప్రాజెక్టు కోసం కార్యక్రమాలు చేశారు. ఫిబ్రవరి 2 వ తేదీన మార్కాపురంలో ధర్నా మరియు రాబోయే కొన్ని రోజులల్లో వెలిగొండ ప్రాజెక్టు పూర్తీ కోసం వివిధ మార్గాలలో ఆందోళన కార్యక్రమాలు చేస్తాము.

LEAVE A RESPONSE