Suryaa.co.in

Andhra Pradesh

రేషన్ బియ్యం కేంద్రానిది సోకు రాష్ట్రానిది

– రేషన్ డీలర్ల సమస్యను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి
– బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి

విజయవాడ… రేషన్ డీలర్ల సమస్యలను పరిష్కరించేందుకు బిజెపి మద్దతు కోరుతూ రేషన్ డీలర్లు బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ని కలసి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని రేషన్ డీలర్ల రాష్ట్ర అద్యక్షుడు దివ్వి లీలా మాధవరావు అందజేశారు.

ఈ సందర్భంగా మాధవరావు మాట్లాడుతూ ఆహార భద్రతా చట్టానికి విరుద్దంగా ఎండియు విధానం అంటే మొబైల్ బియ్యం పంపిణీ విధానాన్ని రద్దు చేయాలని రాష్ట్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ఉధ్యమంలో బాగాగంగా బిజెపి సహకారాన్ని అర్ధిస్తూ బిజెపి రాష్ట్ర కార్యాలయం లో బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలిని కలిసామన్నారు.

కేంద్రప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న రేషన్ బియ్యం అందిస్తున్నా ప్రధాని ఫొటో కూడా మొబైల్ వ్యాన్ పై డిసెప్లే చేయడం లేదు. కనీసం వ్యాన్ పై కేంద్రం ఇస్తున్న ఉచిత బియ్యం గా ఎక్కడా ప్రజలకు తెలియని పరిస్ధితి ఉందన్న విషయాన్ని డీలర్లు బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గబాటి పురందేశ్వరి ముందు అంగీకరించి,, అందుకు తగిన విధంగా స్పందిస్తూ మొబైల్ వ్యాన్ పై 60 శాతం స్పేస్ కేటాయించి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇస్తున్న బియ్యంగా ప్రచారం కల్పించాల్సిన అవకాశం రాష్ట్ర ప్రభుత్వం చేయాలని రేషన్ డీలర్లు పేర్కొన్నారు.
రేషన్ డీలర్లకు ఏడున్నర వేలు గౌరవ వేతనం, కమీషన్ క్వింటాల్ కు 150 చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని మాధవరావు పేర్కొన్నారు.

రేషన్ డీలర్ల డిమాండ్ లను పరిష్కరించాలని ఈ సందర్బంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు. పురందేశ్వరికి వినతి పత్రం సమర్పించిన వారిలో రేషన్ డీలర్ల రాష్ట్ర అధ్యక్షుడు డి మాధవరావుతో పాటు రేషన్ డీలర్ల అసోసియోషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడపా వెంకటరమణ, గంగాధర్ గౌడ్ తదితరులు ఉన్నారు.

LEAVE A RESPONSE