విద్యార్ధులపై కోట్లు ఖర్చు పెడుతున్న‌ ప్రభుత్వం ఇది

-మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌

విశాఖ‌: ఎన్ని విమర్శలు వచ్చినా, నమ్మిన సిద్దాంతం కోసం విద్యార్ధులపై మా ప్ర‌భుత్వం కోట్లు ఖర్చు పెడుతుంద‌ని మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ తెలిపారు. దివంగత సీఎం వైయ‌స్‌ రాజశేఖర్‌రెడ్డి గారి ఆశయం మేరకు ఆయన తనయుడు శ్రీ వైయ‌స్‌ జగన్‌ ఈ కార్యక్రమాన్ని చేస్తున్నార‌ని పేర్కొన్నారు. గ్రాడ్యుయేట్లకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు దిగ్గజ మైక్రోసాఫ్ట్‌ సంస్ధ శిక్షణ ఇచ్చిన విద్యార్ధులకు ధృవపత్రాలను అందించే కార్య‌క్ర‌మంలో మంత్రి మాట్లాడారు.

ఇదొక అద్భుతమైన కార్యక్రమం, మైక్రోసాఫ్ట్‌ శిక్షణ ద్వారా యువత అందరికీ కూడా ఉద్యోగావకాశాలు కల్పించడం ఈ ప్రభుత్వం తీసుకున్న అద్భుతమైన నిర్ణయం, దీనిపై మైక్రోసాఫ్ట్‌ అధికారులతో మాట్లాడాను, వారు ఒక మాట చెప్పారు, ఇంతమందికి ప్రపంచంలోనే ఒకేసారి పరీక్ష నిర్వహించి పాసవ్వడం అనేది చరిత్ర, ఇది ఏపీలో జరిగిందన్నారు. మన దేశంలో ఒక్క ఏపీలో మాత్రమే ఈ కార్యక్రమం జరుగుతుంది. కోవిడ్‌ వల్ల ప్రపంచం అంతా అతలాకుతలమవుతున్న సమయంలో మన విద్యార్ధులకు ఉద్యోగావకాశాలు కల్పించాలని దీర్ఘకాల ప్రణాళికతో ఈ కార్యక్రమం చేపట్టింది. దీనికి సుమారు రూ. 450 కోట్లు ఖర్చు అవుతుంది, కానీ ప్రభుత్వం విద్యార్ధులపై భారం వేయకుండా వారు చెల్లించాల్సిన ప్రతీ రూపాయి కూడా ప్రభుత్వ ఖజానా నుంచే చెల్లించాం, గత ఏడాది అక్టోబర్‌లో ప్రారంభించాం, 1,60,000 మందికి శిక్షణనిచ్చి, పరీక్ష జరిపి ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్‌లు ఇవ్వడం ద్వారా రాబోయే రోజుల్లో మీ కాళ్ళ మీద మీరు నిలబడేలా ప్రభుత్వం ఆసరగా ఉంటుంది. విద్యారంగంలో చాలా మార్పులు తీసుకొస్తుంది ఈ ప్రభుత్వం, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ పై దృష్టి పెట్టాం, సీఎంగారికి ఒకటే తపన, ఏపీలో చదువుకున్న విద్యార్ధి గ్లోబల్‌ కాంపిటీషన్‌ తట్టుకుని నిలబడేలా విద్యా విధానంలో మార్పులు తీసుకొచ్చారు. ఎన్ని విమర్శలు వచ్చినా, నమ్మిన సిద్దాంతం కోసం విద్యార్ధులపై కోట్లు ఖర్చు పెడుతుంది ఈ ప్రభుత్వం, దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి గారి ఆశయం మేరకు ఆయన తనయుడు శ్రీ జగన్‌ ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవడం నా అదృష్టంగా భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను.

మైక్రోసాఫ్ట్‌ శిక్షణ పొందిన విద్యార్ధులు
సార్, నేను ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ విద్యార్ధిని, అయితే ఈ రోజుల్లో సాఫ్ట్‌వేర్‌ స్కిల్స్‌ కూడా ఎంతో ముఖ్యం, సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీలో స్కిల్స్‌ పెంచుకోవడం అనేది ప్రతి విద్యార్ధికి అవసరం, సాంప్రదాయ చదువులతో పాటు నైపుణ్యతతో కూడిన విద్య ద్వారానే విద్యార్ధులు రాణించగలుగుతున్నారు. ఏపీ ప్రభుత్వం మైక్రొసాఫ్ట్‌ సర్టిఫికేషన్‌ శిక్షణ ఉచితంగా విద్యార్ధులకు అందజేసింది, మాములుగా అయితే రూ. 10, 15 వేలు ఖర్చు అవుతుంది, కానీ మేం ఉచితంగా చదువుకున్నాం, ఈ కోర్సు వల్ల మేం చాలా నేర్చుకున్నాం, ధ్యాంక్యూ సార్, విద్యార్ధుల భవిష్యత్‌ గురించి మీరు చక్కటి ప్రణాళికతో అడుగులు వేస్తున్నారు, ధన్యవాదాలు, మీరు జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన కార్యక్రమాలతో విద్యార్ధులకు చాలా సాయం చేస్తున్నారు, నేను కూడా లబ్ధిపొందాను, విద్యార్ధులకు ఆర్ధిక భారం లేకుండా మీరు సాయం చేస్తున్నారు, నాడు నేడు, అమ్మ ఒడి ద్వారా అనేకమంది లబ్ధి పొందుతున్నారు, విద్యార్ధుల కోసం అనేక పధకాలు తీసుకొస్తున్నారు, యూనివర్శిటీలలో ఇన్నొవేషన్‌ హబ్‌లు ఏర్పాటుచేయడం ద్వారా విద్యార్ధుల కెరీర్‌ చాలా బావుంటుంది, మా కుటుంబ సభ్యుడిలా మా వెన్నంటి నడుస్తున్న మీకు ధన్యవాదాలు, మీ విజనరీకి కృతజ్ఞతలు, ధ్యాంక్యూ సార్‌.

విద్యార్ధిని
సార్, మీరు సమాజం బావుండాలంటే మెరుగైన విద్య ప్రతీ ఒక్కరికీ అవసరమని గుర్తించి ఆ విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఈ శిక్షణ ద్వారా ప్రపంచస్ధాయిలో విద్యార్ధులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించే అవకాశం వస్తుంది, ఇది ప్రతీ విద్యార్ధికి చక్కటి అవకాశం, నేను సైన్స్‌ స్టూడెంట్‌ను, మా విద్యార్ధుల కోసం సీఎంగారు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు, పుస్తకాలలో విజ్ఞానం కంటే నైపుణ్యతతో కూడిన శిక్షణ ద్వారా గ్లోబల్‌ అవకాశాలు మెరుగుపరుచుకోగలమని మేం భావిస్తున్నాం, ఇందుకు అవసరమైన పూర్తి సహకారాన్ని ప్రభుత్వం ఇస్తుంది, మా విద్యార్ధిలోకమంతా మీ వెంటే ఉంటుంది. ధ్యాంక్యూ సార్‌.

Leave a Reply