Suryaa.co.in

Andhra Pradesh

వాజపేయి వారసులు నరేంద్ర మోడీ

– బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి

అటల్ జీ రాజనీతిజ్ఞుడు. అందరూ నా వాళ్ళు అనే భావన వాజపేయి లో చూస్తాం.వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర 2047కల్లా అభివృద్ధి చెందిన దేశం గా తీర్చి దిద్ది డానికి నరేంద్ర మోడీ సంకల్పం.అందుకు కార్యాచరణ వాజపేయి నేతృత్వంలో బీజాలు పడ్డాయి.వాజపేయి సమయం లో టెలికాం విప్లవానికి నాంది. గ్రామీణ సడక్ యోజన పథకం ద్వారా గ్రామాలకు కనెక్ట్ విటీ రోడ్లు నిర్మాణం. కేంద్రం ఇచ్చిన నిధులతో ప్రధానంగా గ్రామీణ రవాణా మెరుగైన పరిస్థితి.విద్యావిధానం సర్వశిక్షా అభియాన్ పథకం ద్వారా మెరుగైన విద్య. చక్కటి నవతరానికి ఆలోచన ఆనాడు వాజపేయి నాంది పలికారు.

పొక్రాన్ అణు పరీక్షలు తో శక్తి వంతమైన భారత్. యావత్ ప్రపంచం శక్తి వంతమైన భారత్ గా గుర్తింపు. వాజపేయి ఆలోచనలు…2047 అభివృద్ధి చెందిన దేశంగా చూడాలి. టెలికాం ఫలితాలు ఇప్పుడు మనం చూస్తున్నాం.బిజెపి వాజపేయి విశ్వసించి న ఆలోచనలు నరేంద్ర మోడీ కొనసాగిస్తున్నారు.వాజపేయి వారసులు నరేంద్ర మోడీ. ఓబీసీ కమిషన్ కు చట్ట బద్దతత కల్పించారు.

విశాఖపట్నం లో జనవరి 7వ తేదీ న ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆలిండియా బిసీ వెల్ఫేర్ డెవలప్మెంట్ బోర్డు జాతీయ ప్రధాన కార్యదర్శి కె. సుబ్బారాయుడు తో సహా పలువురు నేతలు బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి సమక్షంలో బిజెపి తీర్థం తీసుకున్నారు

ఒబిసి మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి డా నిఖిల్ ఆనంద్, ఒబిసి మోర్చా జాతీయ కార్యదర్శి డా. పార్థ సారథి , ఆంధ్రప్రదేశ్ బిజెపి ఒబిసి మోర్చా రాష్ట్ర అధ్యక్షులు , రొంగల గోపి శ్రీనివాస్, ఓబీసీ మోర్చారాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవులు నాగేంద్ర, ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోయ మురళి, ఓబీసీ మోర్చా రాష్ట్ర సెక్రెటరీ అయినం బాలకృష్ణ, ఓబీసీ మోర్చా రాష్ట్ర కోశాధికారి బి శివకుమార్ పట్నాయక్, ఓబీసీ మోర్చా రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ అన్నం శ్రీనివాసరావు, ఓబీసీ మోర్చా రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ కొరగంటి సతీష్, విశ్వకర్మ కౌసల్య యోజన కన్వీనర్ కర్రీ రాఘవ, పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు

LEAVE A RESPONSE