Suryaa.co.in

Andhra Pradesh

ఇది ప్రజలు కోరుకున్న ప్రభుత్వం.. మంచి ప్రభుత్వం

-మంత్రి కొల్లు రవీంద్ర

పోలాటితిప్ప/పల్లె తుమ్మలపాలెం/కోన: ఇది ప్రజలు కోరుకున్న మంచి ప్రభుత్వమని, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి వారి సంక్షేమాభివృద్ధికి కృషి చేస్తామని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.

సోమవారం మధ్యాహ్నం మంత్రి మచిలీపట్నం మండలంలోని పొలాటితిప్ప, పల్లెతుమ్మలపాలెం, కోన గ్రామాలలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. వంద రోజుల్లో కూటమి ప్రభుత్వం అమలు చేసిన వివిధ సంక్షేమ అభివృద్ధి పథకాలు ప్రజలకు మంత్రి వివరించి వారికున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో ఆయన గ్రామాలలోని పలు సీసీ రహదారుల నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు.

ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో ఏర్పాటుచేసిన సభల్లో మంత్రి మాట్లాడుతూ కూటమి పార్టీకి 175 స్థానాలకు గానూ 164 ఎంఎల్ఏ సీట్లు ఇచ్చి గొప్ప విజయాన్ని అందించారని, అందుకు ప్రజల అంచనాలకు అనుగుణంగా సుపరిపాలన అందిస్తామన్నారు.

కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 100 రోజులలో అమలు చేసిన పథకాలు వివరించడంతో పాటు ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు.

LEAVE A RESPONSE