Suryaa.co.in

Andhra Pradesh

అత్యంత వేగంగా తుంగభద్ర డ్యామ్ గేట్ పునరుద్ధరించే ప్రక్రియ

  •  గేట్ ఏర్పాటుకు సంబంధించి అడ్డంకిగా పైనున్న ఉన్న 30 టన్నుల కౌంటర్ వైట్ తొలగింపు
  • గంట గంటకు డాం వద్ద ఏం జరుగుతోందనేది అధికారుల బృందంతో పర్యవేక్షణ చేస్తున్నాం
  • ఈరోజు సాయంత్రంలోపు తొలిగేటును దించేలా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం
  • రైతులు ఎలాంటి ఆందోళన చెందరాదు.. తమ ప్రభుత్వం, తాము రైతుల కోసం పని చేస్తున్నాం
  • రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్

అనంతపురం, ఆగస్టు 16 : అత్యంత వేగంగా తుంగభద్ర డ్యామ్ గేట్ పునరుద్ధరించే ప్రక్రియ చెప్పడం జరుగుతోందని రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు. శుక్రవారం అనంతపురం నగరంలోని ఆర్.అండ్.బి అతిథి గృహంలో తుంగభద్ర డ్యామ్ లో గేట్ పునరుద్ధరించే ప్రక్రియపై మంత్రి మాట్లాడారు.

ఈ సందర్భంగా మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ.. తుంగభద్ర డ్యామ్ లో గేట్ నెంబర్ 19 వరదలో కొట్టుకొనిపోగా దానిని పునరుద్ధరించే కార్యక్రమం చేపడుతున్నామన్నారు. గంట గంటకు డాం వద్ద ఏం జరుగుతోంది అనేది అధికారుల బృందంతో పర్యవేక్షణ చేయడం జరుగుతోందన్నారు. గేట్ ఏర్పాటుకు సంబంధించి అడ్డంకిగా పైనున్న ఉన్న 30 టన్నుల కౌంటర్ వైట్ ని శుక్రవారం కిందికి దించడం జరిగిందని, అతి జాగ్రత్తగా, సురక్షితంగా దానిని కిందకి రావడం జరిగిందన్నారు.

ఇది మొదటి విజయంగా మనం భావించవచ్చన్నారు. 30 టన్నుల బరువు ఎక్కడ పడుతుందో అనే ఆందోళన అధికారులందరిలో ఉండిందని, అది కింద పడితే డ్యామ్ కు చీలికలు ప్రమాదం జరిగే పరిస్థితులు ఉండేవని, దానిని 90 టన్నుల క్రైన్లు రెండు పెట్టుకుని 30 టన్నుల బరువుని సురక్షితంగా కిందకు దించడం జరిగిందన్నారు. మిగిలిన స్ట్రక్చర్ తొలగింపు మొదలుపెట్టడం జరిగిందన్నారు.

గేట్లు దించడానికి పైనున్న స్ట్రక్చర్ ఏదైతే ఉందో హాయిస్ట్ అనే దానిని కట్ చేసి ఈరోజు సాయంత్రంలోపు దానిని ఓపెన్ చేయడం జరుగుతుందని, దాని తర్వాత సాధ్యమైనంత మేరకు ఈరోజు సాయంత్రంలోపు తొలిగేటను దించేలా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకోవడం జరిగిందని, ఈ కార్యక్రమం సజావుగా జరుగుతుందని భావిస్తున్నామన్నారు. మొదటి గేటు దించడం విజయవంతం అయితే రెండు, మూడు గేట్లు కూడా దించడం సులభతరం అవుతుందని నమ్మకంతో ఉన్నామన్నారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందరాదని, ప్రభుత్వం, తామంతా రైతుల కోసం పని చేస్తున్నామన్నారు.

LEAVE A RESPONSE