Suryaa.co.in

Andhra Pradesh

డ్వాక్రా మహిళలను బెదిరింపులు, ప్రలోభాలు

– వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలి
– ఈసీకి ఫిర్యాదు చేసిన ఆచంట సునీత

డ్వాక్రా మహిళలను బెదిరింపులు, ప్రలోభాలకు గురి చేస్తున్న వైసీపీ నేతలపై చర్యలు కోరుతూ తెలుగు నాడు అంగన్వాడీ, డ్వాక్రా సాధికార కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత, టీడీపీ మహిళా నేతలు శనివారం నాడు ఈసీకి పిర్యాదు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ…..వైసీపీ నేతలు యదేచ్చగా ఎన్నికల నిభంధనలు ఉల్లంఘిస్తూ అధికార పార్టీకి అనుకూలంగా పనిచేయాలని డ్వాక్రా మహిళలను బెదిరింపులు, ప్రలోభాలకు గురి చేస్తున్నారు.

సీఎం జగన్ సిద్దం సభలకు తప్పనిసరిగా హాజరవ్వాలంటూ లేనిపక్షంలో రుణాలు నిలిపేస్తామని వాట్పాప్ గ్రూపుల్లో వాయిస్ మెసేజ్ లు పంపిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఏలూరు జిల్లా దెందులూరులో 25.03.2024 న నిర్వహించిన సిద్దం సభకు జిల్లాలోని ప్రతి నియోజకవర్గం నుంచి 50 నుంచి 100 బస్సుల్లో డ్వాక్రా మహిళలను తీసుకొచ్చారు. సభకు రాకపోతే రుణాలు, సంక్షేమ పధకాల విషయంలో ఇబ్బందులు పడతారని వైసీపీ నేతలు, రిసోర్స్ పర్సన్లు బెదిరించారు. గ్రూపుల వివరాలు, సభ్యుల పేర్లతో ఉన్న రిజిష్టర్లు తీసుకొచ్చి సభా ప్రాంగణం దగ్గర హాజరు వేశారు.

సీఎం జగన్మోహరెడ్డి సిద్దం సభలు నిర్వహిస్తున్న ప్రతి చోట ఇదే తంతు జరుగుతోంది. మరో వైపు వైసీపీ తరపున ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్దులు..ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేయాలని డ్వాక్రా మహిళలకు తాయిళాలు పంచుతూ రకరకాల ప్రలోభాలకు గురి చేస్తున్నారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. దీనిపై ఎన్నికల సంఘం తక్షణమే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. ప్రలోభాలకు గురి చేస్తున్న వైసీపీ అభ్యర్దులను అనర్హులుగా ప్రకటించాలని ఆచంట సునీత అన్నారు. ఈసీని కలిసిన వారిలో టీడీపీ మహిళా నేతలు పాలడుగు వినీల, బొప్పన నీరజ తదితరులు ఉన్నారు.

LEAVE A RESPONSE