Suryaa.co.in

Andhra Pradesh

వేంపల్లి 50 పడకల ఆసుపత్రిలో 12 మంది డాక్టర్లకు గాను 4 గురు మాత్రమే ఉన్నారు

-104 పథకానికి పేరు మార్చి డబ్బా కొట్టుకుంటుంది
-జగన్ పాలనలో ఆరోగ్య రంగం అనారోగ్యం
-వైద్య ఆరోగ్య శాఖపై డాక్టర్ ఎన్. తులసి రెడ్డి

జగన్ పాలనలో ఆరోగ్య రంగం అనారోగ్యం పాలైంది, బడ్జెట్ కేటాయింపులు ఒక శాతం లోపే. అందులో ఖర్చు 50 శాతం లోపే. వైకాపా పాలనలో ఆరోగ్యశ్రీ అనారోగ్య శ్రీ అయింది. నెట్వర్క్ ఆసుపత్రులకు సకాలంలో బిల్లులు చెల్లించడం లేదు. సెప్టెంబర్ నుండి నేటి వరకు రూ.750 కోట్లు బిల్లులు పెండింగులో ఉన్నాయి. కొన్ని నెట్వర్క్ ఆసుపత్రులు ఆరోగ్య శ్రీ కింద రోగులను చేర్చు కోవడం లేదు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిబ్బంది, పరికరాలు, మందుల కొరత తీవ్రంగా ఉంది.పులివెందుల పట్టణంలో 100 పడకల ఆసుపత్రి లో 23 మంది డాక్టర్లకు గాను కేవలం 10 మంది మాత్రమే ఉన్నారు.పులివెందుల నియోజకవర్గం వేంపల్లి 50 పడకల ఆసుపత్రి లో 12 మంది డాక్టర్లకు గాను 4 గురు మాత్రమే ఉన్నారు. మందుల కొరత తీవ్రంగా ఉంది. ఎక్స్ రే యంత్రం ఉన్నప్పటికీ బిగించని కారణంగా మూడేళ్లుగా మూలన పడి ఉంది.

అమ్మకు అన్నం పెట్టని ప్రభుద్దుడు పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తా అన్నట్లుంది ప్రభుత్వ వాలకం. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులను చూసేటందుకు డాక్టర్లు లేరు, ఇచ్చేటందుకు మందులు లేవు, కానీ డాక్టర్లే రోగి ఇంటికి పోయి వైద్యం అందిస్తారని గొప్పలు చెప్పుకోవడం హాస్యాస్పదం.
ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కొత్తది కాదు. 104 పథకానికి పేరు మార్చి డబ్బా కొట్టుకుంటుంది. ఇప్పటికైనా వట్టి మాటలు కట్టి పెట్టీ ఆరోగ్యశాఖ కు బడ్జెట్ కేటాయింపులు పెంచి ఖర్చు చేయాలని, ఆరోగ్య శ్రీ కింద పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిబ్బంది, పరికరాలు, మందుల కొరత లేకుండా చూడాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది

LEAVE A RESPONSE