గ్రామ పంచాయితీల అభివృద్ధిని అడ్డుకుంటున్న ప్రభుత్వం

గత రెండు సంవత్సరాలుగా గ్రామ పంచాయితీ లలో నిర్మాణాలు జరగటం లేదు. LRS లేని ప్లాట్లకు పర్మిషన్ ఇయ్యము అనే తుగ్లక్ నిర్ణయం వలన , గ్రామ పంచాయితీ ల అభివృద్ధి కుంటు పడింది, అదే మున్సిపాలిటీల్లో మార్కెట్ విలువలో 14% LRS ఛార్జీలు తీసుకొని ఇండ్ల నిర్మాణానికి అనుమతి ఇస్తున్నారు, గ్రామ పంచాయితీ లలో పర్మిషన్ లేని కారణంగా, కొన్ని గ్రామ పంచాయితీ లలో అక్రమ నిర్మాణాలు కూడా జరుగుతున్నాయి. గ్రామ పంచాయితీ అధికారు లు , నాయకుల చేతులు తడపాల్సి వస్తుంది.

నిర్మాణ అనుమతుల లేక పోవడం వలన, గ్రామ పంచాయితీ లకు ఆదాయం కూడా రావడం లేదు అధికారులు ఈ విషయము ప్రభుత్వ దృష్టికి తీసుక పోకపోవడం.. తీసుక పోయినా పట్టించు కునే వారు లేక పోవడం ఒక కారణంగా చెప్పవచ్చు,
ప్రభుత్వం లో ఉన్న ప్రముఖ నాయకులకు , కొన్ని కార్పొరేట్ రియల్ ఎస్టేట్ సంస్థలలో బాగస్వామ్యం ఉండటం వలన, వాటి బిజినెస్ పెరగాలంటే గ్రామ పంచాయితీ ప్లాట్ల కు పర్మిషన్ ఇవ్వకుండా అడ్డు కుంటే సరిపోతుంది.. అనే కుట్ర స్వలాభం కోసం , ప్రభుత్వం లో ఉన్న ప్రముఖ నాయకుల దుష్ట పన్నాగానికి పరాకాష్ట.

ప్రభుత్వం ఇప్పటికైనా కండ్లు తెరిచి పర్మిషన్ లు ఇచ్చేలా ఆదేశాలు జారీ చేసి, గ్రామ పంచాయితీ ల అభివృద్ధికి కృషి చేయాలని తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ డిమాండ్ చేస్తుంది. దీని వలన రియల్ ఎస్టేట్ వ్యాపారం అభివృద్ధి చెంది, ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. చిన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఉపాధి దొరుకుతుంది

నారగొని ప్రవీణ్ కుమార్
– తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్.
ప్రెసిడెంట్ 98490 40195

Leave a Reply