ఇద్దరు వ్యక్తులు చేసిన ఘోరమైన తప్పులవలన లక్షలాది స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలకి అర్థం లేకుండా పోయింది. 1947లో స్వాతంత్ర్యానంతరం దేశాన్ని గాంధీజీ తనకు తానే తన చేతుల్లోకి తీసుకోవడం, ఆ తర్వాత ఆయన బ్రిటిష్ భక్తుడైన నెహ్రూ కి అప్పగించటం, వాటి ఫలితం దేశ సర్వనాశనం. బ్రిటిష్ విద్యా విధానం అనుసరించటం వలన విద్యా రంగం నాశనం అయ్యింది.
వేల సంవత్సరాల మహోన్నతమైన దేశ చరిత్రని వక్రీకరించి పాఠ్య పుస్తకాల ద్వారా భావిభారత పౌరులైన విద్యార్థులకు అందించి వాళ్లకి ఈ దేశం అంటే ఏమిటో తెలియని పరిస్థితి కల్పించటానికి కమ్యూనిస్టులకు అవకాశం ఇచ్చిన ఫలితం. ఎక్కడి నుండో వచ్చి ఈ దేశంపై దాడి చేసి దోచుకున్న మొఘలులు , బ్రిటిష్ వాళ్ళు దేశభక్తులు.
వాళ్లని వ్యతిరేకించిన రాణా ప్రతాప్ సింగ్, ఛత్రపతి శివాజీ, రాణి ఝాన్సీ లక్ష్మీబాయి, నేతాజీ, సర్దార్ భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్, చంద్రశేఖర్ ఆజాద్, వీర్ సావర్కర్ వంటి మహనీయుల్ని తీవ్రవాదులుగా చిత్రీకరించారు. ఫలితంగా ఈ దేశ చరిత్ర తెలియని విద్యార్థులు బూటకపు సెక్యులరిజాన్ని అర్థం చేసుకోలేక వాళ్లకి తెలియకుండానే దేశ వినాశనానికి కారణం అవుతున్నారు. ఈ దేశ వ్యతిరేక కుట్రదారుల స్వప్నం చాలా వరకు ఫలించింది. ఈ 75 సంవత్సరాలలో సర్వ నాశనం అయిన ఈ వ్యవస్థల్ని మోడీ ప్రభుత్వం సరి చేస్తుంది అని ఆశిద్దాం.
(ఈ వ్యాసంలో పేర్కొన్న అంశాలన్నీ రచయిత వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే)
– పెంజర్ల మహేందర్ రెడ్డి
ఓసి సంఘం జాతీయ అధ్యక్షుడు