Suryaa.co.in

Andhra Pradesh

యథేచ్ఛగా గ్రావెల్ మట్టి అక్రమ రవాణా

స్పందించని మండల రెవెన్యూ అధికారులు
అతివేగంగా తరలిస్తున్న గ్రావెల్ మట్టి
ట్రాఫిక్కు అంతరాయం కలిగిస్తున్న మట్టి ట్రాక్టర్లు
అడ్డుకున్న, ప్రశ్నించిన వారిపై దాడులకు దిగుతున్న మట్టి మాఫియా

మహానంది మండల పరిధిలోని బసాపురం గ్రామం తెలుగు గంగా సమీపంలోని పొలాల నుండి జెసిబితో అక్రమంగా గ్రావెల్ మట్టిని తవ్వి ట్రాక్టర్ల ద్వారా గత మూడు రోజులుగా అతివేగంగా తరలిస్తున్నారు.దాని వల్ల ప్రభుత్వ ఆదాయానికి లక్షల రూపాయల మేర గండి ఏర్పడుతుంది.ఇక్కడ అడ్డుకోవడానికి మీకు పర్మిషన్ ఎవరు ఇచ్చారు అని రైతులు, గ్రామస్తులు ప్రశ్నించగా మండల రెవెన్యూ అధికారులు మరియు పోలీసులు అడగడం లేదు. మీరు ఎవరు అడగడానికి ,ఆపడానికి అని దుర్భాషలాడుతు అక్రమంగా మట్టి తరలిస్తున్నారని తెలిపారు.

ఏ విధమైన అనుమతులు లేకుండానే అక్రమ గ్రావెల్‌ మట్టి రవాణాతో ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు.ప్రభుత్వానికి సంబంధించిన ఆదాయ వనరయినప్పటికీ యథేచ్ఛగా మట్టి మాఫియా జెసిబి మిషన్ల ద్వారా తవ్వుకుంటున్నారు. ఇరిగేషన్‌ ప్రదేశాలలో కానీ రెవెన్యూ ప్రదేశాలలో మట్టిని తరలించేందుకు రెవెన్యూ శాఖకు తగిన చలానా రుసుము చెల్లించాల్సి ఉన్నా అటువంటి పరిస్థితి మండలంలో లేదు.దాని వల్ల ప్రభుత్వ ఆదాయానికి లక్షల రూపాయల మేర గండి ఏర్పడుతుంది.

ఇక్కడ అడ్డుకోవడానికి మీకు పర్మిషన్ ఎవరు ఇచ్చారు అని రైతులు, గ్రామస్తులు ప్రశ్నించగా మండల రెవెన్యూ అధికారులు మరియు పోలీసులు అడగడం లేదు మీరు ఎవరు అడగడానికి ,ఆపడానికి అని దుర్భాషలాడుతు అక్రమంగా మట్టి తరలిస్తున్నారని, ప్రజలు తెలిపారు.ఏ విధమైన అనుమతులు లేకుండానే అక్రమ గ్రావెల్‌ మట్టి రవాణాతో ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు.

కొంత మంది అక్రమార్కులు మాత్రం ప్రభుత్వ భూముల్లో జెసిబి మిషన్‌ ద్వారా గ్రావెల్‌ తవ్వుకుంటూ పబ్బం గడుపుతున్నారు. మహానంది మండల పరిధిలోని బసాపురం గ్రామం నుంచి జోరుగా అక్రమ మట్టి తవ్వకాలు జరిపి ట్రాక్టర్ల ద్వారా రవాణా జరుగుతూనే ఉంది.మట్టి తవ్వకాలు జరిపే సమీప గ్రామస్తులకు కొంతమేర నగదును చెల్లించి మట్టి తవ్వకాలు జరుపుతున్నట్లు సమాచారం.

అందువల్ల భారీగా ప్రభుత్వ ఆదాయానికి నష్టం వాటిల్లుతుందని పలువురు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత రెవెన్యూ ఇరిగేషన్‌ అధికారులు స్పందించి అక్రమ తవ్వకాలను నిలుపుదల చేసి ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలిగించే వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

 

LEAVE A RESPONSE