Suryaa.co.in

Andhra Pradesh

ఒక్క ఛాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చి పొన్నూరులో 2,200 కోట్లు దోచేశారు

– పొన్నూరు ఎమ్మెల్యే 125 కోట్ల టన్నుల గ్రావెల్ దోచేశాడు
– తాడేపల్లి ప్యాలెస్ లో సజ్జల 2,200 కోట్ల దోపిడీలో వాటాల పంపిణీ చేశాడు
– మాజీ మంత్రి దేవినేని ఉమ

పొన్నూరు: వైసిపి నేతల దోపిడీపై పొన్నూరులో ధూళిపాళ్ల నరేంద్ర ఆధ్వర్యంలో తెలుగుదేశం జనసేన శ్రేణులు చేస్తున్న పాదయాత్రలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వారికి సంఘీభావం తెలిపారు. పొన్నూరు నియోజకవర్గం చేబ్రోలు మండల పరిధిలోని వడ్లమూడి,సుద్దపల్లి, శెలపాడు గ్రామల పరిదిలో జరిగిన 7 కిలోమీటర్ల పాదయాత్రలో దేవినేని పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక్క ఛాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చి పొన్నూరు నియోజకవర్గంలోనే ఎమ్మెల్యే 2,200 కోట్ల అవినీతి చేశారని.. దోపిడీలో వాటాల పంపకం తాడేపల్లిలో సజ్జల ఆధ్వర్యంలో జరిగిందని విమర్శించారు. దోచిన సొమ్ము మొత్తం ప్రభుత్వ ఖజానాకు జమ చేయిస్తామని ఆయన హెచ్చరించారు.
తాడేపల్లి ప్యాలెస్ అండతో పొన్నూరు ఎమ్మెల్యే 125 కోట్ల టన్నుల గ్రావెల్ దోచేశాడు. తాడేపల్లి ప్యాలెస్ లో సజ్జల 2,200 కోట్ల దోపిడీలో వాటాల పంపిణీ చేశాడు. రెవిన్యూ మైనింగ్ వ్యవస్థలు ఏం చేస్తున్నాయి? దోపిడీ సొమ్ము మొత్తం ప్రభుత్వ ఖజనాకు జమ చేయించాలి.

చేబ్రోలు మండల పరిధిలోని శేకూరు, వీరనాయకుని పాలెం, శెలపాడు,వేజెండ్ల, సుద్దపల్లి,చేబ్రోలు, వడ్లమూడి మరియు ఇతర గ్రామాలలో పెద్ద ఎత్తున గ్రావెల్ దోపిడి జరుతువుంది.ఎమ్మెల్యే అవినీతిపై పోరాటం చేస్తే నరేంద్రను అరెస్ట్ చేశారు.ఎమ్మెల్యే కళ్ళల్లో ఆనందం కోసం కొంతమంది అధికారులు తప్పుడు కేసులు పెట్టారు.

నరేంద్ర పోరాటంతో వైసీపీ నేతల దోపిడీకి ఐదు కోట్ల రూపాయలు పెనాల్టీ పడ్డా ఇంతవరకు చెల్లించలేదు గ్రావెల్ దందా ఆగలేదు. 2019-20 లో 1247 ఎకరాల్లో ఉద్యాన పంటలు ఉంటే 2021-22 కు 585 ఎకరాలకు పడిపోయాయి అంటే 700 ఎకరాలు మీ గ్రావెల్ దోపిడికి గురయ్యాయి. సీనియర్ శాసనసభ్యుడిగా ధూళిపాళ్ల నరేంద్ర రైతాంగ సమస్యలపై అలుపు లేని పోరాటం చేశాడు.

LEAVE A RESPONSE