Suryaa.co.in

Political News

ఇదో అవ్యవస్థ!

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని నిర్దేశించి ప్రకటించింది ఎవరు ?
జవాబు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యవస్థ
ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి భూములు ఇవ్వమని అడిగింది ఎవరు?
జవాబు: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ వ్యవస్థ
రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు మూడేళ్లలో న్యాయం చేస్తామని వాగ్దానం చేసింది ఎవరు?
జవాబు: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ వ్యవస్థ.
అమరావతి రాజధానికి పనికిరాదు అని జి ఎన్ రావు కమిటీ ద్వారా ప్రకటించింది ఎవరు?
జవాబు: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ వ్యవస్థ.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులు అవసరం అని బిల్లును శాసనసభలో శాసనం చేసింది ఎవరు?
జవాబు: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ వ్యవస్థ.
మూడు రాజధానులు నిర్మించడం కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించింది ఎవరు?
జవాబు: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ వ్యవస్థ
మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకున్నది ఎవరు??
జవాబు: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ వ్యవస్థ
రాజధాని ప్రాంతాన్ని సిఆర్డిఏ గా చట్టం చేసింది ఎవరు??
జవాబు: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ వ్యవస్థ.
సి ఆర్ డి ఏ ను రద్దు చేసింది ఎవరు??
జవాబు: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ వ్యవస్థ
సి ఆర్ డి ఏ ను ఏఎంఆర్డిఏ గా మార్చింది ఎవరు??
జవాబు: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ వ్యవస్థ
ఏఎమ్ఆర్డిఏను రద్దు చేసింది ఎవరు?
జవాబు: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ వ్యవస్థ.
భూములు ఇచ్చిన రైతులకు ఇవ్వాల్సిన కవులును ఇవ్వకూడదని న్యాయస్థానంలో వాదించింది ఎవరు??
జవాబు: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ వ్యవస్థ
భూములు ఇచ్చిన రైతుల కుటుంబాలలోని న్యాయం అడిగిన మహిళలను గొడ్డును బాదినట్టు బాది హింసించింది ఎవరు??
జవాబు: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ వ్యవస్థ
న్యాయం కోసం రైతులు చేసిన న్యాయపోరాటాన్ని న్యాయవాదులను పెట్టి వ్యతిరేకంగా వాదించింది ఎవరు??
జవాబు: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ వ్యవస్థ…
రాజధాని నిర్మాణానికి భూముల అవసరం లేదని రైతులకు వెనక్కి ఇచ్చి ఆర్డర్లు చేసింది ఎవరు?
జవాబు: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ వ్యవస్థ
ఆంధ్రప్రదేశ్ రాజధానిని విశాఖకు తరలిస్తున్నామని ప్రకటించి ఆర్డర్లు ఇచ్చింది ఎవరు???
జవాబు: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ వ్యవస్థ
మళ్లీ రాజధానికి భూములు ఇవ్వమని అడుగుతున్నది ఎవరు???
జవాబు::మళ్లీ అదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యవస్థ..

ప్రతి అంశం మీద ప్రభుత్వం వ్యవస్థ సంతకం కూడా ఉంది…
కోతులు చేసే సర్కస్ లో కూడా ఈ ఇలాంటివి చూడలేము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన రాజకీయ నాయకులు, అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్న సర్కస్ కి జనం ఎందుకు బాధను అనుభవించాలి అని ప్రశ్నిస్తే?
ఇలాంటి వ్యవస్థను చూసి జాలి పడటం తప్ప చేయగలిగింది ఏమీ లేదు.

– వెలగపూడి గోపాలకృష్ణ

LEAVE A RESPONSE