Suryaa.co.in

Political News

అలసిపోతున్న మోదీకి మరింత శక్తి అవసరం

భారత ప్రధాని మొహంలో అలసట కనిపిస్తోంది….
కాశీ కారిడార్ ప్రారంభోత్సవం సందర్భంగా ఇలాగే అనిపించింది.మునుపటి వడి నడకలో కనిపించలేదు.
అంతచలిలో అంత పొద్దున గంగాస్నానం, విరామంలేని నడక వల్లనేమో అనుకున్న.
కానీ నిజంగానే ఆయన శక్తి క్రమంగా తగ్గుతోంది.
70 ఏళ్ల పైబడిన వయసుతో పాటు ఆయనమీద ఉన్న అనేక ఒత్తిళ్లూ కారణంకావచ్చు.
కాస్త రిలాక్సవడానికి తనకంటూ కుటుంబం కూడా లేదు.
విరామమెరుగక పరిశ్రమిస్తున్న ధీరుడాయన.
దేశం లోపలి విచ్ఛిన్నశక్తుల వల్ల…
ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత అన్నట్టుంది పరిస్థితి.
తనపనితనను చేసుకోనీయకుండా తుక్డేలు చికాకుపెడుతున్నారు.
చుట్టూ దుష్టశక్తులు పేట్రేగిపోతున్న ఈ సమయంలోనే ఆయనకు మరింత శక్తి కావాలి.
ఆ శక్తిసామర్ధ్యాలను భగవంతుడు మోదీకి ప్రసాదించాలని కోరుకుందాం.
కులమతాలు, సొంత ప్రయోజనాలు, రాజకీయాలు పక్కనపెట్టి దేశంకోసం ఆయన వెంట నడుద్దాం.

– పెంజర్ల మహేందర్ రెడ్డి
ఓసి సంఘం జాతీయ అధ్యక్షుడు

LEAVE A RESPONSE