గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు తెనాలి శ్రావణ్ కుమార్
అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలు బాల వీరంజనేయులు, గోరంట్ల బుచ్చయ్య మీద వైసీపీ నేతలు దాడులు చేయడం విషపరిణామం.రౌడీలను అసెంబ్లీకి పంపిస్తే ఇలాగే ఉంటుంది.జగన్ మోహన్ రెడ్డి వైఫల్యం వలనే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయ్యారు.వైసీపీ కబ్జా కోరు రాజకీయాలకు,హత్యా రాజకీయాలను ఉత్తరాంద్ర ,పశ్చిమ,తూర్పు రాయలసీమ ప్రజలు పూర్తిగా గమనించి తగిన గుణపాఠం చెప్పారు.
పశ్చిమ, తూర్పు, రాయలసీమ లలో ,ఉత్తరాంద్ర లలో పట్టభద్రుల ఆలోచన మారి వైసీపీ పార్టీకి ఓట్ల రూపంలో తగిన బుద్ధి చెప్పారు.ముఖ్యమంత్రి పోలవరం ప్రాజెక్టును,అమరావతి రాజధాని పూర్తిగా ఆపివేసి తన చేతగాని తనంతో ప్రజలను మభ్యపెట్టి పాలన సాగిస్తున్నారని దుయ్యబట్టారు.యావత్ ఆంధ్రప్రదేస్ ప్రజల దృష్టి మరల్చి దొడ్డిదారిన పాలన సాగుతోందనటానికి అసెంబ్లీ సమావేశాలలో టీడీపీ ప్రతిపక్ష ఎమ్మెల్యేలు పై దాడి చేయడం సిగ్గుచేటు.స్పీకర్ సమక్షంలోనే దాడులు జరుగుతున్న కళ్ళుండి చూడలేని ధృతరాష్ట్ర పాలన సాగుతోందని దుయ్యబట్టారు. ఇప్పుడు కూడా దళిత ఎమ్మెల్యేలపై వైసీపీ నాయకులు అసెంబ్లీలో దాడులుచేస్తున్నారంటే ఏoతటి దిగజారుతున్నారో అర్ధం అవుతుంది.
పశ్చిమ, తూర్పు రాయలసీమ లో ప్రజలు ముఖ్యమంత్రికి గుండు చేసినంత పని చేసినా ఇంకా ఏం పీకుతారని అనడం విడ్డురంగా ఉంది.రాబోయే రోజుల్లో వైసీపీ175సీట్లు కాదు వచ్చేది 1సీటా,15సీట్లో తేల్చేపనిలో ప్రజలు సిద్ధంగా ఉన్నారని వైసీపీ అధినేత జగన్మోహన్ వారి పరివారం రాష్ట్రం నుంచి పారిపోవడానికి సిద్ధంగా ఉన్నారని ఎద్దేవా చేశారు.అసెంబ్లీలో అడుగు పెట్టేముందు వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలకు కూడా బ్రీత్ యనలైజర్ టెస్ట్ లు చేసి పంపాలనివీళ్ళందరూ కూడా తాగి దేవాలయం లాంటి అసెంబ్లీలోకి వస్తున్నారేమో అని అనుమానంగా ఉంది.అందుకే ప్రతిపక్ష నాయకులను సైతం అసెంబ్లీలో కొట్టడం చేస్తున్నారు.