మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి
ను పూర్తిగా రద్దు చేయాలని బీజేపీ నేత, మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి డిమాండ్ చేశారు. బీజేపీ టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశంలో పాల్గొన్న మాజీ ఐఏఎస్ చంద్రవదన్, మాజీ ఐపిఎస్ కృష్ణప్రసాద్, బీజేపీ నేత విఠల్ తదితరులు.. పబ్లిక్ సర్వీస్ కమిషన్ దర్యాప్తు పురోగతిపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి ఏమన్నారంటే..
బీ అర్ ఎస్ 30 లక్షల మంది నిరుద్యోగులకు ఏ విధమైన భరోసా కల్పిస్తున్నారు.కేటీఆర్ కనిరుద్యోగులపై చిత్తశుద్ధి ఉంటే సిట్టింగ్ జడ్జి తో విచారణ జరిపించాలి.రాజశేఖర్ రెడ్డి ఔట్ సోర్సింగ్ లో పని చేస్తున్నారు. ఇతనికి బీజేపి తో సంబంధాలు ఉన్నాయని కేటీఆర్ అరోపణలు చేశారు. అసలు ఇతనికి ఉద్యోగం ఎలా వచ్చింది? ఎంత కాలంగా పబ్లిక్ సర్వీస్ కమీషన్ లో పని చేస్తున్నారు? ఒక పార్టీతో సంబంధం ఉన్న వ్యక్తిని ప్రభుత్వ సర్వీసులోకి ఎలా తీసుకుంటారు?
టీఎస్‌పీఎస్సీ కి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది చాలా ఇంపార్టెంట్. ఐటీ మినిస్టర్ కేటీఆర్ పై మాకు చాలా అనుమానాలు ఉన్నాయి… అందుకే ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం.క్యాలెండర్, పద్ధతి, పారదర్శకత లేకుండా ఉద్యోగాల భర్తీ . టీఎస్‌పీఎస్సీ బోర్డ్ ను పూర్తిగా రద్దు చేయాలి. మాజీ ఐఏఎస్ చంద్రవదన్ ఏమన్నారంటే… టీఎస్‌పీఎస్సీ ఛైర్మెన్ , సభ్యులకు సమన్వయం లేదు.పరీక్షల నిర్వహణలో ఛైర్మెన్ పూర్తిగా విఫలం.సేఫ్ గర్డ్ తీసుకోకుండా ఆయన ఎంపిక జరిగింది. గత పరీక్షల పేపర్స్ వాల్యుయేషన్ పై మాకు అనుమానాలు ఉన్నాయి.ప్రభుత్వం మాట వినని వారిని టీఎస్‌పీఎస్సీ సెక్రెటరీ గా నియమిస్తున్నారు. చైర్మన్ తో పాటు సిబ్బంది మొత్తాన్ని మార్చాలని .. నిరుద్యోగులు మా దృష్టికి తెచ్చారు.
మాజీ ఐపీఎస్ కృష్ణ ప్రసాద్ ఏమన్నారంటే.. తెలంగాణలో యువతకు జరుగుతున్న అన్యాయంపై రాష్ట్రపతి, గవర్నర్ కు నివేదిక ఇవ్వాలని బీజేపీ టాస్క్ ఫోర్స్ టీం నిర్ణహించింది.తెలంగాణ నిరుద్యోగ యువత టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజి పై అనేక సమస్యలు మా దృష్టికి తెచ్చింది.టీఎస్‌పీఎస్సీ
పై నిరుద్యోగ యువతకు నమ్మక్కం లేదు. బోర్డ్ ను రద్దు చేసి కొత్త బోర్డ్ ఏర్పాటు చేయాలి.
తెలంగాణ యువత సిట్ ను కంటి తుడుపు చర్యగా భావిస్తున్నారు.గతంలో టీఎస్‌పీఎస్సీ కండక్ట్ చేసిన 16 పేపర్లును కూడా లీక్ చేసినట్లు యువత అనుమానిస్తోంది.నకిలీ బర్త్ సర్టిఫికెట్స్ జారీ ఐటీ అప్లికేషన్ ఫెయిల్యూర్ వల్లే … సర్టిఫికెట్స్ జారీ జరిగిందని ghmc విజిలెన్స్ అధికారులే గుర్తించారు. ప్రతి లీకేజి లో ఐటీ ఫెయిలుర్ ఉంది. బీజేపి డిమాండ్ చేస్తున్న లక్ష రూపాయల నష్ట పరిహారం సరిపోదు. నిరుద్యోగులకు 4లక్షల నష్ట పరిహారం ఇవ్వాలని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు మా దృష్టికి తెచ్చారు.గ్రూప్ 1 పరీక్ష నిర్వహణ ను upsc కి ఇవ్వాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. పేపర్ లీక్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకునేలా ఆక్ట్ తేవాలని కోరుతున్నారు.
బీజేపి అధికార ప్రతినిధి విఠల్ ఏమన్నారంటే.. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజి లో నష్టపోయిన విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యేందుకు బీజేపీ ఒక వాట్సప్ నంబర్ 8688821794 అందుబాటులోకి తెచ్చింది.33 లక్షల మంది నిరుద్యోగులు టీఎస్‌పీఎస్సీ otr లో రిజిస్టర్ అయ్యి ఉన్నారు.పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఇష్యూ ను డైవర్ట్ చేసేందుకు మా అధ్యక్షుడి అరెస్ట్.సంజయ్ అరెస్ట్ తో ప్రభుత్వం అభాసుపాలైంది. నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు బీజేపీ వారికి అండగా ఉంటుంది. కరుణ గోపాల్ ఏమన్నారంటే..పబ్లిక్ సర్వీస్ కమీషన్ పేరును పబ్లిక్ డిస్ సర్వీస్ కమీషన్ గా మార్చాలి. పేపర్ లికేజితో 30 లక్షల మంది తెలంగాణ యువత భవిష్యత్తు, లీక్ , బ్లాక్, డార్క్ గా మిగిలింది.