Suryaa.co.in

Andhra Pradesh

టీటీడీ ఈవో ధర్మారెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిపై సీబీఐ విచారణ జరగాలి

– హైకోర్టు జడ్జికి రూ.2కోట్ల విలువైన వజ్రాలు పొదిగిన వాచ్ ఇవ్వజూపిన వ్యవహారం
– జగన్ రెడ్డి తన కేసుల నుంచి బయటపడేందుకు వీరిద్దరి ద్వారా జడ్జిని ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించారు
– ఈ వ్యవహారంలో జగన్ రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలి
– గాలి జనార్థన్ రెడ్డి బాటలోనే జగన్ రెడ్డి పయనిస్తున్నారు
– టీటీడీ ఈవో ధర్మారెడ్డి కింగ్ ఆఫ్ లాబీయింగ్, పైరవీ సామ్రాట్
– పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య

జగన్ రెడ్డి పలు కేసుల్లో ముద్దాయి. కాలం, కర్మం సరిగా కలిసిరాకపోతే, విచారణ సరిగా సాగితే యావజ్జీవ శిక్ష పడుతుంది. ఆయన కేసుల నుంచి బయటపడేందుకు ఎక్కని గడప లేదు, మొక్కని దేవుడు లేడు. నానా గడ్డి తినైనా ఈ కేసుల నుంచి బయటపడాలని ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగానే 2021 ఏడాది కరోనా సమయంలో ఏపీ హైకోర్టు జడ్జికి ఇద్దరు పెద్ద మనుషులు టీటీడీ ఈవో ధర్మారెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఓ గిఫ్ట్ ఇవ్వబోయారు. వజ్రాలు పొదిగిన బంగారు వాచ్ అది. రూ.2 కోట్లపైనే దాని విలువ ఉంటుంది.

ఢిల్లీలో పిలవని పేరంటానికి వెళ్లి ఆయనకు బంగారు వాచ్ ఇవ్వబోయారు. ఆయన నిజాయతీపరుడు కాబట్టి జగన్ రెడ్డి తరపున లంచం ఇవ్వబోయిన ఆ ఇద్దరిపై మండిపడ్డారు. లంచం ఇవ్వజూపిన ఇద్దరిపై సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేశారు. 2021లో జరిగింది ఇప్పుడు బయటకు వచ్చింది. దీనిపై జగన్ రెడ్డి సమాధానం ఇవ్వాలి. సుప్రీంకోర్టు కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. సీబీఐతో సుప్రీంకోర్టు విచారణ జరిపించాలి కదా?

గతంలో గాలి జనార్థన్ రెడ్డి కూడా బెయిల్ పై బయటకు రావడానికి జడ్జికి రూ.100 కోట్ల లంచం ఇవ్వడానికి ఒప్పందం జరిగింది. అన్న దారిలోనే జగన్ రెడ్డి వెళ్తున్నారు. జడ్జి గారికి వజ్రాల రిస్ట్ వాచ్ రూపంలో 2 కోట్ల లంచం ఇవ్వాలని చూడటం ఆయనను ప్రలోభపెట్టడమే కదా. జగన్ రెడ్డిపై సీబీఐ, ఈడీ కేసులు ఉన్నాయి. గాలి జనార్థన్ రెడ్డికి, జగన్ రెడ్డికి ఏంటి తేడా? ఇద్దరూ ఒక్కటే కదా. వ్యవస్థలను మేనేజ్ చేసుకుని బతకడమేనా? జగన్ రెడ్డి కేసుల్లో ఈ వాయిదాలేంటి? ముఖ్యమంత్రి కోర్టులో బాల్ ఉంది. సమాధానం చెప్పాలి. దొంగకు తేలుకుట్టినట్లు సీఎం వ్యవహరిస్తున్నారు. హైకోర్టు జడ్జికి టీటీడీ ఈవో ధర్మారెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రూ.2 కోట్ల విలువైన వజ్రాల రిస్ట్ వాచ్ లంచం ఇవ్వజూపిన వ్యవహారంలో సీబీఐతో సుప్రీంకోర్టు ఎందుకు విచారణ జరిపించలేదు? మీ మౌనానికి కారణాలేంటి?

ఇప్పటికైనా హైకోర్టు జడ్జి ఫిర్యాదుపై సీబీఐ విచారణ జరిపించాలి. జడ్జి రాసిన లేఖపైనా విచారణ జరిపించకపోతే న్యాయం ఎక్కడ? టీటీడీ ఈవో ధర్మారెడ్డి కింగ్ ఆఫ్ లాబీయింగ్. పైరవీ సామ్రాట్. అతని బతుకంతా అంతే. తిరుమలకు వచ్చే ప్రతి వ్యక్తిని ప్రసన్నం చేసుకునే వ్యక్తి ధర్మారెడ్డి. ఢిల్లీలో వైఎస్ కుటుంబానికి పైరవీలు చేస్తుంటాడు. వివేకా కూతురు వైఎస్ సునీతను హోం సెక్రటరీ దగ్గర సమావేశం పెట్టించింది ధర్మారెడ్డే. రఘురామకృష్ణంరాజు వ్యవహారంలో మిలటరీ ఆసుపత్రిని మేనేజ్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ధర్మారెడ్డి లాంటి వ్యక్తి టీటీడీలో ఉండటం సిగ్గుచేటు.

పైరవీకారుడు టీటీడీ ఈవోగా ఉండొచ్చా? ఢిల్లీ కంటోన్మెంట్ లో పనిచేస్తున్నప్పుడు ఆయనపై 14 సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి. ఇలాంటి వ్యక్తి టీటీడీలో ఉండొచ్చా? టీటీడీ డాలర్ల కుంభకోణంలో ధర్మారెడ్డి పీఏ ఆత్మహత్య చేసుకోలేదా? మీ ఆటలు ఇక సాగబోవు. ఈ వ్యవహారంతో మీరు అవుట్. లంచం తీసుకున్నవారికంటే ఇచ్చినవారు కూడా నేరస్థులే. కేసు రిజిస్టర్ చేసి ఇద్దరినీ అరెస్ట్ చేయాలి. రెండు కోట్లు ఎవరి ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్స్ లో చూపించారో తేలాలి. జగన్ రెడ్డి దగ్గర తీసుకెళ్లారా, లేదా దేవుడి ఖాతాలో తీసుకెళ్లారో తేలాలి. మీ స్వామి జగన్ రెడ్డిపై భక్తితో మా స్వామి ఏడుకొండల వాడి రిస్ట్ వాచ్ కొట్టేశారా? సీబీఐతో విచారణ జరిపించాలి.

LEAVE A RESPONSE